Multibagger stock : 6ఏళ్లల్లో రూ. 1లక్షని రూ. 14.10 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​ ఇది..

ఫుడ్ ఇండస్ట్రీకి చెందిన నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్​లో అద్భుతాలు సృష్టిస్తోంది. గత ఆరేళ్లలో ఈ షేరు ఏకంగా 1,40,000 శాతానికి పైగా లాభాలను అందించి, ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 1,000 కోట్లకు చేరుకుంది.

Published on: Feb 14, 2026 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టాక్​ మార్కెట్​ ప్రపంచంలో అతి తక్కువ సమయంలో అసాధారణ లాభాలను అందించే 'మల్టీబ్యాగర్' స్టాక్‌ని పట్టుకోవడం ఇన్వెస్టర్స్​కి ఒక కల. అలాంటి కలని నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ నిజం చేసింది. గత కొన్ని ఏళ్లుగా భారీ లాభాలతో దూసుకుపోతున్న ఈ స్టాక్, తన వాటాదారుల సంపదను కనీవినీ ఎరుగని రీతిలో పెంచేసింది! కేవలం 6 ఏళ్లల్లో రూ. 1లక్షని ఏకంగా రూ. 14.10 కోట్లుగా మార్చేసింది. ఇది మల్టీబ్యాగర్​ స్టాక్​ మాత్రమే కాదు.. ఇదొక మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​.

మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​ అలర్ట్​..
మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​ అలర్ట్​..

మధ్యలో కొంతకాలం ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, సెప్టెంబర్ 2025 నుంచి ఈ షేరు మళ్లీ పుంజుకుని బుల్స్​ని ఆకర్షించడంతో ఇన్వెస్టర్ల పంట పండింది! ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ. 1,000 కోట్లకు చేరింది.

కంపెనీ నేపథ్యం..

1995లో స్థాపించిన ఈ నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ (గతంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్).. ఆహార రంగంలో విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఆర్గానిక్, ఇన్-ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తయారీలో ఈ కంపెనీ ప్రముఖంగా నిలుస్తోంది.

ఆరేళ్ల ప్రస్థానం: రూ. 0.03 నుంచి రూ. 42.30 వరకు..

ఈ నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ స్టాక్ ప్రయాణం అసాధారణం అనే చెప్పాలి! ఆరేళ్ల క్రితం కేవలం రూ. 0.03 (3 పైసలు) వద్ద ట్రేడ్ అయిన ఈ షేరు, ప్రస్తుతం రూ. 42.30 వద్ద కొనసాగుతోంది. అంటే ఈ కాలంలో ఏకంగా 1,40,566% వృద్ధిని నమోదు చేసింది.

ఇన్వెస్ట్‌మెంట్​పై ప్రభావం: ఆరేళ్ల క్రితం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి, ఇప్పటి వరకు అలాగే ఉంచుకుని ఉంటే.. నేడు ఆ పెట్టుబడి విలువ అక్షరాలా రూ. 14.10 కోట్లు అయ్యేది.

(గమనిక: అక్టోబర్ 2024లో జరిగిన 1:10 స్టాక్ స్ల్పిట్​, ఏప్రిల్ 2024లోని 1:1 బోనస్ ప్రయోజనాలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. వాటిని కలిపితే లాభం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది).

ఇటీవలి పనితీరు..

స్టాక్​ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఈ నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ స్టాక్ పటిష్టంగా ఉంది:

సెప్టెంబర్ 2025లో 36% మేర పుంజుకుంది.

జనవరి 2026 నాటికి ఏకంగా 102% భారీ లాభాలను అందించింది.

2026 ఏడాదిలో ఇప్పటివరకు 22% వృద్ధిని సాధించింది.

క్యూ3 ఫలితాలు అద్భుతం..

డిసెంబర్ 2025తో ముగిసిన త్రైమాసికంలో నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ గణాంకాలు బలంగా ఉన్నాయి:

నికర లాభం: ఏడాది ప్రాతిపదికన (వైఓవై) 95% పెరిగి రూ. 34.60 కోట్లకు చేరింది.

ఆదాయం: 46% వృద్ధి చెంది రూ. 290 కోట్లుగా నమోదైంది.

ఎబిట్​డా: రెండింతలు పెరిగి రూ. 33.19 కోట్లకు చేరగా, మార్జిన్లు 11.45%కి విస్తరించాయి.

డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ విస్తరణ, ప్యాకేజింగ్ మెరుగుదల, బేకరీ విభాగంలోకి వ్యూహాత్మక ప్రవేశం తమ బ్రాండ్ వృద్ధికి తోడ్పడ్డాయని కంపెనీ పేర్కొంది.

సాధారణంగా మల్టీబ్యాగర్​ స్టాక్​ అంటేనే రిస్కీ! ఇక మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​ అంటే అత్యంత రిస్కీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More