Smartphones : మార్కెట్లోకి సూపర్ స్మార్ట్‌ఫోన్లు.. మోటోరోలా, షావోమీతో పాటు మరెన్నో! ఈ నెలలోనే లాంచ్
Smartphones launch in June 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి జూన్‌లో అదిరిపోయే గ్యాడ్జెట్స్ లాంచ్ అవుతున్నాయి. వాటి పేర్లు, ఫీచర్లు సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు 2026 జూన్ నెల సరికొత్త పండగను తీసుకురాబోతోంది! మోటోరోలా, షావోమీ, లావా, హువావే, శామ్‌సంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి లైన్ కట్టాయి. ఇందులో అదిరిపోయే ప్రీమియం ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ల నుంచి సామాన్యుడికి అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ల వరకు అన్నీ ఉన్నాయి. జూన్ మొదటి వారంలో ఇండియా, చైనా మార్కెట్లలో విడుదల కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితా, వాటి లాంచ్ డేట్స్, ఫీచర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

1. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+
లాంచ్ తేదీ: జూన్ 4 (ఇండియా)
ఎక్కడ లభిస్తుంది: ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ రిటైల్ స్టోర్స్.
కలర్ ఆప్షన్స్: పాంటోన్ చికోరి కాఫీ, పాంటోన్ స్టార్మీ సీ, పాంటోన్ జిన్‌ఫాండెల్ కలర్స్‌లో ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ అందుబాటులోకి వస్తుంది.
ముఖ్యమైన ఫీచర్లు: ఈ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-710 ప్రైమరీ కెమెరాతో పాటు, 50ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్, 16జీబీ వరకు ర్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది.
2. షావోమీ 17టీ..
లాంచ్ తేదీ: జూన్ 4 (ఇండియా)
ముఖ్యమైన ఫీచర్లు: షావోమీ నుంచి రాబోతున్న ఈ ప్రీమియం ఫోన్ లైకా ట్యూన్డ్ కెమెరాతో వస్తోంది. ఇందులో 50ఎంపీ లైట్ ఫ్యూజన్ 800 ప్రైమరీ కెమెరా, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ పెరిస్కోప్ కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి.
బ్యాటరీ అండ్ పవర్: ఇందులో ఏకంగా 6,500ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు, ఇది 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500-అల్ట్రా ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది.
3. లావా బోల్డ్ ఎన్2 5జీ..
లాంచ్ తేదీ: జూన్ 3, మధ్యాహ్నం 12 గంటలకు (ఇండియా)
ఎక్కడ లభిస్తుంది: అమెజాన్
ముఖ్యమైన ఫీచర్లు: బడ్జెట్ వినియోగదారుల కోసం లావా ఈ బోల్డ్ ఎన్2 5జీ ఫోన్‌ను తెస్తోంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో రానుంది. ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, 13ఎంపీ మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఇందులో ఉండబోతున్నాయి. ఇది ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన లావా బోల్డ్ ఎన్2 4జీ (ధర రూ. 7,499) కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వస్తోంది.
4. హువావే నోవా 16 సిరీస్..
లాంచ్ తేదీ: జూన్ 1 (చైనా)
ముఖ్యమైన ఫీచర్లు: హువావే ఈ సిరీస్‌లో నోవా 16, నోవా 16 ప్రో, నోవా 16 అల్ట్రా అనే మూడు మోడళ్లను చైనాలో విడుదల చేసింది. ఇందులో టాప్ ఎండ్ వెర్షన్ అయిన 'అల్ట్రా' మోడల్ పెద్ద స్క్రీన్, ఏకంగా 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తుంది.
లాంచ్ కానున్న మరికొన్ని క్రేజీ ఫోన్లు..
అధికారికంగా డేట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ, జూన్ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న మరికొన్ని ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ27- స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 6.7-ఇంచ్ డిస్‌ప్లే, 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12ఎంపీ ఫ్రంట్ కెమెరా.
శామ్‌సంగ్ గెలాక్సీ M47- 6.7-ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఛార్జింగ్.
ఒప్పో ఏ6సీ- బేస్ మోడల్ (4GB+64GB) ధర రూ. 13,999 గా ఉండే అవకాశం ఉంది. 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఐపీ64 రేటింగ్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


