Ola Roadster : ఓలా ఎలక్ట్రిక్ హోలీ ఆఫర్- రోడ్‌స్టర్ బైక్‌పై భారీ తగ్గింపు.. త్వరపడండి!
హోలీ పండుగ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తన 'రోడ్‌స్టర్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధరలను భారీగా తగ్గించింది. 'హోలీ మహోత్సవ్' క్యాంపైన్ భాగంగా ఇప్పుడు ఈ బైక్ కేవలం రూ. 79,999 (ప్రారంభ ధర) కే లభిస్తోంది. దీనితో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను సంస్థ ప్రకటించింది.
పండుగ వేళ భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కస్టమర్లకు తీపి కబురు అందించింది. 'హోలీ మహోత్సవ్' పేరుతో చేపట్టిన ప్రత్యేక క్యాంపైన్లో భాగంగా తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘రోడ్‌స్టర్’ ధరలను భారీగా తగ్గించింది. పెట్రోల్ బైక్ కొనాలనుకునే వారిని సైతం ఎలక్ట్రిక్ వైపు మళ్లించేలా, అత్యంత సరసమైన ధరలకే వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓలా రోడ్‌స్టర్: కొత్త ధరల వివరాలు..
కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్ సిరీస్‌లో వివిధ బ్యాటరీ ఆప్షన్లు, ధరలను ఇలా నిర్ణయించింది:
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్: దీని ప్రారంభ ధరను రూ. 79,999 కు తగ్గించారు.
3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్: రూ. 92,999
4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్: రూ. 99,999
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్:
4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్: రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)
9.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్: రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)
'ముహూర్త మహోత్సవం' - పరిమిత కాల ఆఫర్..
సాధారణ డిస్కౌంట్లతో పాటు ఓలా 'ముహూర్త మహోత్సవం' పేరుతో ఒక ప్రత్యేక సేల్‌ను కూడా నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు కేవలం 90 నిమిషాల 'శుభ ముహూర్తం' సమయంలో పరిమిత సంఖ్యలో వాహనాలను ప్రత్యేక పండుగ ధరలకే విక్రయిస్తారు.
ఓలా ఇన్‌సైడర్స్: ఇప్పటికే ఓలా వాహనాలు వాడుతున్న 'ఓలా ఇన్‌సైడర్' కమ్యూనిటీ సభ్యులకు ఈ ముహూర్త సమయంలో అదనంగా రూ. 5,000 ప్రయోజనం లభిస్తుంది.
స్కూటర్లపై ఆఫర్లు: ఎంపిక చేసిన ఎస్1 ప్రో, ఎస్1 ప్రో+ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 8 ఏళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.
పాత వాహనం ఇస్తే భారీ ప్రయోజనాలు..
మీరు పాత స్కూటర్‌ను ఎక్స్ఛేంజ్ చేసి కొత్త 'జనరేషన్ ఎస్1' స్కూటర్ లేదా 'రోడ్‌స్టర్' మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేస్తే, దాదాపు రూ. 50,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
అంతేకాకుండా, ఇప్పటికే ఓలా వాహనం కలిగి ఉండి, అదే పేరుతో రెండో వాహనాన్ని కొనుగోలు చేసే వారికి రూ. 20,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో క్యాష్‌బ్యాక్, 'MoveOS' ప్లాట్‌ఫారమ్ ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్లు కూడా భాగమై ఉన్నాయి.
తాజా ఆఫర్లతో.. ఈ ఓలా రోడ్‌స్టర్ బైక్ ఇప్పుడు అనేక బెస్ట్ సెల్లింగ్ ఐసీఈ వెహికిల్స్ కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఐసీఈ బైక్ కన్నా తక్కువ ధరకే ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అందించడం ద్వారా మార్కెట్లో తన పట్టును మరింత బిగించాలని ఓలా లక్ష్యంగా పెట్టుకుంది.
పడిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ సేల్స్..
2026 ఫిబ్రవరిలో భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 76,720 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 46 శాతం వృద్ధితో 1,11,680 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతేకాదు, ఈ సేల్స్ గణాంకాల్లో తయారీదారుల ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీవీఎస్ మోటార్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడసలు టాప్-5 జాబితాలోనే లేకపోవడం గమనార్హం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ తెలుసుకోండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


