భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్, మైక్రో ఎస్‌యూవీల విభాగంలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ చిన్న సైజు ఎస్‌యూవీల కొనుగోళ్లకు వాహనదారులు విపరీతంగా మొగ్గు చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ భారీ వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా నెక్సా నెట్‌వర్క్ ద్వారా రెండు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
టాటా పంచ్‌కు పోటీగా మారుతీ సుజుకీ వై43!
మారుతీ సుజుకీ ప్రస్తుతం 'Y43' అనే కోడ్‌నేమ్‌తో ఒక మైక్రో ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఇది నెక్సా పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇగ్నిస్‌తో పోలిస్తే ఇది నిజమైన ఎస్‌యూవీ రూపాన్ని కలిగి ఉంటుంది. ఎత్తైన బొనెట్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, నిలువుగా ఉండే బాడీ డిజైన్‌తో ఇది రోడ్డుపై బలమైన రూపంతో కనిపిస్తుంది.
ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీ విభాగంలో ఊపేస్తున్న టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ కార్లకు ఇది నేరుగా పోటీ ఇవ్వనుంది. ఇందులో మారుతీకి చెందిన సరికొత్త 1.2-లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. దీనితో పాటు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ వర్షన్ కూడా తీసుకొచ్చే యోచనలో కంపెనీ ఉంది. ఈ కారును దాదాపు 2027 నాటికి మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
35 కిమీ మైలేజ్‌తో ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్..
మరోవైపు మార్కెట్లో ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన 'ఫ్రాంక్స్' క్రాసోవర్‌ను సరికొత్త హంగులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావడానికి మారుతీ సుజుకీ సిద్ధమవుతోంది. టెస్టింగ్ సమయంలో ఈ కార్లు ఇప్పటికే రహదారులపై కనిపించాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త లైటింగ్ ఎలిమెంట్లతో ఈ కారు మరింత ఆకర్షణీయంగా మారనుంది.
కేవలం డిజైన్ మార్పులే కాకుండా, సాంకేతికంగా కూడా ఇందులో విప్లవాత్మక మార్పులు చేయనున్నారు. మారుతీ సుజుకీ సొంతంగా తయారు చేసిన 'సిరీస్-హైబ్రిడ్' సాంకేతికతను ఇందులో వాడనున్నట్లు తెలుస్తోంది. సాధారణ హైబ్రిడ్ కార్లలా కాకుండా, ఈ విధానంలో పెట్రోల్ ఇంజిన్ కేవలం విద్యుత్ ఉత్పత్తి చేసే జెనరేటర్‌గా మాత్రమే పనిచేస్తుంది. కారు చక్రాలను ఎలక్ట్రిక్ మోటార్ నడుపుతుంది. దీనివల్ల ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
లెవల్-2 అడాస్ సెక్యూరిటీ ఫీచర్లు..
{{/usCountry}}కేవలం డిజైన్ మార్పులే కాకుండా, సాంకేతికంగా కూడా ఇందులో విప్లవాత్మక మార్పులు చేయనున్నారు. మారుతీ సుజుకీ సొంతంగా తయారు చేసిన 'సిరీస్-హైబ్రిడ్' సాంకేతికతను ఇందులో వాడనున్నట్లు తెలుస్తోంది. సాధారణ హైబ్రిడ్ కార్లలా కాకుండా, ఈ విధానంలో పెట్రోల్ ఇంజిన్ కేవలం విద్యుత్ ఉత్పత్తి చేసే జెనరేటర్‌గా మాత్రమే పనిచేస్తుంది. కారు చక్రాలను ఎలక్ట్రిక్ మోటార్ నడుపుతుంది. దీనివల్ల ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
లెవల్-2 అడాస్ సెక్యూరిటీ ఫీచర్లు..
{{/usCountry}}భద్రత విషయంలో కూడా మారుతీ సుజుకీ ఈ కారును సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లో లెవల్-2 అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్స్) సాంకేతికతను అందించనున్నట్లు సమాచారం. దీనివల్ల అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు వాహనదారులకు అందుబాటులోకి వస్తాయి.
మారుతీ సుజుకీ తీసుకొస్తున్న ఈ రెండు ఎస్‌యూవీలు అందుబాటు ధరలో ఎక్కువ సౌకర్యాలు, తిరుగులేని మైలేజ్ కోరుకునే భారతీయ కుటుంబాలకు చక్కటి ఎంపికగా మారనున్నాయి.
వీటిపై రానున్న రోజుల్లో సంస్థ ప్రకటనలు చేసే అవకాశం ఉంది.