భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని టెక్ ప్రియుల్లో మోటోరోలా బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎడ్జ్ 70 సిరీస్‌ను మరింత బలోపేతం చేస్తూ, సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ 'మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్' అనే స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ భారత్‌లో ప్రవేశపెడుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ డిజైన్, లాంచ్ తేదీతో పాటు కీలకమైన హార్డ్‌వేర్ ఫీచర్లు అధికారికంగా వెలుపలికి వచ్చాయి.
మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్- లాంచ్ డేట్, డిజైన్ లీక్స్..

ఫ్లిప్‌కార్ట్ అధికారిక సమాచారం ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జులై 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుంది. మైక్రోసైట్‌లో షేర్ చేసిన చిత్రాలను గమనిస్తే, ఈ ఫోన్ చాలా స్లిమ్ బెజెల్స్, ఫ్లాట్ డిస్‌ప్లే, వెనుక వైపు స్క్వేర్ కెమెరా మోడ్యూల్‌తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. మోటోరోలా ఈ హ్యాండ్‌సెట్‌ను లైట్ బ్లూ (లేత నీలం), గ్రీన్ (ఆకుపచ్చ) రంగుల్లో తీసుకొస్తున్నట్లు స్పష్టమైంది.
మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో..
భారీ గేమింగ్, మల్టీటాస్కింగ్ ఇష్టపడే వారి కోసం మోటోరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ సంస్థకు చెందిన అత్యంత శక్తివంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5’ ఎస్ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించింది.
ఈ చిప్‌సెట్ పాత మోడళ్లతో పోలిస్తే ఏఐకి సంబంధించిన ఎన్‌పీయూ పనితీరును 46 శాతం మేర మెరుగుపరుస్తుంది.
ఈ ఫోన్ అంటుటూ బెంచ్‌మార్క్ టెస్ట్‌లో ఏకంగా 30 లక్షల కంటే ఎక్కువ స్కోరు సాధించడం విశేషం.
ఇందులో 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌ను అందించారు. ఇది ఆన్-డివైస్ ఏఐ ప్రాసెసింగ్‌కు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది.
{{/usCountry}}ఇందులో 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌ను అందించారు. ఇది ఆన్-డివైస్ ఏఐ ప్రాసెసింగ్‌కు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది.
{{/usCountry}}తీవ్రమైన పనిభారంలో లేదా గంటల తరబడి గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 5,500 చదరపు ఎంఎం వేపర్ కూలింగ్ ఛాంబర్‌తో కూడిన ‘ఆర్కిటిక్‌మెష్’ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది వేడిని సమర్థవంతంగా నియంత్రించి ప్రొసెసర్ వేగాన్ని స్థిరంగా ఉంచుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్- కళ్లు చెదిరే డిస్‌ప్లే..!
మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ డిస్‌ప్లే పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇందులో క్వాడ్-హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ ప్యానెల్‌ను వాడారు. ఇది 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 7,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించడం గమనార్హం. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i టెక్నాలజీని ఉపయోగించారు. ప్రముఖ లీక్‌స్టర్ రోలాండ్ క్వాండ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ 6.82-ఇంచుల భారీ స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్- 7,100ఎంఏహెచ్ మెగా బ్యాటరీ!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను వేధించే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాకప్. ఈ సమస్యకు మోటోరోలా శాశ్వత పరిష్కారం చూపింది. ఈ ఫోన్‌లో ఏకంగా 7,100ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 58 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. దీనితో పాటు 90డబ్ల్యూ టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వీటన్నింటికీ మించి, ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ‘మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్’ ఫీచర్‌ను మోటోరోలా ఈ ఫోన్ ద్వారా పరిచయం చేస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ ధర, కెమెరా స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను జులై 15న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ ప్రకటించనుంది.