...
...
Next Story

గ్లోబల్ స్టేజ్‌పై భారతీయ కళా కేతనం- మూడేళ్లలో ఎన్ఎంఏసీసీ సృష్టించిన అరుదైన రికార్డు..

ముంబైలోని నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్​ఎంఏసీసీ) విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకుంది! ప్రపంచ స్థాయి బ్రాడ్‌వే ప్రదర్శనల నుంచి భారతీయ సాంప్రదాయ కళల వరకు సమగ్ర వేదికగా నిలిచిన ఈ కేంద్రం సాధించిన ఘనతలు, రాబోయే సంచలన కార్యక్రమాలపై ప్రత్యేక కథనం..

Published on: Sep 5, 2026, 17:30:46 IST
Advertisement

కళకు సరిహద్దులు లేవు.. కానీ ఆ కళను గుండెల్లో పెట్టుకుని ఆరాధించే వేదికలు కొన్ని మాత్రమే ఉంటాయి! అలాంటి ఒక అత్యద్భుతమైన కళాధామమే ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని "నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్" (ఎన్​ఎంఏసీసీ). భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, లలిత కళల వైభవాన్ని ప్రపంచ వేదికపై సమున్నతంగా నిలబెడుతూనే, అంతర్జాతీయ రంగానికి చెందిన అరుదైన ప్రదర్శనలను భారతీయ ప్రేక్షకులకు చేరువ చేయాలనే మహోన్నత సంకల్పంతో తీర్చిదిద్దిన కేంద్రం ఈ ఎన్​ఎంఏసీసీ.

ముంబై బీకేసీలో ఎన్​ఎంఏసీసీ..
ముంబై బీకేసీలో ఎన్​ఎంఏసీసీ..

పాశ్చాత్య దేశాలకే పరిమితమైన వెస్ట్ ఎండ్ బ్లాక్‌బస్టర్లు, బ్రాడ్‌వే మ్యూజికల్స్, అంతర్జాతీయ కళా ప్రదర్శనలను చూసేందుకు భారతీయులు ఒకప్పుడు ఖండాలు దాటి వెళ్లాల్సి వచ్చేది. మన దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వం, కళాత్మకత ఉన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలను భారీ ఎత్తున ఒకే వేదికపైకి తీసుకువచ్చే సరైన మల్టీడిసిప్లినరీ సెంటర్ లోటు చాలా కాలంగా వేధిస్తూ వచ్చింది. ఆ లోటును భర్తీ చేస్తూ మార్చి 2023లో ముంబై వేదికగా ప్రారంభమైన 'నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (ఎన్​ఎంఏసీసీ) నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందింది.

మైల్​స్టోన్ అలర్ట్- మూడేళ్లలో 3,500 ప్రదర్శనలు, 25 లక్షల మంది సందర్శకులు!

సాంస్కృతిక రంగానికి ప్రపంచ స్థాయి నాణ్యతను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఎన్ఎంఏసీసీ, గత మూడేళ్లలో సాధించిన మైలురాళ్లు అసాధారణమైనవి:

ప్రదర్శనలు: సంగీతం, నాటకం, నృత్యం, విజువల్ ఆర్ట్స్ విభాగాల్లో ఏకంగా 3,500కు పైగా షోలు నిర్వహించారు.

కళాకారులకు ప్రోత్సాహం: 15కు పైగా భాషల్లో 10,500 మందికి పైగా భారతీయ, అంతర్జాతీయ కళాకారులకు ఇక్కడ వేదిక లభించింది.

ప్రేక్షకుల ఆదరణ: దాదాపు 25 లక్షల మందికి పైగా కళాభిమానులు ఈ వేదికను సందర్శించారు.

ది గ్రాండ్ థియేటర్ నుంచి గ్లోబల్ ఆర్ట్ హౌస్ వరకు..

ఎన్​ఎంఏసీసీలోని గ్రాండ్ థియేటర్..

దీనికి తోడు 'ది స్టూడియో థియేటర్', 'ది క్యూబ్' వేదికలు హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ప్రయోగాత్మక నాటకాలు, ప్రైవేట్ కాన్సర్ట్‌లు, కళాత్మక నృత్యాలకు నిలయంగా మారాయి.

అంతర్జాతీయ సరిహద్దులు దాటిన భారతీయ కళ!

ఎన్ఎంఏసీసీ ప్రాంగణంలోని ‘ఆర్ట్ హౌస్’.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం 'వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్', డయా ఆర్ట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో 'లైట్ ఇన్ స్పేస్', 'భక్తి', 'బుల్గారీ సెర్పెంటి ఇన్ఫినిటో' వంటి ప్రపంచ ప్రసిద్ధ ప్రదర్శనలను భారత్‌కు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 'సెకండ్ నేచర్' అనే భారీ ఇన్‌స్టాలేషన్ ప్రదర్శన జనవరి 2027 వరకు అందుబాటులో ఉంది. టీమ్‌ల్యాబ్, ఏ.ఏ. మురాకామి, ఎస్ డెవ్లిన్, రాండమ్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాల ఆర్ట్ వర్క్స్ ఇక్కడ కొలువుదీరాయి.

కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా, గ్లోబల్ ఆర్ట్ వేదికలపై భారత్ తరఫున ఎన్ఎంఏసీసీ గళం విప్పుతోంది. ప్రతిష్టాత్మక ‘61వ వెనిస్ బీనెలే’లో ఇండియా పెవీలియన్ భాగస్వామ్యంతో ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశ కళలను అంతర్జాతీయ వేదికపై మళ్లీ నిలబెట్టింది.

4వ ఏట అడుగుపెడుతూ.. మరిన్ని సంచలనాలు!

విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకుని నాల్గోవ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రదర్శనలకు ఎన్ఎంఏసీసీ సిద్ధమవుతోంది.

  • 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' గ్రాండ్ రీ-ఎంట్రీ
  • ప్రపంచ ప్రసిద్ధ మ్యూజికల్ ‘చికాగో’ ప్రదర్శన
  • ఆస్కార్ నామినేటెడ్ సంగీత దర్శకుడు మాక్స్ రిక్టర్ తొలిసారి భారత్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఈ ప్రయత్నాలు భారతీయ సంస్కృతికి, అంతర్జాతీయ కళారంగానికి మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks