Maruti Suzuki Brezza : బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో క్రేజీ మార్పులు- వెంటిలేటెడ్ సీట్లు, కొత్త ఇంజిన్ ఆప్షన్!
Maruti Suzuki Brezza facelift : మారుతీ సుజుకీ బ్రెజ్జా సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మార్కెట్లోకి రాబోతోంది. పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు బూట్ స్పేస్ పెంచేలా సరికొత్త అండర్‌బాడీ సీఎన్జీ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్ల లాంటి అదిరిపోయే ఫీచర్లు ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది.
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో 'మారుతీ సుజుకీ బ్రెజ్జా' ఒకటి. ఇప్పుడీ క్రేజీ కారు సరికొత్త హంగులతో, సరికొత్త రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. మారుతీ సుజుకీ సంస్థ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ ఎస్‌యూవీ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ పలుమార్లు కెమెరాలకు చిక్కింది. ఈ టెస్టింగ్ విజువల్స్‌ను బట్టి చూస్తే.. కారు బాహ్య ఎక్స్టీరియర్లో స్వల్ప మార్పులే ఉన్నప్పటికీ, ఫీచర్లు, ఇంజిన్ పరంగా మాత్రం భారీ అప్‌డేట్లే ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.

టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో సరికొత్త జోష్..
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్న అతిపెద్ద, ముఖ్యమైన మార్పు దాని ఇంజిన్‌లోనే ఉండబోతోంది. ప్రస్తుతమున్న 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పాటు ఈ ఎస్‌యూవీలో ఇప్పుడు సరికొత్తగా రెండో ఇంజిన్ ఆప్షన్‌ను కూడా తీసుకురానున్నారు. ఇందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందించబోతున్నట్లు నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కారులో ఇదే టర్బో ఇంజిన్‌ను వాడుతున్నారు.
ఈ చిన్న ఇంజిన్ కెపాసిటీ 1200సీసీ కంటే తక్కువగా ఉండటం వల్ల కారుపై పన్నుల భారం తగ్గి, ధర కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్రాంక్స్ కారులో ఈ ఇంజిన్ 100 హెచ్‌పీ పవర్, 147 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే బ్రెజ్జా కోసం దీని ట్యూనింగ్‌ను కాస్త మార్చే అవకాశం ఉంది. ఒకవేళ మారుతీ సుజుకీ గనుక దీని పవర్ అవుట్‌పుట్‌ను మరింత పెంచితే, లాంగ్ డ్రైవ్స్, స్పీడ్‌ను ఇష్టపడే కార్ లవర్స్‌కు బ్రెజ్జా ఒక బెస్ట్ ఛాయిస్‌గా మారుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ బ్రెజ్జా 1.5 లీటర్ ఇంజిన్ 103 హెచ్‌పీ పవర్, 136 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది.
అండర్‌బాడీ సీఎన్జీతో లగేజ్ స్పేస్ కష్టాలకు చెక్..
సీఎన్జీ కార్లు కొనేవారికి సాధారణంగా ఎదురయ్యే అతిపెద్ద సమస్య 'బూట్ స్పేస్'. సిలిండర్ పెట్టడం వల్ల లగేజ్ పెట్టుకోవడానికి అస్సలు స్థలం దొరకదు. కానీ, ఈ సమస్యకు మారుతీ సుజుకీ ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపించబోతోంది. సరికొత్త బ్రెజ్జాలో అండర్‌బాడీ సీఎన్జీ సెటప్‌ను తీసుకురానున్నారు. అంటే, సీఎన్జీ సిలిండర్లను డిక్కీలో కాకుండా కారు ఫ్లోర్ కింద (అడుగు భాగంలో) అమరుస్తారు. గతంలో లీకైన టెస్టింగ్ ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. దీనివల్ల కారు డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి బోలెడంత స్థలం దొరుకుతుంది. సీఎన్జీ వాహనదారులకు ఇదొక పెద్ద వరమనే చెప్పాలి. మారుతీ సుజుకీ ఇప్పటికే విక్టోరిస్ మోడల్‌లో ఇలాంటి అండర్‌బాడీ సెటప్‌ను విజయవంతంగా ఉపయోగించింది.
లగ్జరీ ఫీచర్లతో సరికొత్త అప్‌గ్రేడ్..
మెకానికల్ మార్పులతో పాటు కారు లోపల కంఫర్ట్ పెంచేలా అదిరిపోయే ఫీచర్లను కూడా జోడిస్తున్నారు. లాంగ్ జర్నీలలో ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే 'వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్' ఫీచర్‌ను బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఫీచర్ కేవలం టాప్-ఎండ్ వేరియంట్లకు మాత్రమే పరిమితం అయినప్పటికీ, పోటీ తట్టుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న బ్రెజ్జా ప్రత్యర్థి కార్లు ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నాయి. దీనితో పాటు, ఇప్పటివరకు బ్రెజ్జాలో లేని 'పవర్డ్ అడ్జస్ట్‌మెంట్ ఫ్రంట్ సీట్స్' (బటన్ నొక్కడం ద్వారా సీట్లను అడ్జస్ట్ చేసుకునే సదుపాయం) ఫీచర్‌ను కూడా ఈ సరికొత్త మోడల్‌లో అందించే అవకాశం ఉంది.
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్, ఫీచర్లు, ధర సహా ఇతర వివరాలను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


