ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 'నైకా' (FSN E-Commerce Ventures) షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ సరికొత్త కవరేజ్ ప్రారంభించింది. దీర్ఘకాలిక వ్యూహంతో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని (Buy Rating) సిఫార్సు చేస్తూ, టార్గెట్ ధరను రూ. 400గా నిర్ణయించింది.

స్టాక్ మార్కెట్ ఆరంగేట్రం (Listing) తర్వాత రెండేళ్ల పాటు వృద్ధి మందగించడం, ఫ్యాషన్ విభాగంలో మార్జిన్ ఒత్తిడుల వల్ల ఒడుదొడుకులు ఎదుర్కొన్న నైకా, 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఊహించని రీతిలో పుంజుకుంది. ఏకంగా 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లకు పైగా) రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసి పటిష్టమైన స్థితికి చేరుకుంది.
డ్యూయల్ ఇంజిన్ వ్యూహంతో మార్జిన్ల విస్తరణ
"నైకా షేర్లకు రూ.400 టార్గెట్ ధర నిర్ణయిస్తూ 'బై' రేటింగ్ ఇస్తున్నాం. ఎఫ్‌వై29ఈ ఈబిట్డా (FY29e EBITDA)కు 50 రెట్లు వ్యాల్యుయేషన్ కట్టి ఈ అంచనాకు వచ్చాం. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, విభాగంలో ఆధిపత్యం, కీలక రంగాల్లో లాభాల విస్తరణను పరిగణనలోకి తీసుకుంటే రిటైల్ రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే నైకా ప్రీమియం వ్యాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతుందని భావిస్తున్నాం," అని ఆనంద్ రాఠీ తన పరిశోధన నివేదికలో స్పష్టం చేసింది.
కంపెనీ లాభాల బాట పట్టడానికి ద్విముఖ వ్యూహం ప్రధాన కారణమని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ (BPC) విభాగంలో ప్రీమియమైజేషన్ ద్వారా లాభదాయకతను పెంచడం, ఫ్యాషన్ విభాగంలో యూనిట్ ఎకనామిక్స్‌ను బలోపేతం చేయడం ద్వారా నైకా తన వ్యాపారాన్ని మళ్లీ పరుగులు తీయిస్తోంది.
డిజిటల్ వినియోగదారుల పెరుగుదలే ప్లస్ పాయింట్
భారతీయ రిటైల్ మార్కెట్ ఆఫ్ లైన్ నుంచి ఆన్‌లైన్‌కు, అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ రంగానికి వేగంగా మారుతోంది. డిజిటల్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటం నైకాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.
{{/usCountry}}భారతీయ రిటైల్ మార్కెట్ ఆఫ్ లైన్ నుంచి ఆన్‌లైన్‌కు, అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ రంగానికి వేగంగా మారుతోంది. డిజిటల్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటం నైకాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.
{{/usCountry}}"బ్యూటీ విభాగంలో అగ్రగామి స్థానం, ప్రీమియం వ్యాపార భాగస్వామ్యాలు, హౌస్ ఆఫ్ నైకా పోర్ట్‌ఫోలియో జోరు, ఫ్యాషన్ విభాగంలో మెరుగైన ఫలితాలు నైకాను ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌గా నిలబెట్టాయి" అని ఆనంద్ రాఠీ విశ్లేషించింది.
మదుపరులకు కాసుల వర్షం.. షేర్ల పనితీరు ఇదే
స్వల్పకాలంలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, నైకా షేర్లు మధ్యస్థ, దీర్ఘకాలంలో మదుపరులకు అద్భుతమైన రాబడులను అందించాయి. గడిచిన వారంలో ఈ షేరు 0.40 శాతం స్వల్పంగా తగ్గగా, గత నెల రోజుల్లో 1.35 శాతం పెరిగింది.
ఈ ఏడాది (YTD) ప్రారంభం నుంచి చూస్తే ఈ స్టాక్ 26.68 శాతం లాభపడగా, గడిచిన ఏడాది కాలంలో 30.75 శాతం ర్యాలీ చేసింది. మూడేళ్ల కాలపరిమితిలో నైకా షేర్లు ఏకంగా 133.87 శాతం పెరిగి, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభనష్టాలతో కూడుకుని ఉంటాయి. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలైనా ఆర్థిక నిపుణుల సలహా మేరకు తీసుకోవడం శ్రేయస్కరం.)