టెక్టాన్ నుంచి 7 సీటర్ ఎస్‌యూవీ వరకు- నిస్సాన్ నుంచి రాబోతున్న క్రేజీ కార్లు..
ఇండియా ఆటోమొబైల్ రంగంపై పట్టు సాధించేందుకు నిస్సాన్ పెద్ద ప్లానే వేస్తోంది! ఇందులో భాగంగా రెండేళ్లల్లో ఏకంగా 4 కార్లను తీసుకొస్తోంది. ఇందులో ఒక 7 సీటర్ ఎంపీవీ, ఒక 7 సీటర్ ఎస్‌యూవీ కూడా ఉండనున్నాయి. వివరాల్లోకి వెళితే..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును పెంచుకోవాలని భావిస్తున్న నిస్సాన్ ఇండియా వచ్చే రెండేళ్లపై ఫోకస్ చేసింది! ఇందులో భాగంగా కొత్త మోడళ్లతో పాటు ప్రస్తుతం ఉన్న కార్ల అప్‌డేటెడ్ వెర్షన్లను కూడా విడుదల చేయనుంది. నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ, అప్‌డేటెడ్ మాగ్నైట్, నిస్సాన్ టెక్టాన్ వంటి కార్లు త్వరలోనే రోడ్లపైకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో నిస్సాన్ లైనప్‌లో ఈ ఎగ్జైటింగ్ మోడల్స్ గురించి ఇక్కడ తెలుసుకండి..
నిస్సాన్ ఇండియా ప్లాన్- గ్రావిటే నుంచి 7 సీటర్ ఎస్‌యూవీ వరకు..
1. నిస్సాన్ మాగ్నైట్ 2026
నిస్సాన్ నుంచి వస్తున్న మొదటి పెద్ద లాంచ్ ‘అప్‌డేటెడ్ మాగ్నైట్’! 2026 ప్రారంభంలో ఇది మార్కెట్లోకి రానుంది. దీని డిజైన్ లేదా ఇంజిన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, అధునాతన ఫీచర్లను జోడించనున్నారు. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ ఎస్‌యూవీ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. ఇది మార్కెట్లో రెనాల్ట్ కైగర్, మారుతి ఫ్రాంక్స్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
2. నిస్సాన్ టెక్టాన్- క్రెటాకు గట్టి పోటీ!
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ 'టెక్టాన్' పేరుతో సరికొత్త కారును తీసుకువస్తోంది. ఇది హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా వంటి పాపులర్ కార్లతో తలపడనుంది. 2026 ఫిబ్రవరిలో దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రసిద్ధ 'రెనాల్ట్ డస్టర్' ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని కూడా రూపొందిస్తున్నారు. నిస్సాన్ పాట్రోల్ కారు తరహాలో ఇది ఆధునిక డిజైన్, స్టైలిష్ క్యాబిన్‌తో రానుంది.
సింగిల్ ఛార్జ్‌తో 679 కి.మీ వరకు రేంజ్- 2025లో అదరగొట్టిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
3. నిస్సాన్ గ్రావిటే - కొత్త ఫ్యామిలీ ఎమ్‌పీవీ
ఫ్యామిలీతో ప్రయాణించే వారి కోసం నిస్సాన్ 'గ్రావిటే' అనే 7 సీటర్ ఎంపీవీని లాంచ్ చేస్తోంది. 2026 మార్చిలో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. విశాలమైన ఇంటీరియర్, అత్యాధునిక సాంకేతికతతో రాబోతున్న ఈ కారు మారుతీ సుజుకీ ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.
నిస్సాన్ గ్రావిటే గురించి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
4. 2027లో కొత్త 7 సీటర్ ఎస్‌యూవీ
2027లో నిస్సాన్ మరో పెద్ద ఎస్‌యూవీని తీసుకురానుంది. ఇది నిస్సాన్ టెక్టాన్ ప్లాట్‌ఫామ్‌పైనే ఆధారపడినప్పటికీ, పెద్ద కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా 7 సీటర్ ఆప్షన్, ఎక్కువ స్పేస్, పొడవైన వీల్‌బేస్‌తో రూపొందనుంది. ఇది టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజార్ వంటి కార్లతో పోటీ పడనుంది.
నిస్సాన్ ఇండియా- షోరూమ్‌ల సంఖ్య పెంపు..
కొత్త కార్ల లాంచ్‌తో పాటు కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసేందుకు నిస్సాన్ ఇండియాలో తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 డీలర్‌షిప్‌లు ఉండగా, 2026 నాటికి ఆ సంఖ్యను 200కు, 2027 నాటికి 250కి పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా సేల్స్, సర్వీస్ టీమ్ సభ్యుల సంఖ్యను కూడా 800 నుంచి 3,000 వరకు పెంచనుంది.
ఇవన్నీ చూస్తుంటే ఇండియాలో కార్యకలాపాలను విస్తరించేందుకు నిస్సాన్ తీవ్రంగా కృషిచేస్తోందని అర్థమవుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


