ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రస్తుతం ప్రపంచం ఎంత వణికిపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా లక్షలాది మంది ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. మిగిలిన వారిలోనూ ఏదో ఒక అందోళన కనిపిస్తూనే ఉంటోంది. ఈ తరుణంలో ఓ ఏఐ పరిశోధకుడు వెన్నులో వణుకు పుట్టించే హెచ్చరికను ప్రపంచానికి పంపించారు. ఏఐపై మానవాళి నియంత్రణ కోల్పోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదకరమైన ఏఐ వ్యవస్థలను పరీక్షించే లాభాపేక్ష లేని సంస్థ ఎంఈటీఆర్లో టెక్నికల్ స్టాఫ్ సభ్యుడిగా పనిచేస్తున్న నికోలా జుర్కోవిచ్.. ‘ఎక్స్’ వేదికగా ఓ బహిరంగ లేఖ పంచుకున్నారు. ఏళ్ల తరబడి ఏఐ గురించి మనసులోనే ఆందోళన చెందుతున్నానని, సమయం మించిపోకముందే మాట్లాడటం తన బాధ్యతగా భావిస్తున్నానని అందులో పేర్కొన్నారు.
“వచ్చే థాంక్స్‌గివింగ్ నాటికి మనం బతికి ఉంటామో లేదో తెలియని తొలి థాంక్స్‌గివింగ్ ఇది,” అని జుర్కోవిచ్ రాసుకొచ్చారు.
'ఏఐపై మనం నియంత్రణ కోల్పోతున్నాం'
ఈ ఏడాది ఇప్పటికే ఏఐ వ్యవస్థలు పలు తీవ్రమైన ఘటనలకు కారణమయ్యాయని, అనేక కంపెనీలపై హ్యాకింగ్ దాడులు జరిగాయని జుర్కోవిచ్ తన లేఖలో చెప్పారు. ఇప్పటివరకు నష్టం ఎక్కువగా ఆర్థిక పరంగానే ఉందని, కానీ వచ్చే ఏడాది మాత్రం భారీ హానితో పాటు ఎన్నో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని భయం వ్యక్తం చేశారు!
మూడు మార్గాల్లో పరిస్థితులు చేయి దాటిపోవచ్చని ఆయన చూపారు. ఏఐ నియంత్రణ తప్పి కీలక మౌలిక సదుపాయాల్లోకి చొరబడటం, దుండగులు ఏఐ సాయంతో జీవాయుధాలు తయారు చేయడం, కీలక నేతలు యంత్రాలకు అతిగా అధికారాలు కట్టబెట్టడం వంటివి ఆ ప్రమాదాల్లో ఉన్నాయని వివరించారు. కఠినమైన అంతర్జాతీయ నిబంధనలు లేకపోతే, 2027 నాటికే ఏఐ తనంతట తాను మెరుగుపరుచుకుని అత్యంత తెలివైన మనుషులనూ దాటిపోతుందని అంచనా వేశారు. అలాంటి వ్యవస్థ మానవ మనుగడకు విరుద్ధమైన లక్ష్యాల వెంట పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పెద్ద ఎత్తున వేగాన్ని తగ్గించకపోతే, 2030 ముగిసేలోపు మానవాళి నాశనమయ్యే లేదా శక్తిహీనమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2027 చివరి నాటికి ప్రజలు పండగలు జరుపుకోలేని పరిస్థితికి 5 నుంచి 20 శాతం అవకాశం ఉందని అంచనా వేశారు; అయితే ఇవి నిర్ధారించిన గణాంకాలు కాదని, తన వ్యక్తిగత అంచనాలు మాత్రమేనని స్పష్టం చేశారు.
ఉద్యోగాలు, జీవిత ప్రణాళికలు, చేతిలో నగదు..
{{/usCountry}}పెద్ద ఎత్తున వేగాన్ని తగ్గించకపోతే, 2030 ముగిసేలోపు మానవాళి నాశనమయ్యే లేదా శక్తిహీనమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2027 చివరి నాటికి ప్రజలు పండగలు జరుపుకోలేని పరిస్థితికి 5 నుంచి 20 శాతం అవకాశం ఉందని అంచనా వేశారు; అయితే ఇవి నిర్ధారించిన గణాంకాలు కాదని, తన వ్యక్తిగత అంచనాలు మాత్రమేనని స్పష్టం చేశారు.
ఉద్యోగాలు, జీవిత ప్రణాళికలు, చేతిలో నగదు..
{{/usCountry}}ఒకవేళ మానవాళి నిలిచి ఉన్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుందని జుర్కోవిచ్ భావిస్తున్నారు. పదేళ్లలో ప్రపంచంలోని మెజారిటీ ప్రజలను నిరుద్యోగులుగా మార్చేలా ప్రస్తుత ఉద్యోగాల్లో చాలావరకు కనుమరుగవుతాయని జోస్యం చెప్పారు. వచ్చే ఒకటి నుంచి ఐదేళ్లలో విద్య, కెరీర్, కుటుంబం మొదలుపెట్టడం వరకు రోజువారీ ప్రణాళికలన్నీ పట్టాలు తప్పవచ్చని అన్నారు. చిన్న పిల్లలు ఉన్న స్నేహితులు తమ పిల్లలు పాఠశాల వయసు వచ్చేదాకా బతుకుతారో లేదోనని ఆందోళన చెందుతున్నారని కూడా ప్రస్తావించారు.
తన కుటుంబానికి ఆచరణాత్మక సూచనలు ఇచ్చారు జుర్కోవిచ్. ఆన్‌లైన్ బ్యాంకింగ్ విఫలమైతే ఉపయోగపడేలా చేతిలో నగదు ఉంచుకోవాలని, దాదాపు రెండు వారాలకు సరిపడా ఆహారం, నీటిని ఇంట్లో సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొవిడ్ కంటే ఎంతో తీవ్రమైన కుదుపు వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రపంచ నిబంధనల కోసం పిలుపు..
పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇంకా కొద్ది అవకాశం ఉందని జుర్కోవిచ్ నమ్ముతున్నారు! ఏఐ పోటీ వేగాన్ని తగ్గించేందుకు కఠినమైన అంతర్జాతీయ నియంత్రణ తీసుకురావడమే తన ప్రధాన సిఫార్సు. ఏఐ అభివృద్ధిలో కొన్ని అమెరికా సంస్థలు ముందున్నా, అమెరికా కంపెనీలు పాటించే భద్రతా ప్రమాణాలను ఐరోపా నిర్దేశించగలదని ఈయూ ఏఐ చట్టం నిరూపించిందని ఉదహరించారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పులపై స్నేహితులతో చర్చించాలని, ప్రపంచ నిబంధనల కోసం రాజకీయ నేతలను కోరాలని, ఈ అంశంపై మరింత లోతుగా తెలుసుకోవాలని సాధారణ ప్రజలకు పిలుపునిచ్చారు. కంప్యూటర్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆర్థికవేత్తలు, తత్వవేత్తలు తమ కెరీర్‌ను ఏఐ భద్రతపై కేంద్రీకరించాలని కోరారు. ప్రతి రోజూ ప్రాణాలతో చెలగాటమాడే యుద్ధంలో సైనికుడిలా పనిచేయడంతో ఈ కృషిని పోల్చారు.
ఆందోళన చెందుతున్నది ఒక్కరే కాదు..
జుర్కోవిచ్ లేఖ తీవ్రంగా అనిపించవచ్చు. తోటి నిపుణుల కంటే తాను ఎక్కువ ముప్పును చూస్తున్నానని గతంలోనూ ఆయన చెప్పారు. అయినా టెక్ రంగంలోని పెద్ద పేర్లు ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నాయి. థాంక్స్‌గివింగ్‌కు కొద్ది రోజుల ముందు ఏఐ దిగ్గజం యోషువా బెంగియో సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ, మానవాళి పెను ప్రమాదాల వైపు పరుగులు తీస్తోందని చెప్పారు.
మనుషులకు నియంత్రించే విధానం తెలియకముందే సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించవద్దని మరో దిగ్గజం జెఫ్రీ హింటన్ కూడా హెచ్చరించారు. సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మద్దతు ఉన్న ఓపెన్‌ఏఐకి చెందిన జాకుబ్ పాచోకీ వేగాన్ని తగ్గించి స్వతంత్ర భద్రతా తనిఖీలు చేయాలని కోరగా, ఒకటి నుంచి ఐదేళ్లలో ఎంట్రీ-లెవల్ వైట్-కాలర్ ఉద్యోగాల్లో సగం వరకు ఏఐ తుడిచిపెట్టేయవచ్చని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ హెచ్చరించారు.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.