Long range electric cars in India : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లోకి తన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ సీఎల్ఏ సెడాన్‌ను లాంచ్ చేసింది. అత్యాధునిక 'మెర్సిడెస్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్' (ఎంఎంఏ) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన తొలి కారు ఇదే కావడం విశేషం. అదిరిపోయే రేంజ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చిన ఈ కారు వివరాలు మీకోసం..
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్- మూడు వేరియంట్లలో..

కొత్త సీఎల్ఏ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మూడు విభిన్న వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఒక్కో వేరియంట్ ఒక్కో రకమైన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని తయారైంది. అవి..
సీఎల్ఏ 200 ‘స్టాండర్డ్ రేంజ్’: బడ్జెట్ లగ్జరీ కోరుకునే వారి కోసం.
సీఎల్ఏ 250+ ‘లాంగ్ రేంజ్’: అత్యధిక మైలేజ్ (రేంజ్) కావాలనుకునే వారి కోసం.
సీఎల్ఏ 250+ ‘లాంచ్ ఎడిషన్’: స్పెషల్ ఫీచర్లు, అదనపు హంగులు కోరుకునే వారి కోసం.
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్- బ్యాటరీ సామర్థ్యం, రేంజ్..
ఈ కారులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని రేంజ్ గురించి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ లగ్జరీ కారు ఏకంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం దాటి వెళ్లొచ్చు!
CLA 250+ మోడల్స్: ఇందులో 85.5 kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 792 కిమీ (డబ్ల్యూఎల్టీపీ) రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
సీఎల్ఏ 200 మోడల్: ఇది 542 కిమీ రేంజ్ అందిస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్పీడ్: 20 నిమిషాల్లో 400 కిమీ!
ఎలక్ట్రిక్ కార్ల యజమానులకు ఉండే ప్రధాన ఆందోళనల్లో ఒకటి రేంజ్ అయితే మరొకటి ఛార్జింగ్ సమయం. అయితే ఈ మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్‌లో ఆ చింత అక్కర్లేదు. 800-వోల్ట్ ఆర్కిటెక్చర్‌తో వస్తున్న ఈ కారు 320 కేడబ్ల్యూ వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
"ఒక 240 కేడబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే, కేవలం 20 నిమిషాల్లోనే 400 కిమీ ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ ఎక్కుతుంది," అని కంపెనీ వెల్లడించింది.
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్- టెక్నాలజీ అండ్ ఫీచర్స్..
{{/usCountry}}"ఒక 240 కేడబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే, కేవలం 20 నిమిషాల్లోనే 400 కిమీ ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ ఎక్కుతుంది," అని కంపెనీ వెల్లడించింది.
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్- టెక్నాలజీ అండ్ ఫీచర్స్..
{{/usCountry}}మెర్సిడెస్ ఈ కారును ఒక 'కంప్యూటర్ ఆన్ వీల్స్'గా మార్చేసింది.
ఏఐ అసిస్టెంట్: ఇందులో ChatGPT-4, మైక్రోసాఫ్ట్ బింగ్, గూగుల్ జెమినీ వంటి ఏఐ టూల్స్ ఇంటిగ్రేట్ చేయబడ్డాయి.
హైపర్‌స్క్రీన్: ఎన్విడియా చిప్స్‌తో పనిచేసే అద్భుతమైన ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్ ఇందులో ఉంది.
సేఫ్టీ: లెవల్ 2 అడాస్ ఫీచర్లు ప్రామాణికంగా వస్తాయి. వీటిని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా లెవల్ 2+ కి పెంచుకోవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్- వేరియంట్ల వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్)..
CLA 200 Standard Range రూ. 55 లక్షలు
CLA 250+ Long Range రూ. 59 లక్షలు
CLA 250+ Launch Edition రూ. 64 లక్షలు
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్- డెలివరీ ఎప్పుడు?
ఏప్రిల్ 2026 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో ఈ కార్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.