భగ్గుమంటున్న నిత్యావసర ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి గుడ్ న్యూస్! కీలకమైన ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థ ప్రకటించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 183.50 తగ్గింది. ఈ ధర తగ్గింపు జులై 1, అంటే నేటి నుంచే అమల్లోకి వచ్చింది.

తాజా ధర తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,930కి చేరింది.
కాగా ఇళ్లల్లో వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర మాత్రం మారలేదు. దిల్లీలో దీని ధర రూ. 942గా ఉంది.
వివిధ నగరాల్లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..
- దిల్లీ- రూ. 2930
- ముంబై- రూ. 2885.50
- కోల్కతా- రూ. 3072
- చెన్నై- రూ .3100
- బెంగళూరు- రూ. 3021
- హైదరాబాద్- రూ. 3191
- విజయవాడ- రూ. 3128
కాగా హైదరాబాద్, విజయవాడలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలు వరుసగా రూ. 994, రూ. 966.50గా ఉన్నాయి.
ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గడం ఎందుకు ముఖ్యం?
అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ చాలా నెలల పాటు మూతపడింది. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. అందుకే, నష్టాలను పూడ్చుకునేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు మే నెల నుంచి సిలిండర్ల ధరలను పెంచుతూ వచ్చాయి.
మరీ ముఖ్యంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇది రెస్టారెంట్లు, హోటళ్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితంగా ఆయ చోట్ల మెన్యూలో, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది సామాన్యుడిపై పెను ప్రభావం చూపించింది.
ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర పరిస్థితులు శాంతించాయి! అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం చర్చలు నడుస్తుండటం ఇందుకు కారణం. చమురు సరఫరా సైతం పుంజుకుంది. ఈ క్రమంలోనే సామాన్యుడిపై పడిన భారాన్ని తగ్గించే విధంగా చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి.
{{/usCountry}}ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర పరిస్థితులు శాంతించాయి! అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం చర్చలు నడుస్తుండటం ఇందుకు కారణం. చమురు సరఫరా సైతం పుంజుకుంది. ఈ క్రమంలోనే సామాన్యుడిపై పడిన భారాన్ని తగ్గించే విధంగా చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి.
{{/usCountry}}2026లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇదే తొలిసారి!
మరి పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితేంటి?
అమెరికా- ఇరాన్ అనిశ్చితి వేళ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సైతం భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇతర నిత్యావసర వస్తువుల మీద కూడా పడింది. ఫలితంగా సామాన్యుడి సేవింగ్స్కి గండిపడింది.
ఇక ఇప్పుడు సిలిండర్ ధరలు తగ్గడంతో ప్రజల చూపు పెట్రోల్, డీజిల్ ధరలవైపు మళ్లింది. ఇంధన ధరల తగ్గింపు వార్త కూడా వస్తుందేమో అని ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంకా నష్టాలను పూడ్చుకోలేదని, అందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.