Cars price hike : పండుగ సీజన్లోనూ షాక్! బెస్ట్ సెల్లింగ్ కార్ల ధరలను భారీగా పెంచిన ఎంజీ మోటార్
భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలుతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ పాపులర్ మోడళ్లైన విండ్సర్ ఈవీ, ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మెజెస్టర్ ధరలను సవరించింది. పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
మీరు పండుగ సీజన్లో కొత్త కారు లేదా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టే వార్త ఒకటి వెలువడింది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి డిమాండ్ సాధిస్తున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ తమ మోస్ట్ పాపులర్, బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు ‘విండ్సర్ ఈవీ’, ప్రీమియం ఎస్‌యూవీ ‘మెజెస్టర్’ మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్తగా పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ముడిసరుకుల ధరలు హెచ్చుతగ్గులకు లోనుకావడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
విండ్సర్ ఈవీపై రూ. 15,000 పెంపు..
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తిరుగులేని విజయం సాధించిన విండ్సర్ ఈవీ రేంజ్ మొత్తంపైనా కంపెనీ రూ. 15,000 స్థిరమైన పెంపును సంస్థ వర్తింపజేసింది.
ఈ ధరల పెంపు సాధారణ విండ్సర్ ఈవీ వేరియంట్లతో పాటు, పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే విండ్సర్ ప్రో మోడళ్లకు కూడా వర్తిస్తుంది.
అయితే, ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన లిమిటెడ్ ఎడిషన్ మోడల్ 'విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్' ధరలో మాత్రం ఎలాంటి మార్పూ చేయకపోవడం గమనార్హం.
ఇంతకుముందు జూలై 2026లో కూడా విండ్సర్ ఈవీ.. వేరియంట్ల ఆధారంగా రూ. 60,000 వరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే.
టెక్నికల్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. విండ్సర్ ఈవీ 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో 332 కి.మీ రేంజ్ ఇస్తుండగా, విండ్సర్ ప్రోలోని 52.9 kWh పెద్ద బ్యాటరీ 449 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ రెండు వేరియంట్లలోనూ ఉండే పీఎంఎస్‌ఎం మోటార్ 134 bhp పవర్, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
తాజా పెంపు అనంతరం ఎంజీ విండ్సర్ ఈవీ ధరలు (ఎక్స్‌షోరూం)-
- ఎంజీ విండ్సర్ ఈవీ ఎగ్జైట్- రూ. 14.86 లక్షలు
- విండ్సర్ ఈవీ ఎక్స్‌క్లూజివ్- రూ. 16.15 లక్షలు
- విండ్సర్ ఈవీ ఎస్సెన్స్- రూ. 17.15 లక్షలు
- విండ్సర్ ఈవీ ప్రో ఎక్స్‌క్లూజివ్- రూ. 18.05 లక్షలు
- విండ్సర్ ఈవీ ప్రో ఎస్సెన్స్- రూ. 19.15 లక్షలు
ఎంజీ మెజెస్టర్ ఏకంగా రూ. 1 లక్ష ఖరీదు!
ఎంజీ కంపెనీకి చెందిన లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మెజెస్టర్' కొనుగోలుదారులకు మరింత పెద్ద షాక్ తగిలింది. ఈ మోడల్‌పై కంపెనీ ఏకంగా రూ. 1 లక్ష భారీ ధరల పెంపును ప్రకటించింది.
ఈ పెంపు మెజెస్టర్‌లోని మూడు ప్రధాన వేరియంట్లు (సావీ 4X2 6-సీటర్, సావీ 4X2 7-సీటర్, సావీ 4X4 7-సీటర్) పై సమానంగా వర్తిస్తుంది.
కేవలం మూడు నెలల వ్యవధిలోనే మెజెస్టర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం విశేషం. గత ఆగస్టు 2026లోనే 4X2 వేరియంట్లపై రూ. 1.5 లక్షల వరకు ధరలు పెంచారు.
ఈ ప్రీమియం ఎస్‌యూవీలో 2.0-లీటర్ ట్విన్-టర్బో డిజైన్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేసి 215.5 PS పవర్, 478.5 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. రియర్-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో ఇది అందుబాటులో ఉంది.
మెకానికల్ పరంగా లేదా కారు ఇంటీరియర్ ఫీచర్లలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, ఈ ధరల పెంపు వల్ల పండుగల తర్వాత కొత్త వాహనం బుక్ చేసుకునే కస్టమర్లపైదనంగా ఆర్థిక భారం పడనుంది.
తాజా పెంపు అనంతరం ఎంజీ మెజెస్టర్ ఎక్స్‌షోరూం ధరలు-
- సావీ 4x2 6 సీటర్- రూ. 43.49 లక్షలు
- సావీ 4x2 7 సీటర్ - రూ. 43.49 లక్షలు
- సావీ 4x4 7 సీటర్- రూ. 45.99 లక్షలు
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


