సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాలు చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉన్నా.. కంపెనీలు ఇచ్చే జాబ్ ట్రాన్స్‌ఫర్‌లు (ఉద్యోగ బదిలీలు) వారి వ్యక్తిగత జీవితాలపై, జేబులపై ఎంతటి ప్రభావం చూపుతాయో వివరించే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఐటీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’లో పనిచేస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో పేర్కొన్న క్రిష్ అనే డిజిటల్ వ్లాగర్.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారడానికి తనకు అయిన ఖర్చుల వివరాలను నెటిజన్లతో పంచుకున్నాడు.

"హైదరాబాద్‌లో సరికొత్తగా ఒక సంసారాన్ని సున్నా నుంచి ప్రారంభించడానికి నాకు ఎంత ఖర్చయిందో చూడండి," అంటూ అతను పెట్టిన రీల్ ఇప్పుడు ఐటీ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సున్నా నుంచి కొత్త కాపురం..
తన ఉద్యోగ నిమిత్తం భార్యతో కలిసి భాగ్యనగరానికి మారాల్సి వచ్చిందని క్రిష్ వివరించాడు. "మాకు బెంగళూరులో సొంత ఇల్లు ఉంది. కానీ జాబ్ బదిలీ వల్ల హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. నా ఉద్యోగం కోసం నా భార్య బెంగళూరులో తన జాబ్‌ను వదిలేసి ఎంతో త్యాగం చేసింది. అడ్వాన్స్ డిపాజిట్లు, అద్దెలు చెల్లించడం దగ్గర నుంచి.. కొత్త ఫర్నిచర్, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం వరకు ప్రతిదీ సున్నా నుంచి సమకూర్చుకున్నాం," అని క్రిష్ పేర్కొన్నాడు.
క్రిష్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఖర్చుల లెక్కలను పూసగుచ్చినట్లు వివరించాడు. హైదరాబాద్‌లో ఒక విశాలమైన 2 బీహెచ్‌కే ఫ్లాట్‌ను నెలకు రూ. 30,000 అద్దెకు తీసుకున్నట్లు చెప్పాడు. దీనికోసం అడ్వాన్స్ కింద రూ. 60,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్టు వివరించాడు. ఆ తర్వాత ఇల్లు సర్దుకోవడానికి కొన్న ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫిట్‌నెస్ పరికరాలు.. ఇలా అన్ని ఖర్చులూ కలిపి హైదరాబాద్‌కు మారేసరికి చేతిలో నుంచి మొత్తం రూ. 3.6 లక్షలు ఖర్చయ్యాయని తుది బిల్లును చూపించాడు.
మణికొండలో రూ. 30 వేలకే 2 బీహెచ్‌కే.. నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. "మీరు చెప్పిన ఏరియా ఎక్కడో చెప్పండి బ్రో.. రూ. 30 వేలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఎక్కడ దొరికింది?" అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి క్రిష్ సమాధానమిస్తూ.. "ఇది గచ్చిబౌలి లేదా హైటెక్ సిటీ కాదు.. మణికొండలోని ఒక స్టాండ్అలోన్ బిల్డింగ్ ," అని స్పష్టం చేశాడు.
{{/usCountry}}ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. "మీరు చెప్పిన ఏరియా ఎక్కడో చెప్పండి బ్రో.. రూ. 30 వేలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఎక్కడ దొరికింది?" అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి క్రిష్ సమాధానమిస్తూ.. "ఇది గచ్చిబౌలి లేదా హైటెక్ సిటీ కాదు.. మణికొండలోని ఒక స్టాండ్అలోన్ బిల్డింగ్ ," అని స్పష్టం చేశాడు.
{{/usCountry}}మరో నెటిజన్ స్పందిస్తూ.. "చాలా మంచి వీడియో. మీ సొంత ఊరు ఏపీనా?" అని అడగ్గా.. "మా తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్. కానీ నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే. అక్కడ మాకు సొంత ఇల్లు ఉంది, ఇప్పుడే ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను," అని క్రిష్ రిప్లై ఇచ్చాడు.
ఐటీ కంపెనీల తీరుపై కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. "ఈ ఐటీ కంపెనీలకు ఉద్యోగులను అద్దె ఇళ్ల చుట్టూ తిప్పడం ఎందుకు అంత ఇష్టమో అర్థం కాదు.. ఐటీ ఉద్యోగం ఇప్పుడు నాకొక పెద్ద పీడకలలా మారింది," అని ఒకరు కామెంట్ చేయగా.. "రూ. 3.6 లక్షలంటే ఇది కచ్చితంగా మిడిల్ క్లాస్ బడ్జెట్ కాదు బాబోయ్!" అని మరొకరు అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఐటీ ఉద్యోగుల బదిలీలు ఎంత ఖర్చుతో కూడుకున్నవో ఈ వీడియో కళ్లకు కట్టింది.