...
...
Next Story

NSE IPO allotment : ఈరోజే ఎన్​ఎస్​ఈ ఐపీఓ అలాట్​మెంట్- అకౌంట్‌లో షేర్లు ఉన్నాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓల్లో ఒకటిగా నిలిచిన ఎన్​ఎస్​ఈ ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రక్రియ ఈరోజు పూర్తికానుంది. దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లు తమకు షేర్లు దక్కాయో లేదో ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో, ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 22, 2026, 09:10:55 IST
Advertisement

దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) తీసుకొచ్చిన రూ. 22,569 కోట్ల మెగా ఐపీఓ సబ్​స్క్రిప్షన్ సోమవారం ముగిసింది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 22) షేర్ల కేటాయింపును యాజమాన్యం ఖరారు చేయనుంది. ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లు తమకు షేర్లు కేటాయించారో లేదో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ అధికారిక పోర్టళ్లతో పాటు రిజిస్ట్రార్ వెబ్‌సైట్ ద్వారా సులభంగా సరిచూసుకోవచ్చు.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ లిస్టింగ్ తేదీ, రీఫండ్ వివరాలు..

ఎన్​ఎస్​ఈ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్ అప్డేట్స్..
ఎన్​ఎస్​ఈ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్ అప్డేట్స్..

ఎన్​ఎస్​ఈ ఐపీఓలో షేర్లు దక్కని ఇన్వెస్టర్లకు సెప్టెంబర్ 23 (బుధవారం) నుంచి డబ్బులు రీఫండ్ అయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే, షేర్లు పొందిన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి అదే రోజున షేర్లు జమ కానున్నాయి. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత, సెప్టెంబర్ 24 (గురువారం) రోజున ఎన్‌ఎస్‌ఈ షేర్లు బీఎస్​ఈలో అధికారికంగా లిస్ట్ కానున్నాయి.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- 5.71 రెట్లు సబ్‌స్క్రిప్షన్..

2026 సంవత్సరంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచిన ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆఫర్ చేసిన 8.86 కోట్ల షేర్లకు గానూ ఏకంగా 50.58 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. అంటే మొత్తంగా 5.71 రెట్ల సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. గరిష్ట ధర పరిమితి వద్ద మొత్తం బిడ్ల విలువ రూ. 90,000 కోట్లు దాటడం విశేషం.

క్వాాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) కేటగిరీ ఏకంగా 12.68 రెట్లు నిండగా, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్​ఐఐ) విభాగంలో 6.55 రెట్ల సబ్‌స్క్రిప్షన్ లభించింది. ఇక సగటు రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.39 రెట్లు నమోదు సాధించింది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ జీఎంపీ..

ప్రస్తుత గ్రే మార్కెట్ ట్రెండ్ ప్రకారం.. ఎన్‌ఎస్‌ఈ ఇష్యూ ధర రూ. 1,785తో పోలిస్తే దాదాపు 3.64 శాతం లాభంతో అంటే రూ. 1,850 వద్ద షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ అల్లాట్‌మెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేయడం ఎలా?

దరఖాస్తుదారులు తమ పాన్ నంబర్ సహాయంతో కేవలం నిమిష వ్యవధిలోనే అల్లాట్‌మెంట్ స్టేటస్‌ను పరిశీలించుకోవచ్చు.

1. బీఎస్‌ఈ వెబ్‌సైట్ ద్వారా:

బీఎస్‌ఈ అధికారిక ఐపీఓ అల్లాట్‌మెంట్ పేజీని సందర్శించండి.

'Issue Type' విభాగంలో 'Equity' ఆప్షన్‌ను ఎంచుకోండి.

'Issue Name' డ్రాప్‌డౌన్ నుంచి 'National Stock Exchange of India Ltd' సెలెక్ట్ చేయండి.

మీ పాన్ నంబర్‌ను ఎంటర్ చేసి 'Search' పై క్లిక్ చేస్తే మీ స్టేటస్ ప్రత్యక్షమవుతుంది.

2. ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్ ద్వారా:

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ బిడ్ వెరిఫికేషన్ పోర్టల్‌లోకి వెళ్లండి.

'Equity & SME IPO bid details' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

డ్రాప్‌డౌన్ జాబితా నుంచి 'NSE' ని ఎంచుకోండి.

మీ పాన్ నంబర్ నమోదు చేసి 'Submit' క్లిక్ చేయండి.

3. రిజిస్ట్రార్ పోర్టల్ ద్వారా:

ఎంయూఎఫ్‌జీ ఇన్‌టైమ్ ఇండియా (MUFG Intime India) ఐపీఓ స్టేటస్ పేజీ తెరవండి.

కంపెనీల జాబితాలో 'National Stock Exchange of India Ltd' ఎంచుకోండి.

మీ పాన్ లేదా అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేసి 'Submit' బటన్ నొక్కండి.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ ముఖ్యాంశాలు..

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ బిడ్డింగ్ సెప్టెంబర్ 17న ప్రారంభమై సెప్టెంబర్ 21న పూర్తయింది. ఒక షేరు ధర పరిమితిని రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించారు. ఒక్కో లాట్‌కు 8 షేర్లు కేటాయించారు. ఇది పూర్తి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) విధానంలో వచ్చిన ఇష్యూ. అందువల్ల ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులు నేరుగా షేర్లను విక్రయించిన ప్రస్తుత వాటాదారులకే చెందుతాయి. కొటక్ మహీంద్రా క్యాపిటల్ సంస్థ ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్‌గా వ్యవహరించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks