భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఎంతోమంది యువత కలల బైక్ అయిన బజాజ్ పల్సర్ 150 సరికొత్త హంగులతో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ బైక్ దేశంలోని కొన్ని సెలెక్టెడ్ డీలర్‌షిప్‌లకు చేరుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే, పల్సర్ ప్రియుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుందని స్పష్టమవుతోంది. అనేక సంవత్సరాలుగా మార్కెట్‌ని ఏలుతున్న పల్సర్ 150 మెకానిజమ్ అలాగే ఉంచుతూ, చూడటానికి మరింత స్టైలిష్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ కొత్త బజాజ్ పల్సర్ 150 విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త బజాజ్ పల్సర్ 150- ఆధునిక డిజైన్.. ఆకట్టుకునే ఎల్ఈడీ లైటింగ్

ఈ కొత్త మోడల్‌లో ప్రధానంగా ఫ్రంట్ లుక్ పూర్తిగా మారిపోయింది. సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో పాటు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లను జోడించారు. దీనివల్ల పల్సర్ 150 బైక్ మరింత మోడ్రన్ లుక్‌ను సంతరించుకుంది. ఇప్పటివరకు వస్తున్న హాలోజన్ ల్యాంప్స్‌తో పోలిస్తే కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరింత స్పష్టమైన వెలుతురును ఇస్తాయి. అలాగే ఫ్యూయల్ ట్యాంక్, బాడీ ప్యానెల్స్‌పై కొత్త గ్రాఫిక్స్ తీర్చిదిద్దారు. ఇది బైక్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను తెచ్చిపెడుతుంది.
ఇక బైక్‌లో సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఛాసిస్ కూడా కొత్తదిగా వస్తోంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ అలాగే ఉండగా, వెనుక వైపు మాత్రం మోనోషాక్ సస్పెన్షన్‌ను అమర్చారు. సింగిల్-పీస్ సీటుతో పాటు కొన్ని వేరియంట్లలో స్ల్పిట్ (టూ-పీస్) సీటు ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది.
కాగా ఈ సరికొత్త స్టైలింగ్ పల్సర్ 150కి మోడ్రన్ లుక్‌ను తెచ్చినప్పటికీ, దశాబ్దాలుగా వినియోగదారులను ఆకట్టుకున్న ఆ పాత క్లాసిక్ డిజైన్‌కు ఇది కాస్త దూరంగా జరుగుతోంది. కొత్తగా బైక్ కొనే యువతకు ఈ ఫ్రెష్ లుక్ కచ్చితంగా నచ్చుతుంది. అయితే, ఏళ్ల తరబడి పల్సర్‌ను ఇష్టపడే అభిమానులు మాత్రం ఈ మార్పులపై మిశ్రమ స్పందన వ్యక్తంచేసే అవకాశం ఉంది.
కొత్త బజాజ్ పల్సర్ 150- మెకానికల్‌గా మార్పులు లేవు!
బైక్ బాడీ కింద ఉండే కీలకమైన ఇంజిన్ విషయంలో పెద్దగా మార్పులు లేవు. ఇదివరకు ఉన్న అదే 150 సీసీ ఇంజిన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఈసారి ఇది ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌గా రానుంది. ఈ మోటార్ సుమారు 14 బీహెచ్పీ పవర్‌ను, 14 ఎన్ఎం టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ గేర్‌బాక్స్ యథావిధిగా కొనసాగుతుంది.
కొత్త బజాజ్ పల్సర్ 150- త్వరలోనే మార్కెట్లోకి లాంచ్!
{{/usCountry}}బైక్ బాడీ కింద ఉండే కీలకమైన ఇంజిన్ విషయంలో పెద్దగా మార్పులు లేవు. ఇదివరకు ఉన్న అదే 150 సీసీ ఇంజిన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఈసారి ఇది ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌గా రానుంది. ఈ మోటార్ సుమారు 14 బీహెచ్పీ పవర్‌ను, 14 ఎన్ఎం టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ గేర్‌బాక్స్ యథావిధిగా కొనసాగుతుంది.
కొత్త బజాజ్ పల్సర్ 150- త్వరలోనే మార్కెట్లోకి లాంచ్!
{{/usCountry}}భారత మార్కెట్లో కొత్త బజాజ్ పల్సర్ 150 బైక్ త్వరలోనే లాంచ్ అవుతుందని. కాగా ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త బైక్ ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
బజాజ్ ఆటో సంస్థ ఆగస్టు 12వ తేదీన మరో కొత్త వాహనాన్ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అది కొత్త పల్సర్ 150 కావొచ్చు లేదా కొత్త పల్సర్ 125 కావొచ్చు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. ఆ తేదీ వచ్చే వరకు కంపెనీ ఏం ప్లాన్ చేసిందో వేచి చూడాల్సిందే!