భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వచ్చే నెలలోనే భారత రోడ్లపైకి అడుగుపెట్టనున్న ఈ కొత్త వర్షన్‌కు సంబంధించిన ఫోటోలు చూస్తుంటే.. ఇందులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో స్పష్టత వచ్చేసింది. ఎక్స్టీరియర్లో చిన్నపాటి సరిదిద్దుబాట్లే చేసినప్పటికీ, కారు ఇంటీరియర్ మాత్రం మహీంద్రా భారీ స్థాయిలో టెక్ అప్‌గ్రేడ్స్ చేసినట్లు తెలుస్తోంది.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్- ఎక్స్‌టీరియర్ డిజైన్..

లీక్ అయిన ఫొటోలను గమనిస్తే.. స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌లో పెద్దగా విప్లవాత్మక మార్పులేవీ చేయలేదని అర్థమవుతోంది. ప్రస్తుత మోడల్‌లోని గంభీరమైన లుక్‌ను అలాగే కాపాడారు. ఒక ప్రధాన మార్పు ఏంటంటే, ఇందులో అందించిన నూతన మోడ్రన్ అల్లాయ్ వీల్స్. ఇవి కారు సైడ్ ప్రొఫైల్‌కు కొత్త రూపును ఇచ్చాయి.
ముందు భాగంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, హెడ్‌లాంప్స్, ఫాగ్ లాంప్స్, బంపర్ డిజైన్ మునుపటిలాగే కొనసాగుతున్నాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్స్, సిల్వర్ రూఫ్ రైల్స్, విండో లైన్‌పై ఉన్న క్రోమ్ ఫినిషింగ్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సైడ్ బాడీ క్లాడింగ్ అన్నీ పాత మోడల్‌నే పోలి ఉన్నాయి. రోడ్డుపై స్కార్పియోకు ఉండే బలమైన 'రోడ్ ప్రెజెన్స్' ఏమాత్రం దెబ్బతినకుండా మహీంద్రా జాగ్రత్త పడింది.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్- కేబిన్‌లో ఊహించని మార్పులు!
బయటి డిజైన్ ఎలా ఉన్నా, మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ లోపల మాత్రం డ్రైవర్లకు, ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా మహీంద్రా రీ-డిజైన్ చేసింది. ఎస్‌యూవీలోని పాత బ్రౌన్ అండ్ బ్లాక్ డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌ను అలాగే ఉంచినప్పటికీ, డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను మరింత మోడ్రన్‌గా మార్చారు.
రెండు భారీ స్క్రీన్లు: థార్ రాక్స్ తరహాలోనే 10.25-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు, పూర్తిస్థాయి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}రెండు భారీ స్క్రీన్లు: థార్ రాక్స్ తరహాలోనే 10.25-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు, పూర్తిస్థాయి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}నయా డ్యాష్‌బోర్డ్ లేఅవుట్: టచ్‌స్క్రీన్ పరిమాణం పెరగడంతో సెంట్రల్ ఏసీ వెంట్లను స్క్రీన్ కిందకి మార్చారు. సెంటర్ కన్సోల్‌లోని స్విచ్ గేర్‌ను కూడా కొత్త డిజైన్‌లో తీర్చిదిద్దినట్లు లీక్డ్ పిక్స్ చూస్తే తెలుస్తోంది.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్- అదిరిపోయే ఫీచర్లు..
కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రీమియం ఫీచర్ల జాబితాను మరింత లెంథీగా మార్చనున్నారు. ఇందులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-స్పీకర్ల సోనీ సౌండ్ సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఒకెత్తయితే, ఈసారి పనోరమిక్ సన్‌రూఫ్ జతచేసే అవకాశం ఉండడం భారతీయ ఫ్యామిలీ బైయర్స్‌ను విశేషంగా ఆకట్టుకోనుంది.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్- ఇంజన్, పవర్‌ట్రెయిన్..
మెకానికల్ పరంగా చూస్తే, కొత్త స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుత మోడల్‌లోని 2.0-లీటర్ టర్బో-పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లనే కొనసాగించే అవకాశం ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ లభిస్తాయి. డీజిల్ వేరియంట్లలో ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారి కోసం లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్‌తో కూడిన 4x4 (ఫోర్-వీల్ డ్రైవ్) ఆప్షన్‌ను అలాగే ఉంచనున్నారు.
ఈ మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఆగస్ట్ 14, 15 తేదీల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.