Maruti Suzuki : ఏడాదిలో 3 కార్లు.. మారుతీ సుజుకీ బిగ్ ప్లాన్! 7 సీటర్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది..
Maruti Suzuki upcoming cars : భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన హవాను కొనసాగించేందుకు మారుతీ సుజుకీ సిద్ధమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు బలెనో, బ్రెజ్జా కొత్త వెర్షన్లతో పాటు సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు కంపెనీ భారీ స్కెచ్ వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Maruti Suzuki new launches : దేశీయ కార్ల మార్కెట్లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు మారుతీ సుజుకీ కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుంటూ, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మూడు కీలక మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్ ప్రియులతో పాటు ఎస్‌యూవీ లవర్స్ కోసం ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. ఆ మూడు కార్ల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

1. మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్: పవర్ఫుల్ ఎంట్రీ..
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా బ్రెజ్జాను తీర్చిదిద్దుతున్నారు.
వెంట్రీలేటెడ్ సీట్లు: వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేలా ఇందులో వెంట్రీలేటెడ్ ఫ్రంట్ సీట్లను ప్రవేశపెడుతున్నారు. 10.25-ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్, ప్రీమియం డాష్‌బోర్డ్ దీనికి కొత్త రూపునిస్తాయి.
టర్బో ఇంజిన్ రిటర్న్స్: పాత బ్రెజ్జాలో ఉన్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను మళ్లీ తీసుకొస్తున్నారు. ఇది వేగాన్ని ఇష్టపడే వారికి మంచి ఆప్షన్. అలాగే అండర్ బాడీ సీఎన్జీ కిట్ ద్వారా బూట్ స్పేస్ (డిక్కీ) సమస్యను పరిష్కరించనున్నారు.
2. మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్: డిజిటల్ హంగులతో..
మారుతీ సుజుకీ అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో బలెనో ఒకటి. ఈ కారును మరింత ఆధునికీకరించి కస్టమర్ల ముందుకు తెస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త మోడల్ టెస్టింగ్ దశలో ఉంది.
కొత్త డిజైన్: దీని ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్‌లో కీలక మార్పులు ఉండనున్నాయి. కొత్త అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన టెయిల్ లైట్లు కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి.
సన్‌రూఫ్ వస్తోంది: కస్టమర్లు ఎప్పటి నుంచో కోరుకుంటున్న సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఫీచర్‌ను ఈసారి బలెనోలో చేర్చనున్నారు. దీంతో పాటు 360-డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇంజిన్: స్విఫ్ట్‌లో వాడుతున్న 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
3. గ్రాండ్ విటారా 7-సీటర్ : పెద్ద ఫ్యామిలీ కోసం..
మారుతీ సుజుకీ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇదే అని చెప్పుకోవాలి. బెస్ట్ సెల్లింగ్ గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే మూడు వరుసల సీట్ల ఎస్‌యూవీని రూపుదిద్దుతున్నారు. దీనికి 'వై17' అనే కోడ్ నేమ్ ఇచ్చారు.
పోటీ ఎవరితో?: ఇది మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ వంటి కార్లకు ప్రధాన శత్రువుగా మారుతుంది.
అత్యాధునిక సేఫ్టీ: ఇందులో 'లెవల్ 2 అడాస్' ఫీచర్లను జోడిస్తున్నారు. పనోరమిక్ సన్‌రూఫ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు కూడా ఉంటాయి.
హైబ్రిడ్ సత్తా: 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది రానుంది, దీనివల్ల మైలేజీ విషయంలో సాటిలేని విధంగా ఉంటుంది.
మారుతీ సుజుకీ కేవలం బడ్జెట్ కార్లకే పరిమితం కాకుండా, ఇప్పుడు ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీపై దృష్టి సారిస్తోంది. 2027 మార్చి లోపు ఈ మూడు కార్లు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయి.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. కొత్త బలెనోలో సన్‌రూఫ్ ఉంటుందా?
అవును, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కంపెనీ మొదటిసారిగా సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఫీచర్‌ను అందించనుంది.
2. 7-సీటర్ గ్రాండ్ విటారా ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఈ కారు 'వై17' కోడ్ నేమ్‌తో టెస్టింగ్ జరుగుతోంది. 2026 చివరిలోపు లేదా 2027 ప్రారంభంలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
3. బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చే కొత్త ఇంజిన్ ఏది?
కొత్త బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా మారుతీ సుజుకీ పరిచయం చేయనుంది.
4. ఈ కొత్త కార్లలో సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?
గ్రాండ్ విటారా 7-సీటర్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అడ్వాన్స్‌డ్ లెవల్ 2 అడాస్ టెక్నాలజీని కంపెనీ అందిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


