ఎస్‌యూవీలకు మారుపేరుగా నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా తన లైనప్‌లో మరో మోడల్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. విజన్ ఎస్ పేరుతో వస్తున్న కొత్త మోడల్ ఇప్పటికే అనేక మార్లు భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఇక ఇప్పుడు, మరోసారి ఈ ఎస్‌యూవీ దర్శనమిచ్చింది. టెస్టింగ్ వాహనం భారీగా కప్పి ఉంచినప్పటికీ, మహీంద్రా ఒక ప్రత్యేకమైన, పర్పస్-డ్రివెన్ ఎస్‌యూవీపై పని చేస్తోందని స్పై షాట్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది. విజన్ ఎస్ 2027 ప్రారంభంలో విక్రయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా విజన్ ఎస్- డిజైన్, ఎక్స్‌టీరియర్..
ఈ మహీంద్రా విజన్ ఎస్ అనేది బెస్ట్ సెల్లింగ్ స్కార్పియో ఫ్యామిలీ చేరుతుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా, స్కార్పియో- ఎన్కి ఇది బుడ్డి వర్షెన్ అని సమాచారం.
ఇక కొత్త స్పై వీడియోని చూస్తే.. ఈ విజన్ ఎస్ బాక్సీ, నిటారుగా ఉండే సిల్హౌట్‌ను కలిగి ఉందని స్పష్టమవుతోంది. ఇది అసలుసిసలైన ఎస్‌యూవీ క్యారెక్టర్‌ను ప్రతిబింబిస్తోంది. ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్స్, వర్టికల్ స్లాట్‌లతో కూడిన బోల్డ్ గ్రిల్, ప్రముఖమైన మహీంద్రా బ్యాడ్జ్ ఉన్నాయి. స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు, చంకీ బాడీ క్లాడింగ్, ఫ్లాట్ బాడీ ప్యానెల్‌లు దీనికి కఠినమైన రూపాన్ని ఇస్తాయి. వెనుక భాగంలో నిలువుగా ఉండే టైల్ ల్యాంప్స్, నిటారుగా ఉండే టెయిల్‌గేట్, టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ వంటివి ఉన్నాయి.
అయితే ఈ ఎస్‌యూవీ రెండు వైపులా ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్. భద్రతా కారణాల దృష్ట్యా చైనా ఇటువంటి డోర్ హ్యాండిల్స్‌ను ఇటీవలే నిషేధించింది. ఇతర దేశాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉన్నందున, మహీంద్రా అధికారిక లాంచ్ సమయంలో వీటినే కొనసాగిస్తుందా లేదా మార్చుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం.
మహీంద్రా విజన్ ఎస్- ఇంటీరియర్, ఫీచర్లు..
{{/usCountry}}అయితే ఈ ఎస్‌యూవీ రెండు వైపులా ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్. భద్రతా కారణాల దృష్ట్యా చైనా ఇటువంటి డోర్ హ్యాండిల్స్‌ను ఇటీవలే నిషేధించింది. ఇతర దేశాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉన్నందున, మహీంద్రా అధికారిక లాంచ్ సమయంలో వీటినే కొనసాగిస్తుందా లేదా మార్చుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం.
మహీంద్రా విజన్ ఎస్- ఇంటీరియర్, ఫీచర్లు..
{{/usCountry}}లోపలి భాగం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ ప్రస్తుత మోడళ్ల కంటే ఈ మహీంద్రా విజన్ ఎస్ ఆధునిక ఫీచర్లతో రానుందని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి కొన్ని ఫీచర్లు ఆశించవచ్చు.
భద్రత పరంగా ఇందులో ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండనున్నాయి.
మహీంద్రా విజన్ ఎస్- మెకానికల్, ప్లాట్‌ఫారమ్..
మహీంద్రా విజన్ ఎస్ కొత్త తరం “ఫ్రీడమ్ ఎన్.యూ” అనే ప్లాట్‌ఫారమ్‌పై తయారువుతోంది. ఇది మెరుగైన రైడ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ ప్లాట్‌ఫారమ్ భవిష్యత్తులో రాబోయే ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల మహీంద్రా తన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి విజన్ ఎస్ దోహదపడుతుంది.
ఈ మహీంద్రా విజన్ ఎస్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎస్‌యూవీ ఇంజిన్, వేరియంట్లు, ధరల వివరాలు లాంచ్ నాటికి వెలువడే అవకాశం ఉంది.