భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన కేవలం ఏడాది కాలంలోనే ఊహించని రీతిలో రికార్డు విక్రయాలు సాధించిన మారుతీ సుజుకీ ‘విక్టోరిస్’ మరో సరికొత్త మైలురాయిని అందుకుంది. సెప్టెంబర్ 2025లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, ఇప్పటివరకు ఏకంగా 1.5 లక్షల (1,50,000) యూనిట్ల సేల్స్ దాటి సరికొత్త రికార్డు తిరగరాసింది. ఈ ఘన విజయాన్ని వేడుకగా చేసుకుంటూ, దసరా, దీపావళి పండుగల సీజన్‌లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘విక్టోరిస్ ఆరమ్ ఎడిషన్’ను కంపెనీ మార్కెట్లోకి ఆవిష్కరించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా పండుగ వేళ కొత్త కార్లు కొనుగోలు చేసే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో ఈ పండుగ లుక్‌తో వస్తున్న కొత్త మోడల్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఆరమ్ ఎడిషన్ ప్రత్యేకతలు ఏంటి?
ఈ ప్రత్యేక ఆరమ్ ఎడిషన్‌ను విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లో అందుబాటులోకి తెచ్చారు. 'ఆరమ్' అనేది ల్యాటిన్ భాషలో 'బంగారం' అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కోసం కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్ యాక్సెసరీ కిట్‌ను రూ. 22,990 ధరకు అందిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను ఈ ఆరమ్ ఎడిషన్ ప్రచారకర్తగా మారుతీ సుజుకీ నియమించింది.
ఈ కాస్మోటిక్ కిట్‌లో కాపర్ రంగు మెరుపులతో కూడిన స్కిడ్ ప్లేట్లు, వీల్ ఆర్చ్‌లు వాహనానికి ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి. ఫ్రంట్ గ్రిల్, ఫెండర్లు, బంపర్లు, బాడీ సైడ్ మోల్డింగ్‌లు, డోర్ వైజర్లకు క్రోమ్ ఫినిషింగ్ జోడించారు. దీనితో పాటు కారు లోపల అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 3డీ క్యాబిన్ మ్యాట్లు, 3డీ బూట్ మ్యాట్, రియర్ ట్రంక్ సిల్ గార్డ్‌ను అందించారు. అయితే కారు ఇంజిన్ లేదా మెకానికల్ సామర్థ్యంలో ఎలాంటి మార్పులూ చేయలేదని సంస్థ స్పష్టం చేసింది.
రికార్డుల వేటలో విక్టోరిస్!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విక్టోరిస్‌కు మొదటి రోజు నుంచే బంపర్ రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు నమోదైన గణాంకాల ప్రకారం 1,47,602 యూనిట్లు అమ్ముడవగా, అక్టోబర్ తొలి వారాల విక్రయాలతో ఈ సంఖ్య 1.5 లక్షల మార్కును దాటేసింది. గడిచిన 12 నెలల కాలంలో ప్రతి నెలా సగటున 11,354 విక్టోరిస్ కార్లు రోడ్డెక్కడం విశేషం!
{{/usCountry}}తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విక్టోరిస్‌కు మొదటి రోజు నుంచే బంపర్ రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు నమోదైన గణాంకాల ప్రకారం 1,47,602 యూనిట్లు అమ్ముడవగా, అక్టోబర్ తొలి వారాల విక్రయాలతో ఈ సంఖ్య 1.5 లక్షల మార్కును దాటేసింది. గడిచిన 12 నెలల కాలంలో ప్రతి నెలా సగటున 11,354 విక్టోరిస్ కార్లు రోడ్డెక్కడం విశేషం!
{{/usCountry}}భారత ఆటోమొబైల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1 లక్ష, 1.5 లక్షల విక్రయాల మార్కును చేరుకున్న ఏకైక కారుగా విక్టోరిస్ నిలిచింది. అంతేకాకుండా ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్' (ఐసీఓటీవై 2026) అవార్డును కూడా ఈ ఎస్‌యూవీ సొంతం చేసుకుంది.
క్రెటాకు గట్టి పోటీ..
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటాకు విక్టోరిస్ సవాల్ విసురుతోంది. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న కాలంలో విక్టోరిస్ నెలకు సగటున 12,371 యూనిట్ల విక్రయాలతో మొత్తం 1,11,335 కార్లను విక్రయించి సెగ్మెంట్‌లో రెండో స్థానంలో నిలిచింది. లీటరుకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ సాంకేతికత, ఆధునిక ఫీచర్లు ఈ వాహన విజయంలో కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు చెబుతున్నారు.
"విక్టోరిస్ సాధించిన అద్భుత విక్రయాలకు గుర్తుగా, పండుగ సీజన్‌లో వినియోగదారులకు సరికొత్త మెరుగులు దిద్దిన అనుభూతిని అందించేందుకే ఈ ఆరమ్ ఎడిషన్‌ను తీసుకొచ్చాం," అని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ పేర్కొన్నారు.