ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ వైట్-బాల్ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అతడు గురువారం (మార్చి 5) ముంబైలో జరిగిన అర్జున్ టెండూల్కర్ - సానియా చందోక్ వివాహ వేడుకలో మెరిశాడు. తన భార్య సాక్షితో కలిసి వేదిక వద్దకు చేరుకున్న ధోనీ.. ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ ఫోజులిచ్చాడు. సాక్షి లోపలికి వెళ్లిన తర్వాత కూడా ధోనీ మరికొంత సమయం పాపరాజీల కోసం వేచి ఉండి, వారందరినీ పలకరించడం విశేషం. అయితే అతని చేతుల్లో ఉన్న మొబైల్ పైనే అందరి కళ్లూ పడ్డాయి.
ధోనీ మొబైల్ ఫోన్ మిస్టరీ
ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ధోనీ చేతిలో మొబైల్ ఫోన్ ఉండటం. ధోనీకి ఫోన్లంటే పెద్దగా ఇష్టం ఉండదని, కనీసం మెసేజ్‌లకు కూడా స్పందించరని అతని మాజీ సహచరులు చాలా సందర్భాల్లో చెప్పారు. గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ సాయి కిషోర్ కూడా గతంలో ధోనీ ఫోన్ వాడకం గురించి చెబుతూ.. "ధోనీ తన ఫోన్‌ను హోటల్ గదిలోనే వదిలేసి మ్యాచ్‌లకు వస్తారు. సోషల్ మీడియాకు, ఫోన్లకు ఆయన చాలా దూరంగా ఉంటారు" అని వెల్లడించారు.
అలాంటిది ధోనీ ఫోన్ పట్టుకుని కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇది అత్యంత అరుదుగా కనిపించే సీన్ అని, అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో ఇది సాధ్యమైందని పలువురు ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ మరికొందరు ఈ న్యూస్ షేర్ చేయగా.. అది సాక్షి ఫోన్ అయితే కాదుగా అని అనుమానం కూడా వ్యక్తం చేశారు.
ప్రముఖుల సమక్షంలో అర్జున్ వివాహం
గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా సందడి చేశారు.
ఐపీఎల్ 2026 సిద్ధం
ధోనీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) శిక్షణ శిబిరంలో చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం అతడు సిద్ధమవుతున్నాడు. మరోవైపు, అర్జున్ టెండూల్కర్ ఈసారి ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున బరిలోకి దిగనున్నాడు. రూ. 30 లక్షల ట్రేడ్ డీల్‌తో అతడు లక్నో జట్టులో చేరాడు.
{{/usCountry}}ధోనీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) శిక్షణ శిబిరంలో చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం అతడు సిద్ధమవుతున్నాడు. మరోవైపు, అర్జున్ టెండూల్కర్ ఈసారి ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున బరిలోకి దిగనున్నాడు. రూ. 30 లక్షల ట్రేడ్ డీల్‌తో అతడు లక్నో జట్టులో చేరాడు.
{{/usCountry}}