...
...
Next Story

Electric bikes : 150+ కి.మీ రేంజ్​తో రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​- సూపర్​ స్టైలిష్​గా! ఏది బెస్ట్?

Oben Rorr Evo Vs Matter Aera 5000 : ఓబెన్​ సంస్థ ఇటీవలే రోర్​ ఈవో అనే ఎలక్ట్రిక్​ బైక్​ని లాంచ్​ చేసింది. ఇది మ్యాటర్​ ఏరా 5000కి గట్టిపోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, దేని రేంజ్ ఎక్కువ? దేని ధర తక్కువ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 3, 2026, 06:44:00 IST
Advertisement

భారత ఈవీ మార్కెట్​లో సంచలనం సృష్టిస్తూ ఓబెన్ ఎలక్ట్రిక్ తన సరికొత్త మోడల్ ‘రోర్ ఈవో’ ఎలక్ట్రిక్ బైక్​ని ఇటీవలే విడుదల చేసింది. కేవలం రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ బైక్, మధ్యతరగతి వాహనదారులకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది. ఇక ఇప్పటికే మార్కెట్​లో ఉన్న మ్యాటర్ ఏరా 5000 ఎలక్ట్రిక్ బైక్‌కు ఇది ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రెండిటినీ పోల్చి, కొనుగోలుగు ఏది ఉత్తమం? అనేది తెలుసుకుందాము..

రోర్​ ఈవో వర్సెస్​ మ్యాటర్​ ఏరా 5000- బ్యాటరీ సామర్థ్యం, పనితీరు..

ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్​లో ఏది బెస్ట్?
ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్​లో ఏది బెస్ట్?

ఓబెన్ రోర్ ఈవోలో కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 3.4 కేడబ్ల్యూహెచ్ హై-పర్ఫార్మెన్స్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీని వాడారు. సాధారణ లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే, ఈ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలకు వేడిని తట్టుకునే శక్తి 50 శాతం ఎక్కువగా ఉంటుంది. భారతీయ వాతావరణ పరిస్థితులకు, ముఖ్యంగా వేసవి తాపానికి ఇవి ఎంతో అనువైనవి.

టార్క్‌: ఇది 250 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పికప్: కేవలం 3 సెకన్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

వారంటీ: వినియోగదారుల్లో భరోసా కల్పించేందుకు బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల వారంటీని కంపెనీ ప్రకటించింది.

మరోవైపు, మ్యాటర్ ఏరా 5000 ఎలక్ట్రిక్​ బైక్​లో 5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 11.5 కేడబ్ల్యూ పీక్ పవర్, 450 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. పవర్​ పరంగా మ్యాటర్ ఏరా కాస్త ముందున్నా, ధర విషయంలో రోర్ ఈవో భారీ వ్యత్యాసాన్ని చూపిస్తోంది.

రోర్​ ఈవో వర్సెస్​ మ్యాటర్​ ఏరా 5000- రేంజ్, టాప్ స్పీడ్..

సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్ కొనేవారు ముందుగా చూసేది రేంజ్. ఓబెన్ రోర్ ఈవో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల (ఐడీసీ) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇక మ్యాటర్ ఏరా 5000 విషయానికి వస్తే, ఇది గంటకు 105 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. 172 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

రోర్​ ఈవో వర్సెస్​ మ్యాటర్​ ఏరా 5000- ఛార్జింగ్ టైమ్..

ఈ రోర్​ ఈవో ఎలక్ట్రిక్​ బైక్​ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ని రూ. 99,999గా ప్రకటించింది ఓబెన్​ ఎలక్ట్రిక్​ సంస్థ. ఇది కేవలం మొదటి 10,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దీని ధర రూ. 1.25 లక్షలకు పెరుగుతుంది. ఇక మ్యాటర్​ ఏరా 5000 ఎక్స్​షోరూం ధర రూ. 1.81లక్షలుగా ఉంది.

రోర్​ ఈవో వర్సెస్​ మ్యాటర్​ ఏరా 5000- ఏది కొనాలి?

మీరు తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ వారంటీ, మెరుగైన రేంజ్ ఉన్న బైక్ కావాలనుకుంటే ఓబెన్ రోర్ ఈవో ఉత్తమ ఎంపిక. ముఖ్యంగా దీనిలోని ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీ భద్రత పరంగా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఒకవేళ మీకు బడ్జెట్ పరిమితి లేకపోయినా, ఇంకా ఎక్కువ పవర్ కావాలనుకుంటే మ్యాటర్ ఏరా వైపు చూడవచ్చు. అయితే, రోర్ ఈవో కొనాలనుకుంటే.. దాని ప్రారంభ ధర ఆఫర్ ముగియక ముందే బుక్ చేసుకోవడం లాభదాయకం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe