భారత స్టాక్ మార్కెట్లలో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బుల్స్ సందడి కనిపించింది. భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందన్న ఆశలు, అంతర్జాతీయంగా అనుకూల పవనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో జనవరి 28 (బుధవారం) ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు దృష్టి సారించాల్సిన రెండు కీలక స్టాక్స్‌ను 'మార్కెట్‌స్మిత్ ఇండియా' విశ్లేషించింది.

మంగళవారం సెషన్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 దాదాపు 0.51 శాతం లాభపడి 25,175 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 81,857 వద్ద ముగిసింది. ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్ రంగాలు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి.
మార్కెట్‌స్మిత్ ఇండియా నేటి సిఫారసులు
నేటి మార్కెట్ గమనాన్ని బట్టి ఇన్వెస్టర్లు ఈ క్రింది రెండు షేర్లను గమనించవచ్చు:
1. అల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement Limited)
దేశీయ సిమెంట్ రంగంలో తిరుగులేని నాయకత్వం వహిస్తున్న ఈ సంస్థపై మార్కెట్ వర్గాలు సానుకూలంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, గృహ నిర్మాణ రంగాల్లో వృద్ధి అల్ట్రాటెక్ సిమెంట్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
టెక్నికల్ అనాలిసిస్: చార్టుల్లో 'కప్-విత్-హ్యాండిల్' (Cup-with-handle) బ్రేకౌట్ కనిపిస్తోంది.
కొనుగోలు ధర: ₹12,650 – ₹12,800 మధ్య
టార్గెట్ ధర: ₹14,500 (రెండు నుంచి మూడు నెలల కాలపరిమితితో)
స్టాప్ లాస్: ₹12,000
2. హిందుస్థాన్ కాపర్ (Hindustan Copper Limited)
ఎలక్ట్రిక్ వాహనాలు (EV), పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో రాగి (Copper)కి డిమాండ్ భారీగా పెరగనుంది. ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థకు ఇది గొప్ప అవకాశం.
టెక్నికల్ అనాలిసిస్: చార్టుల్లో 'బుల్లిష్ ఫ్లాగ్' (Bullish Flag) బ్రేకౌట్ సూచనలు కనిపిస్తున్నాయి.
{{/usCountry}}టెక్నికల్ అనాలిసిస్: చార్టుల్లో 'బుల్లిష్ ఫ్లాగ్' (Bullish Flag) బ్రేకౌట్ సూచనలు కనిపిస్తున్నాయి.
{{/usCountry}}కొనుగోలు ధర: ₹558 – ₹565 మధ్య
టార్గెట్ ధర: ₹630 (రెండు నుంచి మూడు నెలల కాలపరిమితితో)
స్టాప్ లాస్: ₹530
మార్కెట్ విశ్లేషణ: నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయి?
నిఫ్టీ 50: గత సెషన్‌లో నిఫ్టీ మెటల్ ఏకంగా 3 శాతం జూలు విదిల్చింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు పరుగులు తీశాయి. అయితే ఆటో, ఎఫ్‌ఎమ్‌సిజీ రంగాల్లో స్వల్పంగా లాభాల స్వీకరణ కనిపించింది. సాంకేతికంగా చూస్తే, నిఫ్టీకి 24,900 – 25,000 వద్ద బలమైన మద్దతు ఉంది. పైకి వెళ్తే 25,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఆర్ఎస్ఐ (RSI) ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉన్నందున, మార్కెట్ ఇక్కడి నుంచి పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బ్యాంక్ నిఫ్టీ: బ్యాంకింగ్ రంగం మంగళవారం అద్భుతమైన రికవరీని సాధించింది. యాక్సిస్ బ్యాంక్ 5 శాతం లాభపడటం మార్కెట్‌కు ఊతమిచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 59,205 వద్ద ముగిసింది. ఇది తన 100-డిఎంఏ (100-DMA) స్థాయిని నిలబెట్టుకోవడం శుభపరిణామం. రాబోయే రోజుల్లో 59,500 దాటితే 60,000 మార్కును తాకే అవకాశం ఉంది.
(నోట్: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. మార్కెట్‌స్మిత్ ఇండియా వారి విశ్లేషణ ప్రకారం ఈ సూచనలు ఇచ్చాం. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.)