7 seater car : 7 సీటర్ నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ- ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ వివరాలు..
నిస్సాన్ ఇండియా తన సరికొత్త 7 సీటర్ ఎంపీవీ 'గ్రావిటే'ని ఫిబ్రవరి 17న విడుదల చేయనుంది. రెనాల్ట్ ట్రైబర్‌కు పోటీగా వస్తున్న ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఈ నిస్సాన్ గ్రావిటే ఆచరణాత్మక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో రాబోతోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నిస్సాన్ సంస్థ నుంచి ఇండియాలోకి అతి త్వరలోనే ఒక అఫార్డిబుల్ ఎంపీవీ లాంచ్కాబోతోంది. దాని పేరు నిస్సాన్ గ్రావిటే. కాగా, లాంచ్‌కి ముందే కంపెనీ కొత్త టీజర్ విజువల్స్‌ను విడుదల చేసింది. ఇందులో ఈ 7 సీటర్ ఎంపీవీపై హైవేలు, గ్రామీణ రోడ్లు, వాటర్ వేడింగ్ (నీటిలో ప్రయాణించే) ట్రాక్‌లతో సహా వివిధ భూభాగాల్లో రోడ్ వాలిడేషన్ పరీక్షలు జరుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ గ్రావిటేకి సంబంధించిన కొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఇక్కడ చూసేయండి..

నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ- ఎక్స్‌టీరియర్..
నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ బాక్సీ- నిటారుగా ఉండే సిల్హౌట్‌ను కలిగి ఉంది. అదే సమయంలో ఎంపీవీకి ఉండాల్సిన హంగులు కూడా ఉన్నాయి. ఇది నిస్సాన్ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తుంది. ముందు భాగంలో సీ-షేప్ ఎల్‌ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్, ప్రముఖమైన గ్రిల్, మరింత చెక్కినట్టుగా బంపర్ డిజైన్ ఉన్నాయి. వీటికి అదనంగా రూఫ్ రైల్స్, బాడీ క్లాడింగ్, అలాయ్ వీల్స్ ఈ ఎంపీవీకి ప్రాక్టికల్, సమకాలీన రూపాన్ని ఇస్తాయి. వెనుక భాగంలో వ్రాప్-అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, సీ-షేప్ బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ దీనికి స్వల్పంగా రగ్గడ్ లుక్‌ను అందిస్తాయి.
నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ- ఇంటీరియర్, ఫీచర్లు..
గ్రావిటే ఫ్లాట్ ఫ్లోర్‌తో కూడిన ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణికులకు, కార్గోకు వెసులుబాటును అందిస్తుంది. రెండవ వరుసలో స్లైడ్, రెక్లైన్ అడ్జస్ట్‌మెంట్ ఉంటుందని భావిస్తున్నారు, మూడొవ వరుస పిల్లలకు లేదా తక్కువ దూర ప్రయాణాలకు సరిపోతుంది. ఫోల్డబుల్ రియర్ సీట్లు స్టోరేజ్ ఆప్షన్లకు ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి.
ముఖ్యమైన ఫీచర్లలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అన్ని వరుసలకు రియర్ ఏసీ వెంట్స్, పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన కీలెన్ ఎంట్రీ ఉన్నాయి. హై-వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ ఫంక్షనాలిటీ వంటి ఫీచర్లు ఉండవచ్చు.
నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ- ఇంజిన్..
ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బోచార్జ్డ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. దీనికి ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్ జత చేసి ఉంటుంది.
లాంచ్ తర్వాత నిస్సాన్ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వేరియంట్‌ను కూడా అందించే అవకాశం ఉంది.
నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ- ధర, పోటీ..
రెనాల్ట్ ట్రైబర్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఈ 7 సీటర్ నిస్సాన్ గ్రావిటే ధర సుమారు రూ. 5.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
నిస్సాన్ గ్రావిటేని సంస్థ ఈ నెల 17న లాంచ్ చేయనుంది. డెలివరీలు మార్చి 2026 నాటికి ప్రారంభం కావచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


