నిస్సాన్ నుంచి అదిరిపోయే 'నిస్మో' కాన్సెప్ట్ కార్- అతి త్వరలో ప్రదర్శన! టీజర్ రిలీజ్..
టోక్యో ఆటో సాలోన్ 2026 వేదికగా నిస్సాన్ నుంచి అదిరిపోయే 'నిస్మో' కాన్సెప్ట్ కార్ ప్రదర్శనకు రానుంది. ఇందులో భాగంగానే ఈ కాన్సెప్ట్ కారును సంస్థ టీజ్ చేసింది. ఫలితంగా ఈ మోడల్‌పై మంచి బజ్ నెలకొంది.
త్వరలో జరగబోయే 'టోక్యో ఆటో సాలోన్ 2026' కోసం ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ సిద్ధమవుతోంది! ఈ ప్రదర్శనలో సరికొత్త కార్లు, అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేయడమే కాకుండా, తన గ్లోబల్ 'నిస్మో' లైనప్‌ను పెంచాలనే ప్లాన్‌లో భాగంగా సరికొత్త 'నిస్మో కాన్సెప్ట్' మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేయనుంది నిస్సాన్. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన టీజర్ ఫోటోను కంపెనీ తాజాగా విడుదల చేసింది.

నిస్సాన్ కొత్త కారు- టీజర్‌లో ఏముంది?
విడుదలైన టీజర్ ఫోటోలో కారు వెనుక భాగం స్వల్పంగా కనిపిస్తోంది. షాడో వల్ల ఇది స్పోర్ట్స్ కారా లేక కూపే-ఎస్‌యూవీ మోడలా? అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కారు వెనుక వైపు లిప్ స్పాయిలర్ కింద సన్నని ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి కారు వెడల్పు అంతా విస్తరించి ఉన్నాయి. దీని ఫెండర్లు వెడల్పుగా ఉండి, కారుకు ఒక పవర్‌ఫుల్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక విండో కిందకు వంగి ఉన్న తీరును చూస్తుంటే.. ఇది హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయ్యే అవకాశం కూడా ఉందనిపిస్తోంది.
ఇది పెట్రోల్ కారా లేక ఎలక్ట్రిక్ కారా?
ఈ నిస్మో కాన్సెప్ట్ ఇంజిన్ వివరాలను నిస్సాన్ ప్రస్తుతం అత్యంత రహస్యంగా ఉంచింది! టీజర్ ఫొటోలో ఎగ్జాస్ట్ పైపులు కూడా కనిపించకపోవడంతో ఇది ఎలక్ట్రిక్ కారా, హైబ్రిడ్ మోడలా లేదా పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే కారా అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే, 2026 నుంచి మోటార్‌స్పోర్ట్స్‌లో ఒక నిస్మో ప్రోటోటైప్‌ను ప్రవేశపెడతామని కంపెనీ గతంలో ప్రకటించింది. బహుశా రేస్ ట్రాక్ కోసం తయారుచేసిన ఆ కారుకు సంబంధించిన టీజరే ఇది అయ్యి ఉండొచ్చని ఊగాహానాలు సైతం వినిపిస్తున్నాయి..
టోక్యో ఆటో సాలోన్‌లో నిస్సాన్ సందడి..
జనవరి 9 నుంచి 11 వరకు జరగనున్న టోక్యో ఆటో సాలోన్ 2026 ఈవెంట్‌లో నిస్సాన్ ఆకర్షణీయమైన కార్లను ప్రదర్శించడానికి రెడీ అవుతోంది.
ఫెయిర్‌లేడీ జెడ్: 2026లో లాంచ్ కానున్న ఈ స్పోర్ట్స్ కూపే అప్‌డేటెడ్ వెర్షన్ ప్రదర్శనకు రానుంది. ఇందులో ముఖ్యంగా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన 'నిస్మో ఎడిషన్' హైలైట్ కానుంది.
లీఫ్: నిస్సాన్ తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు 'లీఫ్'ను ప్రీమియం ‘ఆటెక్’ అవతార్‌లో ప్రదర్శించనుంది.
ఎక్స్-ట్రైల్: భారీగా మోడిఫై చేసిన 'ఎక్స్-ట్రైల్ రాక్ క్రీక్ మల్టీబెడ్ వైల్డ్‌ప్లే' ఎస్‌యూవీ కూడా సందర్శకులను కనువిందు చేయనుంది.
జనవరి 9వ తేదీన ఈ ప్రదర్శన ప్రారంభం కానుండగా, మొదటి రోజే ఈ నిస్మో కాన్సెప్ట్ కారు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
నిస్సాన్ ఇండియా ప్రణాళికలు..
ఇండియాలో ఎక్స్ప్యాన్షన్లో భాగాంగా నిస్సాన్ క్రేజీ ప్లాన్ రచిస్తోంది. రానున్న రెండేళ్లల్లో నాలుగు కార్లను లాంచ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో ఒక 7 సీటర్ ఎంపీవీ, ఒక 7 సీటర్ ఎస్‌యూవీ ఉన్నాయి. ఇవి భారతీయ ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తాయని అనడంలో సందేహమే లేదు.
నిస్సాన్ టెక్టాన్- క్రెటాకు గట్టి పోటీ!
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ 'టెక్టాన్' పేరుతో సరికొత్త కారును తీసుకువస్తోంది. ఇది హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా వంటి పాపులర్ కార్లతో తలపడనుంది. 2026 ఫిబ్రవరిలో దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రసిద్ధ 'రెనాల్ట్ డస్టర్' ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని కూడా రూపొందిస్తున్నారు. నిస్సాన్ పాట్రోల్ కారు తరహాలో ఇది ఆధునిక డిజైన్, స్టైలిష్ క్యాబిన్‌తో రానుంది.
నిస్సాన్ గ్రావిటే - కొత్త ఫ్యామిలీ ఎంపీవీ
ఫ్యామిలీతో ప్రయాణించే వారి కోసం నిస్సాన్ 'గ్రావిటే' అనే 7 సీటర్ ఎంపీవీని లాంచ్ చేస్తోంది. 2026 మార్చిలో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. విశాలమైన ఇంటీరియర్, అత్యాధునిక సాంకేతికతతో రాబోతున్న ఈ కారు మారుతీ సుజుకీ ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.
నిస్సాన్ ఇండియా లాంచ్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


