ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతుండటంతో ఈ జోరు మున్ముందు కూడా కొనసాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం (జనవరి 2, 2026) ట్రేడింగ్‌లో నిఫ్టీ 50, నిఫ్టీ మెటల్ సూచీలు తమ జీవితకాల గరిష్టాలను తాకాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 26,340 మార్కును చేరగా, నిఫ్టీ మెటల్ 11,433.80 వద్ద కొత్త రికార్డు సృష్టించింది. ప్రధాన సూచీ నిఫ్టీ 50 గత నెలలో కేవలం 1% మాత్రమే లాభపడగా, మెటల్ ఇండెక్స్ మాత్రం దానికి పది రెట్లు పైగా రాబడిని అందించడం విశేషం.
టాప్ గెయినర్స్ ఇవే:

హిందుస్థాన్ కాపర్: గత నెలలో ఏకంగా 60% లాభపడి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది.
హిందుస్థాన్ జింక్, నేషనల్ అల్యూమినియం, వేదాంత: ఈ షేర్లు 15% నుంచి 27% మధ్య పెరిగాయి.
షేర్ల పెరుగుదలకు ప్రధాన కారణాలేమిటి?
మెటల్ స్టాక్స్ ఇంతలా పుంజుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ కారణాలు బలంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం:
డిమాండ్-సప్లై గ్యాప్: పారిశ్రామిక లోహాలకు డిమాండ్ విపరీతంగా ఉండటం, దానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు దారితీసింది.
చైనా ప్రభావం: ప్రపంచంలోనే అతిపెద్ద లోహ వినియోగదారు అయిన చైనా నుంచి అందుతున్న సానుకూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌కు ఊతాన్నిచ్చాయి. "చైనాలో డిమాండ్ పెరగడం లేదా అక్కడ ప్రభుత్వం ఇచ్చే పాలసీ మద్దతు నేరుగా గ్లోబల్ మెటల్ ధరలపై ప్రభావం చూపుతుంది" అని రెలిగేర్ బ్రోకింగ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
ప్రభుత్వ రక్షణ సుంకాలు: చౌక విదేశీ స్టీల్ దిగుమతుల నుంచి దేశీయ పరిశ్రమను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా వంటి దేశాల నుంచి వచ్చే చౌక స్టీల్ దిగుమతులపై మూడేళ్ల పాటు 12% రక్షణ సుంకాన్ని (Safeguard Duty) విధిస్తూ డిసెంబర్ 30న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది దేశీయ కంపెనీలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
డాలర్ బలహీనత: అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలహీనపడటం కమోడిటీ ధరలకు సానుకూలంగా మారింది.
మున్ముందు ఈ ర్యాలీ కొనసాగుతుందా?
{{/usCountry}}డాలర్ బలహీనత: అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలహీనపడటం కమోడిటీ ధరలకు సానుకూలంగా మారింది.
మున్ముందు ఈ ర్యాలీ కొనసాగుతుందా?
{{/usCountry}}మెటల్ స్టాక్స్‌లో ఈ బుల్ రన్ ఇంకా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, సోలార్ ఎనర్జీ రంగాల్లో కాపర్ (రాగి), వెండి వంటి లోహాల వినియోగం భారీగా ఉండటమే దీనికి కారణం.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ.. "పారిశ్రామిక లోహాల డిమాండ్-సప్లై సమీకరణాలు ప్రస్తుతం ధరలు పెరిగేందుకే అనుకూలంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రత్యామ్నాయ ఇంధనం, EV రంగాల నుంచి లోహాలకు గట్టి మద్దతు లభిస్తోంది" అని వివరించారు.
అయితే, ఆటో రంగంపై దీని ప్రభావం మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. స్టీల్, అల్యూమినియం ధరలు పెరగడం వల్ల ఆటో మొబైల్ కంపెనీల తయారీ వ్యయం పెరగొచ్చు. కానీ ప్రస్తుతం ఆటో అమ్మకాలు ఆశాజనకంగా ఉండటం మెటల్ రంగానికి కలిసొచ్చే అంశమని విశ్లేషకులు చెబుతున్నారు.
(ముఖ్య గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ప్రమాదకరమైనవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించగలరు.)