ఈ టిప్స్​ ఫాలో అయితే.. ఎన్ని కిలోమీటర్లు తిరిగినా మీ కారు కొత్తగానే ఉంటుంది!

కారు టైర్లు ఎప్పుడు మార్చాలి? బ్యాటరీ లైఫ్​ పెరగాలంటే ఏం చేయాలి? కారు పెయింట్​ పాడవకుండా ఉండాలంటే ఏం ఉపయోగించాలి? ఎలా డ్రైవింగ్​ చేస్తే కారు మంచి మైలేజీని ఇస్తుంది? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి. ఇక్కడ ఇచ్చిన టిప్స్​ ఫాలో అయితే ఎన్ని కి.మీలు తిరిగినా మీ కారు కొత్తగానే ఉంటుంది!

Published on: Dec 20, 2025, 12:21:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీరు కొత్తగా కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? లేదా ఇప్పటికే మీ దగ్గర కారు ఉందా? వాస్తవానికి ఈ కాలంలో కారు కొంటేనే సరిపోదు.. దాన్ని మెయిన్​టైన్​ చేయడం కూడా చాలా ముఖ్యం! కారు మేనేజ్​మెంట్​ని చాలా మంది కష్టమైన పనిగా చూస్తుంటారు. కానీ ఇది చాలా చాలా అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కారు లైఫ్ కూడా పెరుగుతుంది.

ఈ టిప్స్​ ఫాలో అయితే మీ కారు కొత్తగానే ఉంటుంది!
ఈ టిప్స్​ ఫాలో అయితే మీ కారు కొత్తగానే ఉంటుంది!

మీ కారు ఎప్పుడూ కొత్త దానిలా మంచి కండిషన్‌లో ఉండాలంటే మీరు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని సింపుల్​ టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

కారు కొత్తగా ఉండాలంటే ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

1. టైర్లు- బ్యాటరీ మేనేజ్​మెంట్​-

టైర్లు: టైర్లపై ఉండే గ్రిప్ సరిగ్గా ఉందో లేదో ఎప్పుడూ చూసుకోవాలి. గ్రిప్ తగ్గితే రోడ్డుపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా టైర్లు 40,000 నుంచి 80,000 కిలోమీటర్ల వరకు వస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలు బరువు ఎక్కువగా ఉండటం వల్ల వాటి టైర్లు త్వరగా అరిగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కారులో ఒక పంక్చర్ కిట్, ఎయిర్ ప్రెజర్ మెషిన్ ఉంచుకోండి.

బ్యాటరీ: బ్యాటరీ టెర్మినల్స్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కారును చల్లని, పొడి ప్రదేశంలో పార్క్ చేయండి. మీరు కారును ఎక్కువగా వాడకపోయినా, వారానికి ఒకసారైనా ఇంజిన్ స్టార్ట్ చేయండి. దీనివల్ల బ్యాటరీ డెడ్ కాకుండా ఉంటుంది.

2. ఇంజిన్ ఆయిల్, ఇతర లిక్విడ్స్​-

కారు మాన్యువల్‌ను చదివి, అందులో చెప్పిన సమయానికి ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్‌ను మార్చాలి.

ఇంజిన్ ఆయిల్: ప్రతి 15,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చడం మంచిది.

కూలెంట్: సాధారణ గ్రీన్ కూలెంట్‌ను ప్రతి 50,000 కిలోమీటర్లకు లేదా రెండేళ్లకు ఒకసారి మార్చాలి.

ఎయిర్ ఫిల్టర్: దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు ప్రతి 10,000 కిలోమీటర్లకు, సాధారణంగా అయితే 15,000 కిలోమీటర్లకు ఎయిర్ ఫిల్టర్ మార్చాలి.

3. బాడీ కోటింగ్: టెఫ్లాన్, సిరామిక్ లేదా పీపీఎఫ్​?

కారు పెయింట్ పాడవకుండా ఉండటానికి వివిధ రకాల కోటింగ్స్ అందుబాటులో ఉన్నాయి:

పీపీఎఫ్​ (పెయింట్​ ప్రొటెక్షన్​ ఫిల్మ్​): ఇది ఖరీదైన లగ్జరీ కార్లకు ఎక్కువగా వాడుతుంటారు. ఇది రాళ్లు తగిలినా స్క్రాచెస్ పడకుండా కాపాడుతుంది!

టెఫ్లాన్ కోటింగ్: ఇది చౌకగా లభిస్తుంది (రూ. 5,000 - 9,000). కానీ ఇది 4-6 నెలలు మాత్రమే ఉంటుంది. దీనిని తరచుగా చేయించాల్సి ఉంటుంది.

సిరామిక్ కోటింగ్: ఇది మిడ్​ రేంజ్​ ప్రైజ్​లో (రూ. 15,000 - 50,000) లభిస్తుంది. టెఫ్లాన్ కంటే ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. మంచి మెరుపును కూడా ఇస్తుంది.

4. డ్రైవింగ్ చేసే విధానం-

మీరు కారును నడిపే తీరుపైనే దాని ఇంజిన్, గేర్‌బాక్స్, సస్పెన్షన్ ఆధారపడి ఉంటాయి.

  • స్పీడ్ బ్రేకర్ల వద్ద వేగం తగ్గించి జాగ్రత్తగా వెళ్లండి.
  • కారు స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా వేగాన్ని పెంచకండి. క్రమక్రమంగా స్పీడ్ పెంచుతూ గేర్లు మార్చండి.
  • కారును ఆపడానికి ఇంజిన్ బ్రేకింగ్ (గేర్లు తగ్గించడం) కంటే బ్రేక్ ప్యాడ్లను వాడటం ఉత్తమం.
  • ఎలక్ట్రిక్ వాహనాల్లో స్టార్టింగ్ లోనే వేగంగా యాక్సిలరేటర్ తొక్కకండి. దీనివల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది.

5. ఏసీని తరచుగా వాడండి-

ఏసీ వాడకపోతే పెట్రోల్ ఆదా అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ, ఎక్కువ కాలం ఏసీ వాడకపోతే అందులోని గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది! అలాగే కిటికీలు తెరిచి డ్రైవ్ చేయడం వల్ల ఎయిర్​ డ్రాగ్​ పెరిగి మైలేజీ తగ్గిపోతుంది. ఏసీ రిపేర్ చేయించడం కంటే ఏసీని వాడటమే చౌకైన మార్గం కదా.

6. స్పార్క్ ప్లగ్స్, బ్రేక్ ప్యాడ్స్-

స్పార్క్ ప్లగ్స్: సాధారణ ప్లగ్స్ అయితే ప్రతి 20,000 కిలోమీటర్లకు మార్చాలి. ఇరీడియం ప్లగ్స్ అయితే లక్ష కిలోమీటర్ల వరకు వస్తాయి.

బ్రేక్ ప్యాడ్స్: ఇవి 40,000 కిలోమీటర్ల వరకు వస్తాయి. బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు కారు ఆగే తీరును బట్టి వీటిని చెక్ చేయించుకోవాలి.

వైపర్స్: ఎండ ఎక్కువగా ఉండే మన దేశంలో వైపర్ బ్లేడ్లు త్వరగా గట్టిపడిపోతాయి. వర్షాకాలం మొదలయ్యే ముందే వీటిని మార్చుకోవడం మంచిది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More