Nissan Tekton : మచ్​ అవైటెడ్ నిస్సాన్ టెక్టాన్ లాంచ్- రూ. 10.49 లక్షలకే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఎస్​యూవీ..

Nissan Tekton launch : భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి నిస్సాన్ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టెక్టాన్'ను విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.10.49 లక్షలుగా నిర్ణయించిన ఈ కారు, అంతర్జాతీయంగా పాపులర్ అయిన 'నిస్సాన్ పెట్రోల్' డిజైన్ పోలికలతో, భారత్ ఎన్​సీఏపీ 5-స్టార్ రేటింగ్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చింది.

Published on: Jul 9, 2026, 13:19:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 మచ్ అవైటెడ్​ ఆటోమొబైల్​ లాంచ్​లలో ఒకటైన నిస్సాన్ టెక్టాన్.. ఇండియాలో గ్రాండ్​గా ఎంట్రీ ఇచ్చింది! గురువారం మధ్యాహ్నం జరిగిన ఈవెంట్​లో ఈ ఎస్​యూవీని సంస్థ అధికారికంగా విడుదల​ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.18.59 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

నిస్సాన్ టెక్టాన్ లాంచ్..
నిస్సాన్ టెక్టాన్ లాంచ్..

ఈ కారుకు సంబంధించిన అధికారిక బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవగా, జులై 20 నుంచి కస్టమర్లకు డెలివరీలు అందించనున్నట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన పోటీ ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి మోడళ్లకు నిస్సాన్ టెక్టాన్ గట్టి సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ నిస్సాన్ టెక్టాన్ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

నిస్సాన్ టెక్టాన్ ఎస్​యూవీ- గ్లోబల్ లుక్.. అగ్రెసివ్ డిజైన్

నిస్సాన్ టెక్టాన్ డిజైన్ చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలాసవంతమైన, పవర్‌ఫుల్ ఎస్‌యూవీగా పేరుగాంచిన ‘నిస్సాన్ పాట్రోల్’ గుర్తుకు వస్తుంది. కారు ముఖభాగంలో నిటారుగా ఉండే గ్రిల్, దానిపై రెండు క్రోమ్ లైన్లు కారుకు రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. దీనికి ఇరువైపులా స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, వాటిని కలుపుతూ కారు వెడల్పు అంతటా సాగే సి-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ లైట్ల కింద ఇచ్చిన రెడ్ స్ట్రిప్ కారుకు స్పోర్టీ ఫీల్‌ను ఇస్తుంది. బోనెట్‌పై ఉన్న పవర్‌ఫుల్ లైన్లు, 'Tekton' అని రాసి ఉన్న అక్షరాలు కారును మరింత రగ్గడ్‌గా మార్చాయి.

ఎస్​యూవీ పక్క భాగం (సైడ్ ప్రొఫైల్) విషయానికి వస్తే, సరికొత్త 18-ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్, పెద్ద వీల్ ఆర్చ్‌లు ఆకట్టుకుంటాయి. ముందు తలుపులకు సాధారణ హ్యాండిల్స్ ఇవ్వగా, వెనుక తలుపుల హ్యాండిల్స్‌ను వినూత్నంగా సీ-పిల్లర్​లో విలీనం చేశారు. వెనుక వైపు కూడా ముందు భాగం తరహాలోనే కారు అంతటా సాగే ఎల్‌ఈడీ లైట్ బార్, రూఫ్ స్పాయిలర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన డ్యూయల్-టోన్ బంపర్ కారుకు ప్రీమియం ఫినిషింగ్‌ను ఇచ్చాయి.

ఈ నిస్సాన్ టెక్టాన్ ఎస్​యూవీ మొత్తం ఆరు మోనో-టోన్ (సింగిల్ కలర్), ఐదు డ్యూయల్-టోన్ రంగుల్లో లభిస్తుంది.

నిస్సాన్ టెక్టాన్ ఎస్​యూవీ- పవర్‌ఫుల్ టర్బో ఇంజన్లు..

భారతీయ రోడ్లపై డ్రైవింగ్ అనుభూతిని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడానికి నిస్సాన్ ఈ కారులో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను పరిచయం చేసింది.

మొదటిది 1.0-లీటర్ ఇంజన్. ఇది గరిష్టంగా 100 హెచ్​పీ పవర్‌ను, 166 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో సిటీ డ్రైవింగ్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.

ఇక రెండోది లాంగ్ డ్రైవ్స్, పవర్ కోరుకునే వారి కోసం తీసుకొచ్చిన 1.3-లీటర్ శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్. ఇది ఏకంగా 163 హెచ్​పీ పవర్‌ను, 280 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా అత్యాధునిక 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్‌బాక్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. లాంగ్ హైవేలపై దూసుకుపోవడానికి ఈ డీసీటీ గేర్‌బాక్స్ అద్భుతంగా పనిచేస్తుంది.

నిస్సాన్ టెక్టాన్ ఎస్​యూవీ- భద్రతలో 'మగాడు'.. 5-స్టార్ రేటింగ్!

ధర, మైలేజ్ కంటే భారతీయ కస్టమర్లు ప్రస్తుతం భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన నిస్సాన్, టెక్టాన్ ఎస్‌యూవీని అత్యంత సురక్షితమైన వాహనంగా తీర్చిదిద్దింది. భారత ప్రభుత్వ అధికారిక క్రాష్ టెస్టింగ్ సంస్థ ‘భారత్ ఎన్​సీఏపీ’ నిర్వహించిన ప్రమాద పరీక్షల్లో నిస్సాన్ టెక్టాన్ పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.

కారు బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అన్నింటికీ ఈ రేటింగ్ వర్తిస్తుంది. కుటుంబంతో కలిసి సురక్షితమైన ప్రయాణం చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు ఈ ప్రైస్ రేంజ్‌లో నిస్సాన్ టెక్టాన్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

నిస్సాన్ టెక్టాన్ ఎస్​యూవీ- ఫీచర్లు ఇలా..

ఈ ఎస్​యూవీలో డ్యూయెల్​ జోనే ఏసీ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, పవర్డ్​ ఫ్రంట్​ సీట్స్, డ్యూయెల్​ టోన్ ఇంటీరియర, పానోరమిక్ సన్​రూఫ్, గూగుల్​ బిల్ట్​ ఇన్ గూగుల్​ మ్యాప్స్, జెమినీ ఏఐ సహా ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఉష్ణోగ్రతలను అడ్జెస్ట్​ చేసేందుకు, లొకేషన్ సెట్​ చేసేందుకు వాయిస్​ కమాండ్​తో పాటు రిమోట్​ స్టార్ట్​-స్టాప్​ ఫీచర్​ని సైతం ఈ ఎస్​యూవీలో నిస్సాన్ అందిస్తోంది. మై నిస్సాన్ యాప్​ ద్వారా ఈ ఫీచర్లకు నిరంతరం ఓటీఏ ఆప్డేట్స్​ని పొందవచ్చు.

అంతేకాదు ఈ నిస్సాన్ టెక్టాన్​లో ప్యాడిల్​ షిఫ్టర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, స్మార్ట్​ పవర్డ్​ టెయిల్​గేట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు సైతం ఉన్నాయి.

ఈ నిస్సాన్ కొత్త ఎస్​యూవీ పొడవు 4.3 మీటర్లు, వెడల్పు 1.8 మీటర్లు, గ్రౌండ్​ క్లియరెన్స్ 212 ఎంఎం (ఇది ఈ సెగ్మెంట్​లోనే పెద్దది)!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More