...
...
Next Story

2047 నాటికి 90 శాతం ప్రైవేట్ వాహనాలు ఎలక్ట్రిక్ వైపే.. నీతి ఆయోగ్ భారీ ప్రణాళిక

భారతదేశం 2047 నాటికి ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల్లో 90 శాతం వాటాను ఎలక్ట్రిక్ వాహనాలకే (EV) కేటాయించాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగంగా ఈ మెగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది.

Published on: Jan 29, 2026, 07:11:40 IST
Advertisement

న్యూ ఢిల్లీ: భారతదేశ ఇంధన పరివర్తనలో (Energy Transition) భాగంగా కేంద్ర ప్రభుత్వ మేధోమథన సంస్థ 'నీతి ఆయోగ్' ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. 2047 నాటికి దేశంలోని ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాను ప్రస్తుతం ఉన్న 6 శాతం నుండి ఏకంగా 90 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తోంది. నెట్-జీరో ఉద్గారాల లక్ష్యంతో రానున్న ఈ రోడ్‌మ్యాప్, భారత రవాణా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనుంది.

PREMIUM2047 నాటికి 90 శాతం ప్రైవేట్ వాహనాలు ఎలక్ట్రిక్ వైపే.. నీతి ఆయోగ్ భారీ ప్రణాళిక (AP)
2047 నాటికి 90 శాతం ప్రైవేట్ వాహనాలు ఎలక్ట్రిక్ వైపే.. నీతి ఆయోగ్ భారీ ప్రణాళిక (AP)

రవాణా, పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యవసాయం, విద్యుత్ రంగాలలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు (Decarbonization) నీతి ఆయోగ్ త్వరలోనే ఒక సమగ్ర నివేదికను విడుదల చేయనుంది. 2070 నాటికి భారత్‌ను పూర్తిగా ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే

న్యూ ఢిల్లీ: భారతదేశ ఇంధన పరివర్తనలో (Energy Transition) భాగంగా కేంద్ర ప్రభుత్వ మేధోమథన సంస్థ 'నీతి ఆయోగ్' ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. 2047 నాటికి దేశంలోని ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాను ప్రస్తుతం ఉన్న 6 శాతం నుండి ఏకంగా 90 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తోంది. నెట్-జీరో ఉద్గారాల లక్ష్యంతో రానున్న ఈ రోడ్‌మ్యాప్, భారత రవాణా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనుంది.

PREMIUM2047 నాటికి 90 శాతం ప్రైవేట్ వాహనాలు ఎలక్ట్రిక్ వైపే.. నీతి ఆయోగ్ భారీ ప్రణాళిక (AP)
2047 నాటికి 90 శాతం ప్రైవేట్ వాహనాలు ఎలక్ట్రిక్ వైపే.. నీతి ఆయోగ్ భారీ ప్రణాళిక (AP)

రవాణా, పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యవసాయం, విద్యుత్ రంగాలలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు (Decarbonization) నీతి ఆయోగ్ త్వరలోనే ఒక సమగ్ర నివేదికను విడుదల చేయనుంది. 2070 నాటికి భారత్‌ను పూర్తిగా ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే రైలు, విమాన ప్రయాణాల్లో కూడా కీలక మార్పులను ఈ ప్లాన్ సూచించనుంది.

పెరుగుతున్న ఈవీల జోరు

ప్రభుత్వ 'వాహన్' రిజిస్ట్రీ డేటా ప్రకారం, 2025లో మొత్తం వాహన రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 5.9 శాతంగా నమోదైంది. చైనా, ఐరోపా దేశాలతో పోలిస్తే మనం ఇంకా వెనుకబడి ఉన్నప్పటికీ, భారత్‌లో ఈవీల వాడకం క్రమంగా పెరుగుతోంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే స్పష్టం చేసినట్లుగా.. ఆటోమొబైల్ కంపెనీలు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురాక తప్పదు, లేదంటే మార్కెట్ వాటాను కోల్పోయే ప్రమాదం ఉంది.

చిన్న కార్లే కీలకం

"ప్రస్తుతం ఆటోమొబైల్ సంస్థలు కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో ఎక్కువ ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. అయితే సామాన్యులు రోజూవారీ ప్రయాణాలకు వాడే చిన్న కార్ల విభాగంలో మరిన్ని మోడళ్లు రావాలి" అని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ (CSEP) పరిశోధకుడు శ్యామాసిస్ దాస్ అభిప్రాయపడ్డారు. చిన్న ఈవీలలో బ్యాటరీ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల అవి చౌకగా లభిస్తాయని, ఇది మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేవలం వాహనాల అమ్మకాలే కాకుండా, నాణ్యమైన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్, ఇళ్లు, కార్యాలయాల వద్ద సులభంగా ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉండటం అత్యంత కీలకమని ఆయన వివరించారు.

ప్రోత్సాహకాల నుంచి నిబంధనల వైపు..

నీతి ఆయోగ్ కేవలం సబ్సిడీలు, ప్రోత్సాహకాలతోనే సరిపెట్టకుండా, పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించేలా కఠిన నిబంధనలు లేదా పెనాల్టీలు విధించే దిశగా కూడా ఆలోచిస్తోంది. దీనివల్ల ప్రజలు వేగంగా విద్యుత్ వాహనాల వైపు మళ్లే అవకాశం ఉంది. రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ప్రజారవాణాను బలోపేతం చేయడంపై కూడా ఈ నివేదికలో స్పష్టత ఇవ్వనున్నారు.

ఈవీ సవాళ్లు ఏంటి?

"ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మరింత విస్తృతంగా, అందుబాటులోకి రావాలి. అదే సమయంలో కొత్త టెక్నాలజీ సామాన్యులకు అందుబాటు ధరలో ఉండటమే భారత్ ముందున్న అతిపెద్ద సవాలు" అని 'తేరి' (TERI) అసోసియేట్ డైరెక్టర్ షరీఫ్ కమర్ విశ్లేషించారు. గత డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 29,151 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయని లోక్‌సభ గణాంకాలు చెబుతున్నాయి. వీటిని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది.

అలాగే, గ్రీన్ హైడ్రోజన్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు పెరగాలని, రవాణా భారాన్ని రోడ్ల నుండి రైల్వేలకు (Dedicated Freight Corridors) మళ్లించడం ద్వారా కాలుష్యాన్ని మరింత తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

All Access.
One Subscription.

Get 360° coverage—from daily headlines
to 100 year archives.

E-Paper
Full
Archives
Full Access to
HT App & Website
Games
 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe