ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనూ మారుతీ సుజుకికీ చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘బలెనో’.. సేల్స్ చార్టుల్లో అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ సత్తా చాటుతోంది. నెలకు దాదాపు వేల సంఖ్యలో అమ్ముడవుతూ అనేక కాంపాక్ట్ ఎస్‌యూవీల అమ్మకాలను సైతం దాటేస్తోంది.

అయితే, మారుతున్న వినియోగదారుల కోరికలకు అనుగుణంగా మారుతీ సుజుకీ సంస్థ బలెనో ఫేస్‌లిఫ్ట్‌ను చిన్నపాటి డిజైన్ మార్పులు, అదనపు సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరి ఈ అప్‌డేటెడ్ హ్యాచ్‌బ్యాక్ నేటి ఎస్‌యూవీల పోటీని తట్టుకోగలదా? మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఇక్కడ చూసేయండి..
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ- ఎక్స్‌టీరియర్ డిజైన్..
ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే.. బలెనో ప్రాథమిక డిజైన్ శైలిని మార్చకూడదని మారుతీ సుజుకీ నిర్ణయించుకుంది. ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే అని చెప్పాలి. కారు ముందు భాగంలో నిలువుగా ఉండే క్రోమ్ స్లాట్‌లతో కూడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్‌ను అమర్చారు.
హెడ్‌లైట్లు, బంపర్ల ఆకృతి, కారు ఓవరాల్ సిల్హౌట్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ పాత మోడల్ తరహాలోనే ఉన్నాయి. మీరు ఆ కొత్త గ్రిల్‌ను జాగ్రత్తగా గమనిస్తే తప్ప పాత కారుకు, ఈ అప్‌డేటెడ్ కారుకు మధ్య ఉన్న తేడాను గుర్తించడం అంత తేలిక కాదు.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ- ఇంటీరియర్ ఫీచర్లు..
2026 మారుతీ సుజుకీ బలెనో క్యాబిన్ లోపల లేఅవుట్ పాత మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, లేయర్డ్ డాష్‌బోర్డ్ డిజైన్ ఇప్పటికీ మోడర్న్‌గా కనిపిస్తుంది. డాష్‌బోర్డ్‌పై లైట్ బ్లూ ఫినిషింగ్, దానికి సరిపోయేలా బ్లూ అండ్ బ్లాక్ డ్యూయల్-టోన్ సీట్ అప్‌హోల్‌స్టరీని అందించడం వల్ల ఇంటీరియర్‌కి కొత్త కలర్ థీమ్ వచ్చింది.
అయితే, ఈసారి అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే—ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను బలెనో హ్యాచ్‌బ్యాక్‌లో ప్రవేశపెట్టారు. వేసవి కాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే భారతీయ వాతావరణ పరిస్థితులకు ఈ వెంటిలేటెడ్ సీట్లు చాలా ఉపయోగపడతాయి.
{{/usCountry}}అయితే, ఈసారి అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే—ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను బలెనో హ్యాచ్‌బ్యాక్‌లో ప్రవేశపెట్టారు. వేసవి కాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే భారతీయ వాతావరణ పరిస్థితులకు ఈ వెంటిలేటెడ్ సీట్లు చాలా ఉపయోగపడతాయి.
{{/usCountry}}దీనితో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), కూలింగ్ ఫంక్షన్‌తో కూడిన వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 9-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో, క్లారియోన్ సౌండ్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాకపోతే 360-డిగ్రీ కెమెరా డిస్‌ప్లే స్పష్టత ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేదనిపిస్తుంది.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ- రియర్ సీట్ అండ్ బూట్ స్పేస్..
ప్రాక్టికాలిటీ విషయంలో బలెనో ఎప్పుడూ ముందే ఉంటుంది. వెనుక సీటులో కూర్చునే ప్రయాణికులకు పుష్కలంగా లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభిస్తాయి. తొడల కింద మంచి సపోర్ట్ లభించడం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు సైతం హాయిగా సాగిపోతాయి. ముగ్గురు ప్రయాణికులు కూర్చోవచ్చు.
బలెనో బూట్ స్పేస్ సామర్థ్యం 318 లీటర్లుగా ఉంది. లగేజ్ వేసేటప్పుడు కాస్త ఎత్తుగా అనిపించినప్పటికీ, పెద్ద సైజు సూట్‌కేసులు, చిన్న బ్యాగులు సులువుగా పడతాయి. ఒకవేళ మరింత స్పేస్ కావాలనుకుంటే వెనుక సీట్లను మడతబెట్టి బూట్ సామర్థ్యాన్ని 750 లీటర్ల కంటే ఎక్కువగా పెంచుకోవచ్చు. కారు అడుగున పంక్చర్ రిపేర్ కిట్‌కు బదులుగా స్పేర్ వీల్‌ను అందించడం ప్రశంసనీయం.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
2026 మారుతీ సుజుకీ బలెనో బానెట్ కింద ప్రధాన మార్పు జరిగింది. పాత 4-సిలిండర్ ఇంజిన్ స్థానంలో ఇప్పుడు 1.2-లీటర్, 3-సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది దాదాపు 83 పీఎస్ పవర్‌ను, 112 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
మొత్తం మీద చూసుకుంటే ఈ హ్యాచ్‌బ్యాక్ 24 కేఎంపీఎల్ కన్నా ఎక్కువ మైలేజ్‌ని ఇస్తుంది.
3-సిలిండర్ ఇంజిన్ అయినప్పటికీ శబ్దాలు, వైబ్రేషన్లు లేకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. నగర ప్రయాణాల్లో తక్కువ వేగం వద్ద మెరుగైన టార్క్ లభించడం వల్ల సిటీ డ్రైవింగ్ సులువుగా మారుతుంది. అయితే హైవేపై వెళ్లేటప్పుడు, ముఖ్యంగా ఓవర్‌టేక్ చేసే సమయంలో ఏఎంటీ గేర్‌బాక్స్ కాస్త ఆలస్యంగా (షిఫ్ట్ ల్యాగ్) ప్రతిస్పందిస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని ఆస్వాదించాలనుకునే వారికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ సరైన ఎంపిక.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ- రైడ్ అండ్ హ్యాండ్లింగ్..
సస్పెన్షన్ సెటప్‌లో మార్పులు చేయకపోవడం వల్ల బలెనో తన బెస్ట్ క్వాలిటీ అయిన 'రైడ్ కంఫర్ట్'ను కాపాడుకుంది. బెంగళూరు అవుట్‌స్కర్ట్స్‌లో మా హెచ్‌టీ ఆటో టీమ్ జరిపిన టెస్ట్ డ్రైవ్‌లో గుంతల రోడ్లని కూడా ఈ సస్పెన్షన్ సిస్టమ్ చాలా సునాయాసంగా మేనేజ్ చేసింది. స్టీరింగ్ రెస్పాన్స్ సాధారణంగా ఉన్నప్పటికీ, మూలల్లో (కార్నరింగ్) కారు చాలా స్థిరంగా వెళుతుంది. బ్రేకింగ్ పవర్ కూడా చాలా నమ్మకమైన స్టాపింగ్ డిస్టెన్స్‌ను ఇస్తుంది.
కాకపోతే క్యాబిన్ ఇన్సులేషన్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. గంటకు 70 కి.మీ వేగం దాటిన తర్వాత రోడ్డు శబ్దం, గాలి శబ్దం క్యాబిన్‌లోకి స్వల్పంగా వినబడతాయి.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ- అత్యుత్తమ సేఫ్టీ!
ఈ అప్‌డేట్‌లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. టాప్-ఎండ్ ఆల్ఫా వేరియంట్‌లో లెవెల్-2 అడాస్ సేఫ్టీ ప్యాకేజీని ప్రవేశపెట్టడం. దీని ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి కీలక ఫీచర్లు లభిస్తాయి. భారతీయ రోడ్డు పరిస్థితులలో ఇది డ్రైవర్‌కు అదనపు రక్షణగా నిలుస్తుంది.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ- కొనాలా? వద్దా?
2026 మారుతీ సుజుకీ బాలెనో తన మూలసూత్రాలను మార్చకుండానే కస్టమర్లు ఆశించే అధునాతన వెంటిలేటెడ్ సీట్లు, అడాస్ వంటి టెక్నాలజీలను జోడించింది. 360-డిగ్రీ కెమెరా క్వాలిటీ, క్యాబిన్ ఇన్సులేషన్ విషయంలో చిన్నపాటి అసంతృప్తి ఉన్నప్పటికీ—విశాలమైన స్పేస్, సుఖవంతమైన ప్రయాణం, నమ్మకమైన మైలేజ్, మైయింటెనెన్స్ సౌలభ్యం వంటివి ఈ మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్‌ని ఇప్పటికీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తిరుగులేని విజేతగా నిలబెడుతున్నాయి!