...
...
Next Story

680 కి.మీ రేంజ్​ ఇచ్చే మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై భారీ డిస్కౌంట్లు..

మహీంద్రా సరికొత్త బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్​యూవీపై అదిరిపోయే బెనిఫిట్స్​ని అందిస్తోంది. 682 కిమీ రేంజ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ కారుపై పరిమిత కాల ఆఫర్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Dec 30, 2025 06:00 AM IST
Advertisement

మహీంద్రా నుంచి ఏడాది లాంచ్​ అయిన బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి డిమాండ్​ మామూలుగా లేదు! ఈ కారును కొనేందుకు కొనేందుకు కస్టమర్లు భారీ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ మహీంద్రా బీఈ 6 కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై సంస్థ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఆఫర్లు..

మహీంద్రా బీఈ 6
మహీంద్రా బీఈ 6

ఈ మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ. 2.5 లక్షల వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం 2025, డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, అది కూడా పరిమిత స్టాక్ ఉన్నంత వరకేనని స్పష్టం చేసింది.

ఈ భారీ డిస్కౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం కస్టమర్లు తమ సమీపంలోని మహీంద్రా అధీకృత డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు. అదే సమయంలో వెహికిల్​ని టెస్ట్​ డ్రైవ్​ చేసే ఆప్షన్​ ఉంటుంది.

మహీంద్రా బీఈ 6 బ్యాటరీ సామర్థ్యం, రేంజ్..

మహీంద్రా బీఈ 6 మోడల్ రియర్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తోంది. ఇందులో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను సంస్థ అందిస్తోంది. 59 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 535 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అదే 79 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉన్న వేరియంట్ ఏకంగా 682 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మహీంద్రా పేర్కొంది.

మహీంద్రా బీఈ 6 బ్యాటరీ- పవర్, పనితీరు..

సామర్థ్యం విషయంలోనూ ఈ మహీంద్రా బీఈ 6 ఈవీ ఎక్కడా తగ్గదు. 59 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 230 బీహెచ్​పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్ అయిన 79 కేడబ్ల్యూహెచ్​ వేరియంట్ 285 బీహెచ్​పీ పవర్‌ను అందిస్తుంది.

మరోవైపు మహీంద్రా బీఈ 6లోని అన్ని మోడల్స్ 175 కేడబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. సరైన డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే, కేవలం 20 నిమిషాల లోపే ఈ కారు బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం.

మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ధరల వివరాలు..

మహీంద్రా బీఈ 6 ధరల విషయానికి వస్తే, బేస్ వేరియంట్ రూ. 18.90 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్ రూ. 27.65 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధరలు) ఉంటుంది.

లిమిటెడ్ 'ఫార్ములా ఎడిషన్' ప్రత్యేకం..

ఇటీవలే మహీంద్రా బీఈ 6లో ‘ఫార్ములా ఎడిషన్’ కోసం ‘యాడ్ టు కార్ట్’ ఆప్షన్‌ను ప్రారంభించింది. దీని ధర రూ. 23.69 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. దీని బుకింగ్‌లు 2026, జనవరి 14న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎడిషన్‌లో కారు డిజైన్ పరంగా మరిన్ని ఆకర్షణీయమైన మార్పులు చేశారు.

తొలి 999 మంది కస్టమర్ల కోసం మహీంద్రా అదిరిపోయే ఆఫర్లను సిద్ధం చేసింది. వీరందరికీ చెన్నైలో జరిగే ట్రాక్ డే ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీటితో పాటు కలెక్టర్ బాక్స్, యూనిక్ డెకాల్స్, కారు సైడ్ ప్రొఫైల్‌పై కొనుగోలుదారుడి పేరును చెక్కడం వంటి ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే ఒక లక్కీ డ్రా ద్వారా ఎంపికైన కస్టమర్లను 2026 ఆగస్టులో జరిగే 'లండన్ ఈ-ప్రిక్స్​'కి తీసుకెళ్లనున్నారు. అంతేకాదు, మీ చిన్నారుల కోసం మీరు కొన్న కారు లాగే ఉండే ఒక చిన్న మినియేచర్ ఎలక్ట్రిక్ కారును కూడా బహుమతిగా ఇస్తారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe