ప్రముఖ వినియోగ వస్తువుల తయారీ సంస్థ (FMCG) నెస్లే ఇండియా జూన్ 30, 2026తో ముగిసిన తొలి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను బుధవారం వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో వ్యూహాత్మక విస్తరణ, పెరిగిన డిమాండ్ కారణంగా కంపెనీ నికర లాభం, రాబడి రెండూ భారీగా వృద్ధి చెందాయి.
ఆర్థిక గణాంకాలు ఇవే
2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నెస్లే ఇండియా రూ.975 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.660 కోట్లతో పోలిస్తే ఇది 48 శాతం అధికం.
కార్యాచరణ ఆదాయం (Revenue from Operations): గతేడాది తొలి త్రైమాసికంలో రూ.5,096 కోట్లుగా ఉన్న రాబడి ఈసారి 25 శాతం పెరిగి రూ.6,378 కోట్లకు చేరింది.
ఎబిటా (EBITDA): ఏడాది ప్రాతిపదికన 40 శాతం వృద్ధి చెంది రూ.1,100 కోట్ల నుంచి రూ.1,538 కోట్లకు ఎగబాకింది.
మార్జిన్లు: ఎబిటా మార్జిన్ 250 బేసిస్ పాయింట్లు విస్తరించి 21.6 శాతం నుంచి 24.2 శాతానికి మెరుగైంది.
మొత్తం అమ్మకాలు: త్రైమాసికంలో మొత్తం విక్రయాలు రూ.6,363.3 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో దేశీయ అమ్మకాలే (Domestic Sales) 25 శాతం వృద్ధి సాధించడం విశేషం.
"నాలుగు ప్రధాన ఉత్పత్తుల విభాగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఇ-కామర్స్, ప్రీమియమైజేషన్ సాయంతో కన్ఫెక్షనరీ విభాగంలో వాల్యూమ్ గ్రోత్ లభించింది. ముఖ్యంగా 'కిట్‌కాట్' (KITKAT) తన మార్కెట్ వాటాను మరింత పెంచుకుంది" అని నెస్లే ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ పేర్కొన్నారు.
ఉత్పత్తుల వారీగా పనితీరు
ప్రిపేర్డ్ డిషెస్ & కుకింగ్ ఎయిడ్స్ (మ్యాగీ): మ్యాగీ (MAGGI) బ్రాండ్ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు క్విక్ కామర్స్ (Q-com) ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ మ్యాగీ బౌల్స్‌ను పరిచయం చేసింది. అలాగే 'యునిక్లో' (Uniqlo) సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
{{/usCountry}}ప్రిపేర్డ్ డిషెస్ & కుకింగ్ ఎయిడ్స్ (మ్యాగీ): మ్యాగీ (MAGGI) బ్రాండ్ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు క్విక్ కామర్స్ (Q-com) ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ మ్యాగీ బౌల్స్‌ను పరిచయం చేసింది. అలాగే 'యునిక్లో' (Uniqlo) సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
{{/usCountry}}మిల్క్ ప్రొడక్ట్స్ & న్యూట్రిషన్: పసిపిల్లల పోషకాహార ఉత్పత్తులు వరుసగా బలమైన పనితీరును కనబరిచాయి. తల్లిదండ్రులు, ఆరోగ్య నిపుణుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మార్కెట్‌ను విస్తరించాయి.
కన్ఫెక్షనరీ (చాక్లెట్లు): కిట్‌కాట్ బ్రాండ్ రికార్డు వృద్ధి సాధించింది. 'వన్ పీస్' (One Piece) తో కిట్‌కాట్ కుదుర్చుకున్న ఒప్పందం, ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించడం వ్యాపార వృద్ధికి తోడ్పడ్డాయి.
పౌడర్డ్ & లిక్విడ్ బెవరేజెస్ (కాఫీ): నెస్‌కేఫే క్లాసిక్ (NESCAFÉ CLASSIC), నెస్‌కేఫే సన్‌రైజ్ (NESCAFÉ SUNRISE) ఉత్పత్తులు రెండంకెల వాల్యూమ్ వృద్ధిని నమోదు చేయగా, నెస్‌కేఫే గోల్డ్ ద్వారా ప్రీమియం కేటగిరీ విభాగం వేగంగా పుంజుకుంది.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేముందు ఆర్థిక నిపుణులను సంప్రదించగలరు.)