Kia EV2 : సింగిల్ ఛార్జ్‌తో 448 కి.మీ రేంజ్- కియా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇది..
కియా మోటార్స్ తన అత్యంత చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ కారు 'ఈవీ2'ని ప్రపంచానికి పరిచయం చేసింది. అత్యాధునిక ఈ-జీఎంపీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 448 కిలోమీటర్ల వరకు రేంజ్‌ని ఇస్తుంది.
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో జరుగుతున్న మోటార్ షోలో తన సరికొత్త ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ 'ఈవీ2'ని అధికారికంగా ఆవిష్కరించింది. కియా నుంచి వస్తున్న అత్యంత చిన్న, సరసమైన గ్లోబల్ ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. గ్లోబల్ మార్కెట్‌లో రెనాల్ట్ 4, ఫోక్స్‌వ్యాగన్ ఐడీ క్రాస్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

కియా ఈవీ2 డిజైన్: బాక్సీ లుక్.. అదిరిపోయే స్టైల్
కియా తన పెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలైన ఈవీ6, ఈవీ9 ల నుంచి ప్రేరణ పొంది ఈ కారును డిజైన్ చేసింది. ముఖ్యంగా కియా సిగ్నెచర్ 'టైగర్ ఫేస్' ఫ్రంట్ లుక్, బాక్సీ షేప్ కారుకు ఒక విలక్షణమైన గుర్తింపును ఇచ్చాయి.
హెడ్‌ల్యాంప్స్: నిలువుగా ఉండే స్ల్పిట్ హెడ్‌ల్యాంప్స్ ఈ కారుకు యూనిక్ లుక్ తెచ్చాయి.
వీల్స్: సాధారణ వేరియంట్లలో 16 నుంచి 18 అంగుళాల వీల్స్ ఉండగా, స్పోర్టీ 'జీటీ లైన్' వేరియంట్‌లో ఏకంగా 19 ఇంచ్ రిమ్స్ ఇచ్చారు.
కొలతలు: దీని పొడవు 4,060 ఎంఎం, వెడల్పు 1,800 ఎంఎం. ఇది కాంపాక్ట్‌గా ఉన్నా, లోపల స్పేస్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది.
కియా ఈవీ2 ఇంటీరియర్: టెక్నాలజీతో 'పిక్నిక్ బాక్స్' ఎక్స్‌పీరియెన్స్
ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగాన్ని కియా 'పిక్నిక్ బాక్స్' థీమ్‌తో రూపొందించింది. ఇది ప్రయాణికులకు ఒక హాయినిచ్చే వ్యక్తిగత స్పేస్లాగా అనిపిస్తుంది. భారత్‌లో ఇటీవల వచ్చిన కియా 'సైరోస్' తరహాలోనే దీని ఇంటీరియర్ ఉంది.
డిజిటల్ డ్యాష్‌బోర్డ్: ఇందులో మూడు స్క్రీన్లు ఉంటాయి. 12.3 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5.3 ఇంచ్ క్లైమేట్ కంట్రోల్ డిస్ప్లే, 12.3 ఇంచ్ ప్రధాన టచ్‌స్క్రీన్.
ఫ్లెక్సిబిలిటీ: సాధారణ 5-సీటర్ ఆప్షన్‌తో పాటు, 4-సీటర్ వేరియంట్ కూడా ఈ కియా ఈవీ2లో లభిస్తుంది. 4-సీటర్ వెర్షన్‌లో వెనుక సీట్లను ముందుకు జరుపుకోవడం ద్వారా 403 లీటర్ల బూట్ స్పేస్‌ను పొందవచ్చు.
ఫీచర్లు: హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, లెవల్ 2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), డిజిటల్ కీ 2.0 వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కియా ఈవీ2- బ్యాటరీ, రేంజ్ వివరాలు..
కియా ఈవీ2 రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. అవి..
స్టాండర్డ్ రేంజ్: 42.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 317 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీనిలో 147 హెచ్‌పీ మోటార్ ఉంటుంది.
లాంగ్ రేంజ్: 61.0 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో గరిష్టంగా 448 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీనిలో 136 హెచ్‌పీ మోటార్ అమర్చారు.
ఛార్జింగ్: ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం బ్యాటరీ నిండుతుంది. అలాగే, వాహనం నుంచి ఇతర పరికరాలకు పవర్ ఇచ్చే వీ2ఎల్ (వెహికిల్ టు లోడ్) టెక్నాలజీ కూడా ఉంది.
చౌకైన ఎలక్ట్రిక్ కాారుగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ కియా ఈవీ2 ధరలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే యూరోప్‌లో దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర 26వేల యూరోలు (రూ. 31లక్షలు) ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతానికైతే.. ఈ ఈవీ2 ఇండియా లాంచ్‌పై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. లాంచ్ అయితే మాత్రం ఇండియా మార్కెట్‌లో ఇది టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి ఎలక్ట్రిక్ కార్లకు గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


