...
...
Next Story

కాళీ మాత విగ్రహానికి మేరీ మాత రూపంలో అలంకరణ.. ముంబైలో షాకింగ్​ ఘటన!

ముంబైలోని ఓ ఆలయంలో కాళీ మాత విగ్రహాన్ని మేరీ మాత రూపంలో అలంకరించడం తీవ్ర కలకలం రేపింది! ఈ చర్యపై హిందూ సంస్థలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పూజారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం.

Published on: Nov 26, 2025, 05:46:13 IST
Advertisement

ముంబైలో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది! చెంబూరు ప్రాంతంలోని ఓ ఆలయంలో కాళీ మాత విగ్రహాన్ని మేరీ మాత రూపంలో అలంకరించడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పరిణామంపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మేరీ మాత రూపంలో కాళీ మాత విగ్రహం!

కాళీ మాతకు మేరీ మాత రూపం..!
కాళీ మాతకు మేరీ మాత రూపం..!

నివేదికల ప్రకారం.. కొందరు భక్తులు దర్శనం కోసం ఆలయానికి వచ్చినప్పుడు, కాళీ మాత విగ్రహం మేరీ మాత రూపాన్ని పోలి ఉండటం చూసి షాక్​ అయ్యారు.

దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనై, వెంటనే ఆలయ నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో, స్థానికంగా ఉన్న పలు హిందూ సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకుని నిరసన తెలియజేశారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిసేపటికే ఆలయానికి చేరుకున్నారు.

పోలీసులు విచారణ జరిపినప్పుడు, ఆలయ పూజారి ఒక వింత వాదన వినిపించారు.

“కాళీ మాత నా కలలోకి వచ్చింది. తనను మేరీ మాత రూపంలో అలంకరించాలని నాకు చెప్పింది. ఆజ్ఞాపించింది,” అని పూజారి పోలీసులకు చెప్పినట్టు ఓ అధికారి వెల్లడించారు. ఆ 'కల' ఆధారంగానే తాను ఈ రూపంలో విగ్రహాన్ని అలంకరించినట్లు పూజారి ఒప్పుకున్నట్టు వివరించారు.

అయితే, భక్తులు మాత్రం పూజారి చర్యను మత విశ్వాసాల ఉల్లంఘనగా తీవ్రంగా ఖండించారు.

పెరుగుతున్న నిరసనలు, ఆందోళనల దృష్ట్యా, పోలీసులు ఆలయ పూజారిపై కేసు నమోదు చేసి, ఆయన్ని అరెస్ట్ చేశారు.

“నివేదికల ప్రకారం.. ముంబై చెంబూర్​లోని మైసూర్​ కాలనీ దగ్గర కాళీ మాత విగ్రహాన్ని మేరీ మాతగా ఆలకరించారు. ఇది సృజనాత్మక విషయం కాదు! ఇది అగౌరవపరచడం. విశ్వాసాలు ఉండొచ్చు. కానీ ఒకరి విగ్రహాన్ని మరొక మతానికి ముడిపెట్టడం అంటే హద్దులు దాటడమే. హాస్యాస్పదంగా పూజారే ఈ పనిచేశారు! కాళీ మాత తన కలలోకి వచ్చి ఇలా చేయమని చెప్పిందని అంటున్నాడు,” అని వీడియోతో పాటు ఒక పోస్ట్​ పెట్టారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks