అమెరికాలోని మేరీల్యాండ్‌లో భారత సంతతికి చెందిన డేటా అనలిస్ట్ నిఖిత గొడిశాల (27) దారుణ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్యకు పాల్పడి అమెరికా నుండి పరారైన ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26)ను తమిళనాడులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్‌పోల్ జారీ చేసిన అంతర్జాతీయ నోటీసుల ఆధారంగా సాగిన గాలింపులో నిందితుడు దొరికిపోయాడు.
అసలేం జరిగింది?

మేరీల్యాండ్‌లోని కొలంబియాలో ఉన్న అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో జనవరి 3న నిఖిత శవమై కనిపించింది. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్న నిఖితను అర్జున్ అత్యంత కిరాతకంగా చంపినట్లు హౌవార్డ్ కౌంటీ పోలీసులు నిర్ధారించారు. జనవరి 2న అర్జున్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, నిఖిత కనిపించడం లేదని, ఆమెను చివరిసారిగా న్యూ ఇయర్ వేడుకల సమయంలో చూశానని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అదే రోజున అతను గుట్టుచప్పుడు కాకుండా విమానమెక్కి ఇండియాకు పారిపోయాడు.
పక్కా ప్లాన్‌తో పరారీ..
నిఖితను హత్య చేసిన తర్వాత అర్జున్ చాలా తెలివిగా వ్యవహరించాడు. తన చేతికి గాయమైందని, దానికి చికిత్స చేయించుకోవడానికి ఇండియా వెళ్తున్నానని తన స్నేహితులను, నిఖిత కుటుంబాన్ని నమ్మించాడు. అయితే, నిఖిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అర్జున్‌పై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేశారు. అతను అమెరికా దాటి వెళ్లిపోయాడని తెలుసుకున్న అధికారులు ఇంటర్‌పోల్ సాయం కోరారు.
డబ్బు కోసమే హత్య?
నిఖిత హత్య వెనుక ఆర్థిక కారణాలు ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అర్జున్ గతంలో నిఖితను, ఆమె కుటుంబాన్ని డబ్బు కోసం వేధించాడని నిఖిత బంధువు సరస్వతి గొడిశాల ఆరోపించారు. నిఖిత బ్యాంక్ ఖాతా నుండి సుమారు 3,500 డాలర్లను (సుమారు రూ. 3 లక్షలు) అనధికారికంగా బదిలీ చేసుకున్న తర్వాతే అర్జున్ ఇండియాకు పారిపోయాడని ఆమె పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, నిఖిత మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆమె కోరారు.
మేధావిగా పేరు తెచ్చుకున్న నిఖిత
నిఖిత గోడిశాల 'వేద హెల్త్' (Vheda Health) అనే సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేసేవారు. తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకున్న ఆమె, ఇటీవల కంపెనీ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన "ఆల్-ఇన్ అవార్డు"ను కూడా గెలుచుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె స్నేహితులు, సహోద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
{{/usCountry}}నిఖిత గోడిశాల 'వేద హెల్త్' (Vheda Health) అనే సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేసేవారు. తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకున్న ఆమె, ఇటీవల కంపెనీ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన "ఆల్-ఇన్ అవార్డు"ను కూడా గెలుచుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె స్నేహితులు, సహోద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
{{/usCountry}}ప్రస్తుతం ఈ కేసులో భారత రాయబార కార్యాలయం నిఖిత కుటుంబంతో టచ్‌లో ఉంది. నిందితుడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియపై స్థానిక అధికారులతో చర్చిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.