...
...
Next Story

ఇంటర్నెట్​ని షేక్​ చేస్తున్న ధోనీ- కోహ్లి వైరల్​ ఫొటో ఇది..

దక్షిణాఫ్రికాతో మొదటి వన్డే కోసం రాంచీ వెళ్లింది టీమిండియా. ఈ నేపథ్యంలో ప్లేయర్లకు ఎంఎస్​ ధోనీ విందు ఏర్పాటు చేశాడు. అనంతరం కోహ్లీని తన కారులో స్వయంగా డ్రాప్​ చేశాడు! ఈ ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Published on: Nov 28, 2025, 09:13:14 IST
Advertisement

క్రికెట్​ లవర్స్​కి చాలా కాలం గుర్తుండిపోయే విధంగా సోషల్​ మీడియాలో ప్రస్తుతం ఒక ఫొటో వైరల్​ అవుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్​ ఎంఎస్​ ధోనీ, మాజీ సారథి విరాట్​ కోహ్లీలు ఒక కారులో దర్శనమిచ్చారు. గురువారం రాంచీలోని తన నివాసంలో కలిసిన తర్వాత, కోహ్లీని ధోనీ స్వయంగా తన కారులో తీసుకెళ్లి డ్రాప్ చేస్తున్నప్పుడు ఈ ఫొటోని క్లిక్​ చేశారు.

టీమిండియా ఆటగాళ్లకు విందు ఇచ్చిన ధోనీ..

MS Dhoni drives Virat Kohli (@chixxsays/X)
MS Dhoni drives Virat Kohli (@chixxsays/X)

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి వన్డే మ్యాచ్​ ఆడనుంది. జట్టు రాంచీలో దిగిన సందర్భంగా, ఆటగాళ్లకు ధోనీ విందు ఏర్పాటు చేశాడు. సాధారణంగా ధోని స్వస్థలమైన రాంచీలో భారత్ ఆడినప్పుడల్లా ఇలా కలుసుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ ఆత్మీయ కలయిక.. కీలకమైన వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) ఛాలెంజ్‌కు ముందు జట్టులో ప్రశాంతమైన, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించింది. టెస్టు సిరీస్ ఓటమి బాధ ఉన్నప్పటికీ, రాంచీలో ధోనీని కలవడం, అతని నుంచి టిప్స్​ తీసుకోవడంతో ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుంది.

విందు తర్వాత, ధోని తన కారులో కోహ్లీని తీసుకెళ్లడం కనిపించింది. ఫలితంగా చాలా కాలం తర్వాత, అభిమానులు ఈ ఇద్దరు స్టార్స్‌ను ఒకేసారి చూడగలిగారు. ధోని స్వయంగా కోహ్లీని టీమ్ హోటల్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లాడని సోషల్ మీడియాలో కొందరు చెబుతున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోని ఇక్కడ చూడండి:

గత నెలలో ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కోహ్లీ మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాలో అతడికి పెద్దగా అనుకూలించలేదు. తొలి రెండు మ్యాచుల్లో డకౌట్ అయినప్పటికీ, చివరి మ్యాచ్‌లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ ఆ మ్యాచ్ గెలిచింది.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ గాయాల నుంచి కోలుకుంటున్నందున, ఈ సిరీస్‌కు వారి సేవలు జట్టుకు అందుబాటులో ఉండవు. కాబట్టి, దృష్టి అంతా కోహ్లీపైనే కేంద్రీకృతమై ఉంటుంది.

ప్రొటియాస్‌పై కోహ్లీ అద్భుత రికార్డు..

దక్షిణాఫ్రికా జట్టుపై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది! ఇప్పటివరకు ఆడిన 31 మ్యాచుల్లో కోహ్లీ 65.39 సగటుతో 1504 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతడు దక్షిణాఫ్రికాపై ఐదు సెంచరీలు, ఎనిమిది అర్థ సెంచరీలు నమోదు చేశాడు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe