...
...
Next Story

డిజైర్​ సెడాన్​తో పాటు ఈ మారుతీ సుజుకీ కార్లపై భారీ ఆఫర్లు- రూ. 1.70లక్షల వరకు ఆదా!

మారుతీ సుజుకీ కార్లను కొనాలనుకునే వారికి జనవరి 2026 సరైన సమయం. అరీనా నెట్‌వర్క్ కార్లపై రూ. 1.70 లక్షల వరకు ప్రయోజనాలను సంస్థ అందిస్తోంది. బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​ డిజైర్​పైనా ధరల తగ్గింపు అమల్లో ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jan 16, 2026, 10:00:09 IST
Advertisement

మీరు కొత్త ఏడాదిలో సొంత కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మారుతీ సుజుకీ మీకు అదిరిపోయే వార్త ఇచ్చింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ, తన అరీనా నెట్‌వర్క్ ద్వారా విక్రయించే ప్యాసింజర్ కార్లపై ఈ జనవరిలో భారీ ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి ఏకంగా రూ. 1.70 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ మారుతీ సుజుకీ కార్లపై భారీ ఆఫర్లు..
ఈ మారుతీ సుజుకీ కార్లపై భారీ ఆఫర్లు..

మారుతీ సుజుకీ కార్లపై ఈ ఆఫర్లు జనవరి 31 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ భారీ తగ్గింపులో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 'జీఎస్టీ 2.0' ధరల కోతతో పాటు కంపెనీ ఇస్తున్న ప్రత్యేక నెలవారీ డిస్కౌంట్లు కూడా కలిసి ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ కార్లపై ఆఫర్లు- ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు?

మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో: అన్నింటికంటే ఎక్కువగా ఎస్-ప్రెస్సోపై రూ. 1,70,100 వరకు బెనిఫిట్స్​ లభిస్తున్నాయి. ఇందులో జీఎస్టీ ధర తగ్గింపు రూ. 1,29,600 కాగా, జనవరి నెల ప్రత్యేక డిస్కౌంట్ రూ. 40,500గా ఉంది.

దీనితో ఈ కారు ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 3,49,900కు తగ్గింది.

మారుతీ సుజుకీ ఎర్టిగా: ఫ్యామిలీ ఎంపీవీ అయిన ఎర్టిగాపై మొత్తం రూ. 76,400 ప్రయోజనం లభిస్తోంది. ఇందులో జీఎస్టీ కట్​ రూ. 46,400 కాగా, అదనంగా రూ. 30,000 డిస్కౌంట్ ఇస్తున్నారు.

మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్: పాపులర్, బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్ స్విఫ్ట్​ డిజైర్‌పై మొత్తం రూ. 90,200 తగ్గింపు ఉంది. దీనిపై నెలవారీ డిస్కౌంట్ రూ. 2,500 మాత్రమే ఉన్నప్పటికీ, జీఎస్టీ 2.0 కింద రూ. 87,700 భారీగా తగ్గడం విశేషం.

ముఖ్య గమనిక: ఈ ఆఫర్లు కేవలం జనవరి 31 లోపు కారు బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. కంపెనీ ఇచ్చే ఈ అధికారిక తగ్గింపులే కాకుండా, స్థానిక డీలర్లు కూడా తమ స్థాయిలో అదనపు ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఖచ్చితమైన వివరాల కోసం మీ దగ్గరలోని మారుతీ సుజుకీ అరీనా షోరూమ్‌ని సందర్శించి విచారించడం మంచిది.

నెక్సా మోడల్స్​పైనా ఆఫర్లు..

అరీనా సెగ్మెంట్​లోనే కాదు, నెక్సా సెగ్మెంట్​లో కూడా భారీ ఆఫర్లను ఇస్తోంది మారుతీ సుజుకీ. ఇగ్నిస్​, బలెనో, సియాజ్​, ఫ్రాంక్స్​, గ్రాండ్​ విటారా, ఎక్స్​ఎల్​6, జిమ్నీ, ఇన్విక్టోపై క్యాష్​ డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్​ బోనస్​లు, స్క్రాపేజ్​ ఇన్సెంటివ్స్​, కార్పొరేట్​ ఆఫర్స్​ వంటివి ఇస్తున్నట్టు వివరించింది.

మారుతీ సుజుకీ ఇగ్నిస్​పై క్యాష్​, ఎక్స్​ఛేంజ్​, స్క్రాపేజ్​, కార్పొరేట్​ బెనిఫిట్స్ కలిపి రూ. 45వేల వరకు తగ్గింపు లభిస్తోంది.

మారుతీ సుజుకీ ఇన్విక్టోపై రూ. 1.30లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి.

పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks