భారతీయులు ఎగబడి కొంటున్న ఎలక్ట్రిక్ కారు ఇది- MG Windsor ఈవీకి ఎందుకు ఇంత క్రేజ్?
ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ఈవీ రికార్డులు సృష్టిస్తోంది! కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో భారతీయుల్లో ఈ ఈవీకి ఎందుకు ఎక్కువ క్రేజ్ ఉంది? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి..
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తమ విండ్‌సర్ ఈవీ మోడల్‌ను కేవలం 400 రోజుల్లోపే 50,000 యూనిట్లను భారత మార్కెట్‌లో విక్రయించినట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనం విషయంలో ఇది చాలా గొప్ప విజయం! ఈ విజయానికి నిదర్శనం ఏంటంటే.. టాటా నెక్సాన్ ఈవీ 50వేల అమ్మకాల సంఖ్యను చేరుకోవడానికి ఏకంగా 3 సంవత్సరాలు తీసుకుంది.

మరి ఇంత తక్కువ సమయంలో విండ్‌సర్ ఈవీ భారత మార్కెట్‌లో ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి, భారతీయుల్లో ఎక్కువ క్రేజ్ పొందడానికి గల కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి..
ఎంజీ విండ్సర్ ఈవీ: స్పేషియస్..
విండ్‌సర్ ఈవీ మొదటి, అతిపెద్ద ప్రయోజనం ఇందులో లభించే అపారమైన స్పేస్. ఈ కారును ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. దీని వీల్‌బేస్ 2700ఎంఎంగా ఉంది. దీనివల్ల లోపల కూర్చునే ప్రయాణికులకు చాలా ఎక్కువ స్థలం లభిస్తుంది. ముఖ్యంగా తగినంత హెడ్‌రూమ్, షోల్డర్-రూమ్, కీ-రూమ్ ఉండటంతో, వెనుక సీటులో కూడా ముగ్గురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
ఎంజీ విండ్సర్ ఈవీ- ప్రీమియం ఇంటీరియర్..
ఎంజీ విండ్సర్ ఈవీ ఇంటీరియర్ దాని ధర కంటే పెద్ద సెగ్మెంట్‌కు చెందినదిగా కనిపిస్తుంది!
ఈ ఎలక్ట్రిక్ కారులో కుషన్ తరహా సీట్లు అధిక సౌకర్యాన్ని అందిస్తాయి.
డాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లపై సాఫ్ట్ టచ్ మెటీరియల్‌ను ఉపయోగించారు.
డ్రైవర్‌కు లెదర్ స్టీరింగ్ వీల్ లభిస్తుంది.
మొత్తంగా చూస్తే, ఇంటీరియర్ నిర్మాణం చాలా నాణ్యతతో కూడిన అనుభూతిని ఇస్తుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ- సంతృప్తికరమైన రేంజ్..
విండ్‌సర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంది: అవి 38 కేడబ్ల్యూహెచ్, 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్.
38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ రియల్ వరల్డ్ రేంజ్ సుమారు 250 నుంచి 280 కి.మీ వరకు ఉంటుంది.
ఇక పెద్ద బ్యాటరీ ప్యాక్ సుమారు 350 కి.మీ రేంజ్‌ను ఇవ్వగలదు.
కాగా చిన్న బ్యాటరీ ప్యాక్ తీసుకున్న వినియోగదారులకు పెద్ద బ్యాటరీకి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటే మరింత బాగుండేది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ- అత్యాధునిక ఫీచర్లు..
విండ్‌సర్ ఈవీ ఫీచర్ల లోడ్‌తో వస్తుంది. అవి..
యాంబియంట్ లైటింగ్
ప్రీమియం సౌండ్ సిస్టమ్
క్రూయిజ్ కంట్రోల్
పవర్ ఆపరేటెడ్ డ్రైవర్ సీటు
పనోరమిక్ సన్‌రూఫ్
వైర్లెస్ ఛార్జర్
360 డిగ్రీ కెమెరా
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
రేర్ ఏసీ వెంట్లు
ఆటో హోల్డ్
రేర్ రిక్లైన్ సీట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అదనంగా, ఇందులో అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ కూడా అందిస్తున్నారు. అయితే, దీనిని భారతీయ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా పూర్తిగా ట్యూన్ చేయడం జరిగింది.
ఎంజీ విండ్సర్ ఈవీ- వాల్యూ ఫర్ మనీ..
రూ. 12.65లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో, విండ్‌సర్ ఈవీ పెట్రోల్/డీజిల్ ఇంజిన్ వాహనాలతో పోలిస్తే కూడా వాల్యూ ఫర్ మనీ ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తోంది. దీని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 18.39లక్షల్లో (ఎక్స్-షోరూమ్) ముగుస్తుంది.
మరి మీరు ఎంజీ విండ్సర్ ఈవీని కొంటున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


