...
...
Next Story

మారుతి సుజుకి బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్

మారుతి సుజుకి సబ్‌-కాంపాక్ట్ SUV 'బ్రెజా' (Brezza) ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలకు ముందే భద్రతలో సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ ఎన్‌సిఎపి (BNCAP - Bharat NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో బ్రెజా ఫేస్‌లిఫ్ట్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. జూలై 24న మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది.

Published on: Jul 23, 2026, 17:23:17 IST
Advertisement

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ 'బ్రెజా ఫేస్‌లిఫ్ట్' (2026 Maruti Suzuki Brezza facelift) విడుదల సమయానికి ముందే కీలక ప్రకటన చేసింది. బిఎన్‌సిఎపి (BNCAP) నిర్వహించిన భద్రతా పరీక్షల్లో ఈ సరికొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. ఈ కారు రేపటి రోజున (జూలై 24న) మార్కెట్లోకి అధికారికంగా రానుంది.

మారుతి సుజుకి బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్
మారుతి సుజుకి బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్

క్రష్ టెస్ట్ ఫలితాల ప్రకారం, ఈ కారు పెద్దల భద్రత (Adult Occupant Protection - AOP) విభాగంలో 32 పాయింట్లకు గానూ 30.41 పాయింట్లు, అలాగే పిల్లల భద్రత (Child Occupant Protection - COP) విభాగంలో 49 పాయింట్లకు గానూ 43 పాయింట్లు సాధించింది.

పెద్దల భద్రత

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో బ్రెజా ఫేస్‌లిఫ్ట్ 16 పాయింట్లకు గానూ 14.41 పాయింట్లు సాధించగా, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16/16 పూర్తి పాయింట్లను సాధించింది. దీంతో మొత్తం 30.41 పాయింట్లతో అత్యున్నత భద్రతను నమోదు చేసింది. డ్రైవర్, కో-ప్యాసింజర్ల తల, మెడ, తొడలు, పాదాలకు అత్యుత్తమ రక్షణ లభించిందని టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది.

పిల్లల భద్రత

పిల్లల భద్రత విభాగంలో బ్రెజా డైనమిక్ స్కోరులో 24/24 పూర్తి పాయింట్లు, CRS ఇన్‌స్టాలేషన్ స్కోరులో 12/12 పాయింట్లు సాధించింది. వెహికల్ అసెస్‌మెంట్ విభాగంలో 7/13 పాయింట్లు పొంది మొత్తం 43 పాయింట్లు దక్కించుకుంది. 18 నెలలు, 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల డమ్మీలపై నిర్వహించిన ఫ్రంట్, సైడ్ క్రాష్ టెస్టుల్లో ఈ కారు పూర్తి మార్కులను సాధించింది.

అత్యుత్తమ భద్రతా ఫీచర్లు

ఈ 5-స్టార్ BNCAP రేటింగ్ బ్రెజా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీకి చెందిన అన్ని వేరియంట్లకు, ఇంజిన్ ఆప్షన్లకు వర్తిస్తుంది. ఇందులో 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ K15C పెట్రోల్ ఇంజిన్ (6-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ ఆటోమేటిక్)తో పాటు కొత్తగా పరిచయం అవుతున్న 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బోఛార్జ్డ్ బూస్టర్‌జెట్ (Boosterjet) పెట్రోల్ ఇంజిన్ (6-స్పీడ్ మాన్యువల్) మోడల్స్ కూడా ఉన్నాయి.

అంచనా ధర, ప్రత్యేకతలు

రేపు లాంచ్ కానున్న బ్రెజా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర దాదాపు రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మారుతి సుజుకి 'అరేనా' (Arena) షోరూమ్ నెట్‌వర్క్ విభాగంలో టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో వస్తున్న తొలి కారు ఇదే కావడం గమనార్హం.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe