ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, మానసిక వైకల్యంతో ఉన్న తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ దారుణమైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.
అసలేం జరిగింది?

అక్టోబర్ 2025లో దక్షిణ ముంబైలోని కామా అండ్ ఆల్ బ్లెస్ ఆసుపత్రి నుంచి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తీవ్రమైన కడుపునొప్పితో అడ్మిట్ అయిన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలు 5 నెలల గర్భవతి అని వైద్యులు సమాచారం అందించారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటంతో, ఆమెపై ఎవరో ఒకరు కాదు, పలువురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
డిఎన్ఏ పరీక్షతో వీడిన మిస్టరీ
కేసును సవాలుగా తీసుకున్న అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశ్విని పాటిల్ బృందం లోతైన దర్యాప్తు చేపట్టింది. బాధితురాలు చూపించిన ఫొటోల ఆధారంగా తొలుత 16 ఏళ్ల బాలుడిని, 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, గర్భానికి కారకులు ఎవరనేది తేల్చడానికి పోలీసులు శాస్త్రీయ పద్ధతిని ఎంచుకున్నారు.
బాధితురాలికి గర్భస్రావం చేయించి, పిండం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆమె చుట్టుపక్కల ఉండేవారు, బంధువులతో పాటు మొత్తం 16 మంది అనుమానితుల డిఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించారు.
జనవరి 27న కలీనా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో, పిండం డిఎన్ఏ.. బాధితురాలి తండ్రి డిఎన్ఏతో సరిపోలింది.
భయంతోనే తండ్రి పేరు చెప్పలేదు
బాధితురాలు మాటలు లేని స్థితిలో ఉన్నప్పటికీ, నిపుణుల సహాయంతో ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 'విధాయక్ భారతి' అనే ఎన్జీవో సహకారంతో వివిధ రకాల థెరపీలను ఉపయోగించి పోలీసులు ఆమెతో మాట్లాడించగలిగారు. ఆ సమయంలో తన తండ్రి కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అయితే ఆయన అరెస్ట్ అవుతారనే భయంతోనో లేదా నిందితులు బెదిరించడం వల్లో ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టినట్లు అర్థమైంది.
{{/usCountry}}బాధితురాలు మాటలు లేని స్థితిలో ఉన్నప్పటికీ, నిపుణుల సహాయంతో ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 'విధాయక్ భారతి' అనే ఎన్జీవో సహకారంతో వివిధ రకాల థెరపీలను ఉపయోగించి పోలీసులు ఆమెతో మాట్లాడించగలిగారు. ఆ సమయంలో తన తండ్రి కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అయితే ఆయన అరెస్ట్ అవుతారనే భయంతోనో లేదా నిందితులు బెదిరించడం వల్లో ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టినట్లు అర్థమైంది.
{{/usCountry}}"బాధితురాలు తీవ్రమైన భయాందోళనల్లో ఉంది. ఎవరికీ ఏమీ చెప్పవద్దని నిందితులు ఆమెను హెచ్చరించినట్లు మాకు తెలిసింది. ఫోరెన్సిక్ రిపోర్టులు తండ్రి ప్రమేయాన్ని ఖచ్చితంగా నిర్ధారించడంతో మంగళవారం అతడిని అరెస్ట్ చేశాం" అని పోలీస్ అధికారి తెలిపారు.
ప్రస్తుతం తండ్రితో పాటు అంతకుముందు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కూడా చార్జిషీట్ దాఖలు చేసే ప్రక్రియలో పోలీసులు ఉన్నారు. రక్షణగా ఉండాల్సిన తండ్రే రాక్షసుడిలా మారిన ఈ ఘటన ముంబైలో కలకలం రేపుతోంది.