Mahindra BE 6 Sporteq : మార్కెట్లోకి మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్- వేరియంట్లు, ధర..

భారత మార్కెట్లో మహింద్రా సంస్థ తన కొత్త బీఈ 6 'స్పోర్టెక్' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అనేక వేరియంట్లలో విడుదల చేసింది. ఈ కార్ల ప్రారంభ ధర రూ. 19.45 లక్షల నుంచి మొదలవుతుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 15, 2026, 12:20:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైనప్‌ను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా సరికొత్త వేరియంట్లు, ప్రత్యేక ఎడిషన్లతో కూడిన బీఈ 6 ‘స్పోర్టెక్’ శ్రేణిని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ. 19.45 లక్షల నుంచి రూ. 26.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. అయితే ఛార్జర్, ఇన్‌స్టాలేషన్ ఖర్చులు దీనికి అదనం.

మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్
మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్

మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్- బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్..

ఈ కొత్త స్పోర్టెక్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. 59 kWh, 70 kWh అలాగే 79 kWh బ్యాటరీ ఆప్షన్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా మహీంద్రా ఇందులో 'బీఏఏఎస్' (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) ఆప్షన్‌ను కూడా పరిచయం చేసింది. దీని ప్రకారం వన్, టూ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 11.45 లక్షలు, రూ. 12.95 లక్షలుగా ఉండగా, బ్యాటరీ ఖర్చును కిలోమీటర్‌కు రూ. 3.76 చొప్పున వేరుగా వసూలు చేస్తారు. 59 kWh బ్యాటరీ వన్, టూ, త్రీ వేరియంట్లలో లభిస్తుండగా, 70 kWh యూనిట్ త్రీ, త్రీ ప్లస్ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే 79 kWh బ్యాటరీని త్రీ ప్లస్, ఫోర్, లాంచ్ ఎడిషన్, ఎఫ్‌ఈ, ఎఫ్‌ఈ ఫోర్ వేరియంట్లలో అందిస్తున్నారు.

ఫార్ములా ఈ-స్ఫూర్తితో కొత్త ఎఫ్​ఈ వేరియంట్..

ఈ కొత్త మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్ ఎస్‌యూవీలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 'ఎఫ్​ఈ' వేరియంట్ ఫార్ములా ఈ రేసింగ్ థీమ్‌తో రూపుదిద్దుకుంది. ఇందులో బ్లాక్, ఫైర్‌స్టార్మ్ ఆరెంజ్ ఇంటీరియర్, లెదరెట్, స్యూడ్ అప్​హోలిస్ట్రీ, రూఫ్‌పై ఎఫ్​ఈ డెకల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్యాబిన్ లోపల డ్యుయల్ సూపర్ హెచ్‌డీ స్క్రీన్లు, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, నైట్‌టైల్ కార్పెట్ ల్యాంప్స్ వంటి అధునాతన హంగులను అమర్చారు. 79 kWh బ్యాటరీతో వచ్చే ఈ ఎఫ్​ఈ వేరియంట్ ధర రూ. 24.45 లక్షలుగా ఉంది. దీనికి తోడు ఆర్20 అలాయ్ వీల్స్, ఇంటెలిజెంట్ అడాప్టివ్ సస్పెన్షన్, 540-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లభిస్తున్నాయి.

అధునాతన ఫీచర్లతో ఎఫ్​ఈ ఫోర్, ఇతర వేరియంట్లు..

మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్ ఎఫ్​ఈ ఫోర్ వేరియంట్ ధర రూ. 26.95 లక్షలుగా ఉండగా, ఇందులో ఎల్2+ అడాస్, విజన్‌ఎక్స్ ఏఆర్ హెచ్‌యూడీ, ఆటోమేటిక్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ సీట్లు వంటి అత్యాధునిక టెక్నాలజీ లభిస్తుంది. రెగ్యులర్ ఫోర్, లాంచ్ ఎడిషన్ మోడల్స్ కూడా అదే ధరకు లభిస్తుండగా, గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్, పర్సనలైజ్డ్ టెయిల్‌గేట్ మెసేజింగ్, డ్రిఫ్ట్ మోడ్, రివైవ్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఆటోమేటిక్ యూజర్-ప్రొఫైల్ డిటెక్షన్, ఛార్జ్ షెడ్యూలింగ్, క్యాబిన్ ప్రీ-కూలింగ్, ఎన్‌ఎఫ్‌సీ డిజిటల్ కీ, ఇన్-కార్ గేమింగ్, కారియోకే, డాల్బీ విజన్ వంటి కనెక్టెడ్ ఫీచర్లను ఈ శ్రేణి అంతటా అందించారు.

మహీంద్రా స్కార్పియో లైఫ్​స్టైలర్..

మరోవైపు మహీంద్రా సంస్థ తన పికప్​ ట్రక్​ని తాజాగా పరిచయం చేసింది. దాని పేరు మహీంద్రా స్కార్పియో లైఫ్​స్టైలర్. భారత మార్కెట్లోకి 2027 ఏప్రిల్ నాటికి ఈ వాహనం రానుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.79 లక్షల కంటే తక్కువగానే ప్రారంభం కానుందని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More