మహీంద్రా XUV 3XO ఈవీ- సిటీ డ్రైవ్‌కి బెస్ట్ ఎలక్ట్రిక్ కారు! రేంజ్, ధర వివరాలు..
మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఈవీని లాంచ్ చేసింది. రూ. 13.89 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఎస్‌యూవీ ఫీచర్స్, రేంజ్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మంచి జోరు మీద ఉంది! బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ అయిన ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓని లాంచ్ చేసిన మరుసటి రోజే (మంగళవారం) సరికొత్త ఈవీని కూడా విడుదల చేసింది. అదే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (ఎక్స్‌యూవీ 300కి ఫేస్‌లిఫ్ట్)కి ఎలక్ట్రిక్ వర్షెన్. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ- బ్యాటరీ, పర్ఫార్మెన్స్..
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 39.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 285 కిలోమీటర్ల వరకు (రియల్ వరల్డ్ రేంజ్) ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 110 కేడబ్ల్యూ పవర్‌ను, 310 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ కేవలం 8.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని, ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత వేగవంతమైన కారుగా నిలుస్తోంది. డ్రైవర్ల అభిరుచికి తగ్గట్టుగా ఇందులో ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లను అందించారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ- స్టైలిష్ ఎక్స్‌టీరియర్..
చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సింగిల్ పేన్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సిగ్నేచర్ టెయిల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్లు దీనికి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ- టెక్నాలజీ, ఇంటీరియర్..
ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ లోపల అడుగుపెట్టగానే రెండు 10.25 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లేలు కన్పిస్తాయి. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కేటాయించారు. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, అలెక్సా సపోర్ట్ ఉన్న అడ్రెనాక్స్ కనెక్టివిటీ వంటి 80కి పైగా స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయంతో పాటు ఆరు స్పీకర్ల ఆడియో సిస్టమ్ ప్రయాణాన్ని మరింత ఉల్లాసంగా మారుస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ- భద్రతకు పెద్దపీట..
భద్రత విషయంలో మహీంద్రా ఎక్కడా రాజీ పడలేదు. లెవల్-2 అడాస్ టెక్నాలజీతో పాటు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి 35 రకాల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందించారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ- ధర, వేరియంట్లు..
- మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ రెండు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది.
- ఏఎక్స్5 వేరియంట్: రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- ఏఎక్స్7ఎల్ వేరియంట్: రూ. 14.96 లక్షలు (ఎక్స్-షోరూమ్)
నగర ప్రయాణాలకు, చిన్నపాటి దూరాలకు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


