స్మాప్చాట్కి గట్టి పోటీని ఇచ్చే విధంగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. కొత్త యాప్‌ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దాని పేరు “ఇన్‌స్టంట్స్”. వినియోగదారులు పంపిన ఫోటోలు, వీడియోలు చూసిన వెంటనే మాయమైపోయేలా (డిసప్పియర్) ఈ ఇన్‌స్టాంట్స్ యాప్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం..
స్నాప్‌చాట్‌కు అసలైన పోటీ..
ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. మెటా ప్రస్తుతం ఈ ఇన్‌స్టంట్స్ యాప్‌కి సంబంధించిన అంతర్గత ప్రోటోటైప్‌పై పనిచేస్తోంది. ఫోటోలు పంపిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా అదృశ్యమయ్యేలా దీనిని రూపొందిస్తున్నారు. అయితే, ఈ యాప్ ప్రస్తుతం అంతర్గతంగా అభివృద్ధి దశలోనే ఉందని, ఇంకా ఎక్స్టర్నల్ టెస్టింగ్ కోసం అందుబాటులోకి రాలేదని మెటా ప్రతినిధి స్పష్టం చేశారు.
దీని బట్టి చూస్తే, ఈ యాప్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని అర్థం చేసుకోవచ్చు.
యాప్ రివర్స్ ఇంజనీరింగ్ నిపుణుడు అలెశాండ్రో పలుజ్జి ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘Also from Meta’ పేజీలో ఈ 'ఇన్‌స్టాంట్స్' ప్రస్తావన కనిపించింది. స్నేహితులతో ఇన్స్టంట్ ఫోటోలను పంచుకోవడానికి ఇది ఒక కొత్త మార్గంగా అక్కడ పేర్కొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 'ఇన్‌స్టంట్స్' ఫీచర్!
అయితే కొత్త యాప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కూడా ఈ 'ఇన్‌స్టంట్స్' పేరుతో ఒక కొత్త ఫీచర్‌ను మెటా పరీక్షిస్తోంది.
దీనిని గతంలో ‘షాట్స్’ అని పిలిచేవారు.
ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో పరిమితంగా టెస్టింగ్ దశలో ఉంది.
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజెస్ (డీఎం)లో అదృశ్యమయ్యే మీడియాను పంపవచ్చు.
{{/usCountry}}ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజెస్ (డీఎం)లో అదృశ్యమయ్యే మీడియాను పంపవచ్చు.
{{/usCountry}}పంపిన ఫోటోను అవతలి వారు ఓపెన్ చేసిన వెంటనే లేదా పంపిన 24 గంటల తర్వాత అది ఎక్స్‌పైర్ అయిపోతుంది.
ఇన్‌స్టాగ్రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 'ఇన్‌స్టంట్స్' ఫీచర్ ద్వారా కేవలం మీరు ఫాలో అవుతూ, మిమ్మల్ని తిరిగి ఫాలో అయ్యే వారికి మాత్రమే మెసేజ్‌లు పంపగలరు. అలాగే, ఈ మీడియాను ఎడిట్ చేసే అవకాశం ఉండదు.
రానున్న రోజుల్లో ఈ ఇన్‌స్టంట్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టంట్స్ ఫీచర్‌పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయ.
మెటా వ్యూహం ఇదేనా?
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ‘వ్యూ వన్స్’, ‘వానిష్ మోడ్’ వంటి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్లు ఉన్నప్పటికీ.. స్నాప్‌చాట్ తరహాలో యూజర్లను మరింతగా ఆకట్టుకోవడానికి మెటా ఈ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. స్నాప్‌చాట్‌కు వినియోగదారులు పెరగకుండా అడ్డుకోవడమే మెటా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఏదైనా కొత్తగా చేసే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడూ తన ప్రత్యర్థి స్నాప్‌చాట్‌ని ఇమిటేట్ చేస్తోందని విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో స్నాప్‌చాట్‌లో సక్సెస్ అయిన ఫీచర్‌ని ఇన్‌స్టాగ్రామ్ తీసుకుని, దానికి “స్టోరీస్” అని పేరు పెట్టింది. గతేడాది.. సోషల్ మ్యాప్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఒక ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇదే ఫీచర్.. స్నాప్‌చాట్‌లో 'స్నాప్ మ్యాప్' పేరుతో అప్పటికే అందుబాటులో ఉంది.