దేశీయ పసిడి రుణ (Gold Loan) రంగంలో ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అయిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించేందుకు వీలుగా పెంపుదల ప్రతిపాదనలతో కూడిన తుది ముసాయిదా పత్రాలను (DRHP) సెబీకి సమర్పించింది.
ఆ నిధులతో విస్తరణ ప్రణాళికలు

ఈ ఐపీఓ ద్వారా సేకరించే నిధులను పూర్తిగా కొత్త ఈక్విటీ షేర్ల (Fresh Issue) జారీ ద్వారానే సమీకరించనున్నట్లు కంపెనీ డ్రాఫ్ట్ పత్రాల్లో స్పష్టం చేసింది. ఈ సొమ్మును సంస్థ టియర్-1 క్యాపిటల్ బేస్ బలోపేతం చేసుకోవడానికి, భవిష్యత్ మూలధన అవసరాల కోసం ఉపయోగించనుంది. దీనివల్ల కంపెనీ రుణ వితరణ సామర్థ్యం పెరగడంతో పాటు వ్యాపార విస్తరణకు బాటలు పడనున్నాయి.
ఈ ఆఫరింగ్ నిర్వహణ కోసం కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, జేఎమ్ ఫైనాన్షియల్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌ను బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.
1887 నాటి ఘనమైన చరిత్ర
ముత్తూట్ పప్పాచన్ గ్రూప్‌లో భాగమైన ముత్తూట్ ఫిన్‌కార్ప్‌కు 1887 నాటి సుదీర్ఘమైన వ్యాపార చరిత్ర ఉంది. పసిడి రుణాలు ప్రధాన వ్యాపారంగా కలిగిన ఈ సంస్థ వ్యాపార రుణాలు, ఆస్తుల ఆధారిత రుణాలు, సప్లై చైన్ ఫైనాన్స్, డిజిటల్ లోన్లు, మైక్రోఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ వంటి వైవిధ్యమైన ఆర్థిక సేవలను అందిస్తోంది.
రెండు దశాబ్దాలకు పైగా పసిడి రుణ విభాగంలో సేవలందిస్తున్న ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది. 'ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్' అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా ఖాతాదారులకు సేవలు అందిస్తోంది.
అద్భుతమైన ఆర్థిక ప్రగతి
2026 మార్చి 31 నాటికి ముత్తూట్ ఫిన్‌కార్ప్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (AUM) ఏకంగా రూ.73,444.72 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా సంస్థకు 5,610 శాఖలు ఉండగా, డిజిటల్ వేదికపై 42.6 లక్షల (4.26 మిలియన్లు) మంది వినియోగదారులు ఉన్నారు.
{{/usCountry}}2026 మార్చి 31 నాటికి ముత్తూట్ ఫిన్‌కార్ప్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (AUM) ఏకంగా రూ.73,444.72 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా సంస్థకు 5,610 శాఖలు ఉండగా, డిజిటల్ వేదికపై 42.6 లక్షల (4.26 మిలియన్లు) మంది వినియోగదారులు ఉన్నారు.
{{/usCountry}}ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ (Crisil) నివేదిక ప్రకారం, మార్చి 2024 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో కంపెనీ గోల్డ్ లోన్ ఏయూఎమ్ 59.04 శాతం వార్షిక చక్రవృద్ది రేటును (CAGR) నమోదు చేసి, ఈ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థగా నిలిచింది.
గత ఆర్థిక సంవత్సరం (FY26) లో కంపెనీ ఆర్థికంగా అత్యుత్తమ ఫలితాలను సాధించింది. 2024-25 (FY25) ఆర్థిక సంవత్సరంలో రూ.607.90 కోట్లుగా ఉన్న సమీకృత నికర లాభం, FY26 చివరినాటికి ఏకంగా రూ.1,847.62 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ ఆపరేషనల్ రెవెన్యూ రూ.8,497.69 కోట్ల నుంచి రూ.11,203.81 కోట్లకు ఎగబాకింది.