...
...
Next Story

Vijay TVK Government : మ్యాజిగ్ ఫిగర్ ఉండాల్సిందే...! టీవీకే సర్కార్ ఏర్పాటుపై గవర్నర్ కీలక ప్రకటన

Vijay TVK Government : తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదలైంది.

Published on: May 07, 2026 04:01 PM IST
Advertisement

Vijay TVK Government : తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొంది. మూడు దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వంద్వ ఆధిపత్యానికి చెక్ పెడుతూ సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK)కు అధికార పీఠం దక్కే విషయంలో మ్యాజిక్ ఫిగర్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన విడుదలైంది.

లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన

తమిళనాడులో కొనసాగుతున్న హైడ్రామా - గవర్నర్ కార్యాలయం కీలక ప్రకటన
తమిళనాడులో కొనసాగుతున్న హైడ్రామా - గవర్నర్ కార్యాలయం కీలక ప్రకటన

గురువారం చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. అయితే…. ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు టీవీకేకు లేదని గవర్నర్ వివరించినట్లు ఓ ప్రకటన విడుదలైంది.

"తమిళనాడు శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ మద్దతు ఇప్పటి వరకు నిరూపితం కాలేదు" అని లోక్ భవన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

తాజా పరిణామంతో విజయ్ వర్గంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రస్తుతం టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా…. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించారు. దీనితో మొత్తం బలం 112కు చేరింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ (118) అందుకోవడానికి విజయ్ కూటమికి ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని విజయ్ మరోసారి కోరినట్లు తెలిసింది. ఆ తర్వాత సభలో మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ విజయ్ అభ్యర్థననురెండోసారి కూడా గవర్నర్ తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe