...
...
Next Story

Tata Nexon : కొత్త రూపంలో టాటా నెక్సాన్! ఏయే మార్పులు ఉండబోతున్నాయి?

టాటా మోటార్స్ పాపులర్, బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ నెక్సాన్ త్వరలో కొత్త జనరేషన్‌తో మార్కెట్లోకి రానుంది. అత్యాధునిక డిజైన్, మెరుగైన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో రానున్న ఈ నెక్సాన్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Aug 25, 2026, 05:44:02 IST
Advertisement

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న బెస్ట్​ సెల్లింగ్ టాటా నెక్సాన్ ఎస్​యూవీ త్వరలో ఓ సరికొత్త రూపంలో మన ముందుకు రానుంది. సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నెక్సాన్ ముందువరుసలో ఉన్న విషయం తెలిసిందే. గత తొమ్మిదేళ్ల ప్రయాణంలో ఈ కారుకు ఎన్నో అప్‌డేట్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు మాత్రం కంపెనీ నెక్సాన్‌కు పూర్తిస్థాయి జనరేషనల్ అప్‌డేట్ తెచ్చే పనిలో పడింది. ఇటీవలే రోడ్లపై టెస్టింగ్ జరుపుతున్న ఒక కొత్త నెక్సాన్ మోడల్ కెమెరాకు చిక్కింది. తద్వారా ఆటోమొబైల్ రంగంలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

న్యూ జెన్ టాటా నెక్సాన్ ఎస్​యూవీ..
న్యూ జెన్ టాటా నెక్సాన్ ఎస్​యూవీ..

ఈ నేపథ్యంలో నూతన తరం నెక్సాన్‌లో రాబోయే మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోడ్లపై కొత్త తరం నెక్సాన్ సందడి..

రోడ్లపై టెస్టింగ్ జరుపుతున్న ఈ ఎస్​యూవీ పూర్తిగా కవర్ చేసి ఉంది. అయినప్పటికీ దాని బాడీ షేప్, ఓఆర్‌వీఎం డిజైన్ చూస్తే అది నూతన తరం టాటా నెక్సాన్ అని ఇట్టే చెప్పవచ్చు. బాహ్య రూపం పూర్తిగా కవర్ చేసి ఉండటం వల్ల పూర్తి వివరాలు బయటకు రాలేదు. కానీ, టాటా మోటార్స్ ఈ కొత్త మోడల్​పై వేగంగా పనిచేస్తోందని స్పష్టమవుతోంది. అత్యంత పోటీ ఉన్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో తన హవాను మరింత పెంచుకునేందుకు ఈ కొత్త డిజైన్, కేబిన్, ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడతాయని కంపెనీ భావిస్తోంది.

కొత్త డిజైన్, స్టైలింగ్..

టాటా మోటార్స్ తన రీసెంట్ ఎస్‌యూవీల్లో డిజైన్ శైలిని పూర్తిగా మార్చేసింది. అదే బాటలో కొత్త నెక్సాన్ కూడా రానుంది. ముందు భాగంలో కొత్త డిజైన్, కనెక్టెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, సరికొత్త గ్రిల్, బంపర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే కొత్త డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్‌తో కూడిన టెయిల్ ల్యాంప్స్ ఈ కారును మరింత స్టైలిష్‌గా మార్చనున్నాయి.

ప్రస్తుత నెక్సాన్‌లోనే వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, అడాస్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అయితే, రాబోయే కొత్త జనరేషన్ మోడల్‌లో లెవెల్ 2 ఏడాస్, పెద్ద డ్యూయల్-స్క్రీన్ డిస్‌ప్లే సెటప్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ వంటి మరిన్ని అధునాతన హంగులను జోడించనున్నారు. అంతేకాకుండా, ప్రయాణంలో అద్భుతమైన మ్యూజిక్ అనుభూతిని పంచడానికి 12-స్పీకర్ల ప్రీమియం జేబీఎల్ ఆడియో సిస్టమ్‌ను కూడా అందించే ఛాన్స్ ఉంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్ ఆప్షన్లు..

ప్రస్తుతం నెక్సాన్ రెండు రకాల ఇంజిన్లతో మార్కెట్లో లభిస్తోంది. అందులో 1.2 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. వీటితో పాటు ఈవీ (ఎలక్ట్రిక్) వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కొత్త జనరేషన్ మోడల్‌లోనూ ఇదే ఇంజిన్ ఆప్షన్లను కొనసాగిస్తూనే, ట్రాన్స్‌మిషన్ ఎంపికలను మరింత విస్తరించనున్నారు.

లాంచ్ టైమ్​లైన్, ధర (అంచనా)..

నూతన తరం టాటా నెక్సాన్ 2027 మధ్యలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పరంగా రానున్న ఈ అప్‌డేట్ల కారణంగా, ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే దీని ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వేరియంట్, పవర్‌ట్రెయిన్‌ను బట్టి ఈ కొత్త నెక్సాన్ ధర సుమారు 9 లక్షల రూపాయల నుంచి 18.50 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చు. అలాగే సీఎన్జీ వెర్షన్‌లో ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను తీసుకురావడంతో పాటు, నెక్సాన్ ఈవీలో మరింత శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అందించాలని టాటా భావిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe