NEET UG 2026 : నీట్​ యూజీ రీ-ఎగ్జామినేషన్ తేదీని ప్రకటించిన ఎన్టీఏ, ఎప్పుడంటే..

NEET UG 2026 Re Exam date  : నీట్​ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్​ తేదీని ఎన్టీఏ ప్రటించింది. ఈ మేరకు ఎక్స్​లో ఒక పోస్ట్​ చేసింది. నీట్​ యూజీ 2026 పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

Published on: May 15, 2026, 09:50:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పేపర్​ లీక్​ కారణంగా ఇటీవలే రద్దు అయిన నీట్​ (నేషనల్​ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్​ టెస్ట్) యూజీ 2026 పరీక్ష జూన్ 21న మళ్లీ జరగనుంది. ఈ మేరకు నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కొత్త తేదీని శుక్రవారం ఉదయం ప్రకటించింది.

నీట్​ యూజీ 2026 పేపర్​ లీక్​పై నిరసనలు.. (Amit shukla )
నీట్​ యూజీ 2026 పేపర్​ లీక్​పై నిరసనలు.. (Amit shukla )

“కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో నీట్​ యూజీ 2026 పరీక్షను జూన్ 21, ఆదివారం నిర్వహిస్తాము,” అని ఎన్టీఏ ఎక్స్​ వేదికగా ప్రకటించింది.

నీట్​ పరీక్షకు సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా ఎన్టీఏ అధికారిక వెబ్​సైట్స్​, కమ్యూనికేషన్ ఛానెల్స్​నే సంప్రదించాలని, ఫేక్​ వార్తలకు దూరంగా ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు టెస్టింగ్​ ఏజెన్సీ అభ్యర్థించింది.

అభ్యర్థులు neet-ug@nta.ac.in లేదా 011-40759000, 011-69227700ని సంప్రదించి నీట్​ యూజీ 2026కి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని ఎన్టీఏ స్పష్టం చేసింది.

నీట్​ యూజీ 2026 పేపర్​ లీక్..

వాస్తవానికి ఈ నెల 3వ తేదీనే నీట్​ యూజీ 2026 పరీక్ష జరిగింది. రాత్రింపగళ్లు శ్రమించి, ప్రిపేర్ అయిన 20లక్షలకుపైగా విద్యార్థులు ఈ వైద్య ఎంట్రెన్స్​ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, పరీక్ష ముగిసిందని కాస్త రిలీఫ్ పొందిన సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు షాక్​ తగిలింది! నీట్​ యూజీ పేపర్​ లీక్​ అయ్యిందన్న వార్తలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. పేపర్​ లీక్​ ఆరోపణలు వాస్తవమే అని గుర్తించిన ఎన్టీఏ.. మే 3న జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

లక్షలాది మంది విద్యార్థులు, ఏళ్ల తరబడి శ్రమించి రాసే నీట్​ వంటి పరీక్షల్లో అవకతవకలను ఎత్తిచూపుతూ, ఎన్టీఏ వైఖరిపై ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి.

మరోవైపు నీట్​ యూజీ పేపర్​ లీక్​ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. రాజస్థాన్​ నుంచి తొలుత పేపర్​ లీక్ సమాచారం వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం అనేక చోట్ల రైడ్లు చేసి, పలువురు అనుమానితులను అరెస్ట్​ చేశారు. వీరిలో గురుగ్రామ్​కి చెందిన యష్​ యాదవ్, జైపూర్​కి చెందిన మంగిలాల్ ఖాటిక్, వికాశ్ బివాల్, దినేశ్​ బివాల్, నాశిక్​కి చెందిన ఖైర్నార్​లు ఉన్నారు.

“నీట్​ యూజీ 2026 పేపర్​ లీక్​ కేసును ట్రేస్​ చేస్తే, అది ఎన్టీఏ లోపలి వ్యక్తి (సోర్సు) వరకు దారి తీస్తోంది,” అని దిల్లీ హైకోర్టుకు సీబీఐ గురువారం వెల్లడించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More