చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ తన చిన్న ఎలక్ట్రిక్ కారు 'కామెట్ ఈవీ' ధరలను సవరించింది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్టంగా రూ. 10,000 వరకు ధర పెంచింది. ఈ ఏడాది ఈ మైక్రో ఈవీ ధర పెరగడం ఇది రెండోసారి!; గతంలో గరిష్టంగా రూ. 17,000 వరకు ధరలు పెంచారు. అయితే 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (బీఏఏఎస్) ఓనర్‌షిప్ మోడల్‌ను ఎంచుకునే కస్టమర్లకు మాత్రం టాప్-స్పెక్ వేరియంట్ల ధరలను రూ. 10,000 మేర తగ్గించి ఊరట కల్పించింది.
వేరియంట్ల వారీగా ధరల మార్పులు ఇవే..

బ్యాటరీతో కలిపి కొనుగోలు చేసే ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఎఫ్‌సీ (ఫాస్ట్ చార్జింగ్), ఎక్స్‌క్లూజివ్ డ్యూయల్ టోన్, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ డ్యూయల్ టోన్ వేరియంట్ల ధరలను రూ. 10,000 చొప్పున పెంచారు. అదే సమయంలో ఎక్స్‌క్లూజివ్ డ్యూయల్ టోన్, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ డ్యూయల్ టోన్ వేరియంట్లను బీఏఏఎస్ పద్ధతిలో తీసుకుంటే రూ. 10,000 తగ్గుతుంది.
తాజా సవరణ తర్వాత బ్యాటరీతో సహా ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 7.90 లక్షల నుంచి రూ. 10.17 లక్షల మధ్య ఉన్నాయి. బీఏఏఎస్ విధానంలో కారు కొనాలనుకునే వారు ప్రారంభ ధరగా రూ. 4.99 లక్షల నుంచి రూ. 7.26 లక్షల వరకు చెల్లించి కారు తీసుకోవచ్చు. దీనికి అదనంగా కిలోమీటరుకు రూ. 3.3 చొప్పున బ్యాటరీ వినియోగ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం ఎలా ఉన్నాయి?
నలుగురు కూర్చునేందుకు వీలుగా రూపొందించిన ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కామెట్ ఈవీలో 10.25-అంగుళాల డ్యూయల్-స్క్రీన్ సెటప్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకునే ఓఆర్‌వీఎంలు, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్, మాన్యువల్ ఏసీ, పవర్ విండోస్, నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసే ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారులో 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ 41 బీహెచ్పీ పవర్‌ని, 110 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.3 కేడబ్ల్యూ, 7 కేడబ్ల్యూ ఏసీ చార్జింగ్ ఆప్షన్లకు మద్దతు ఇస్తుంది. నగర ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ మైక్రో ఈవీ ధరల మార్పు కొనుగోలుదారుల బడ్జెట్‌పై స్వల్ప ప్రభావం చూపనుంది.
{{/usCountry}}ఈ కారులో 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ 41 బీహెచ్పీ పవర్‌ని, 110 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.3 కేడబ్ల్యూ, 7 కేడబ్ల్యూ ఏసీ చార్జింగ్ ఆప్షన్లకు మద్దతు ఇస్తుంది. నగర ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ మైక్రో ఈవీ ధరల మార్పు కొనుగోలుదారుల బడ్జెట్‌పై స్వల్ప ప్రభావం చూపనుంది.
{{/usCountry}}ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.