...
...
Next Story

ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ బంకుల్లో ఇది తప్పనిసరి.. అందరూ తెలుసుకోవాల్సిన విషయం!

2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్ అమలులోకి రానుంది. పెట్రోల్ బంకుకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి.

Published on: Feb 25, 2026, 19:37:51 IST
Advertisement

ఏప్రిల్ 1, 2026 నుండి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 20 శాతం వరకు ఇథనాల్, మినిమం రిసెర్చ్ ఆక్టేన్​ నంబర్​ (ఆర్​ఓఎన్​) 95 కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్రయించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ పంపుల్లో కొత్త రూల్
ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ పంపుల్లో కొత్త రూల్

ఫిబ్రవరి 17న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చమురు కంపెనీలు 20 శాతం వరకు ఇథనాల్-బ్లెండెడ్ మోటార్ స్పిరిట్(పెట్రోల్)ను విక్రయించాలి. మినిమం రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ (RON) 95 కలిగిన పెట్రోల్ ఉండాలి.' అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులలో నిర్దిష్ట ప్రాంతాలకు, అంతేకాకుండా పరిమిత సమయం వరకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులను అనుమతించేందుకు అవకాశం ఉంది.

ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న లేదా ఇతర ధాన్యం నుండి తయారు చేస్తారు. ఇది పునరుత్పాదకమైనది, దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. పెట్రోల్ కంటే ఇది తక్కువ కాలుష్యానికి కారణం అవుతుంది. చమురు దిగుమతులను తగ్గించడంలో సహాయపడటానికి, కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం ఇథనాల్‌ను తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం రైతులకు కూడా మేలు చేయనుంది.

2023-2025 నుండి భారతదేశంలో తయారయ్యే చాలా వాహనాలు ఈ20 ఆధారంగా నడిచేలా రూపొందించారు. పెద్ద సమస్యలు ఏవీ ఉండవని అధికారులు చెబుతున్నారు. అయితే పాత వాహనాల మైలేజీలో స్వల్పంగా తగ్గుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే.. ఇంజిన్ దెబ్బతినకుండా ఉండేందుకు కనీసం RON 95 కలపాలని కేంద్రం నిబంధన విధించింది.

మినిమం రీసెర్చ్ ఆక్టేన్ నంబర్(RON) ఇంజిన్ నాకింగ్ (ప్రీ-ఇగ్నిషన్)కు ఇంధనంతో ఎంతవరకు తట్టుకుంటుందో తెలియజేస్తుంది. ఇంజిన్ లోపల ఇంధనం అసమానంగా మండినప్పుడు నాకింగ్ జరుగుతుంది. RON ఎంత ఎక్కువగా ఉంటే ఇంధనం నాక్ చేయడానికి అంత ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. అంటే అధిక ఒత్తిడిలోనూ ఇంధనం స్థిరంగా ఉంటుంది.

ఇథనాల్ సహజంగానే అధిక ఆక్టేన్ విలువను కలిగి ఉంటుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం వల్ల నాకింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. జూన్ 2022లో భారతదేశం పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే అనుకున్నదానికంటే ఐదు నెలల ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకుంది. దీనితో ప్రభుత్వం 2030 నుండి 2026కి 20 శాతం బ్లెండింగ్‌ టార్గెట్‌ను సెట్ చేసింది. దేశంలోని చాలా పెట్రోల్ పంపులు ఇప్పుడు ఈ20 లేదా 20 శాతం ఇథనాల్‌తో కలిపిన పెట్రోల్‌ను విక్రయిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe