TVS iQube : సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ రేంజ్- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే..
Best selling electric scooter : పట్టణ ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టీవీఎస్ ఐక్యూబ్.. అత్యాధునిక సాంకేతికతతో ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతోంది. విభిన్న బ్యాటరీ ఆప్షన్లు, ప్రభుత్వ సబ్సిడీలతో మధ్యతరగతికి ఇది ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.
2026 ఫిబ్రవరికి సంబంధించిన ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ డేటా ఇటీవలే విడుదలైంది. వరుసగా రెండోసారి టీవీఎస్ సంస్థ ఈ విభాగంలో దూసుకెళ్లింది. గత నెలలో టీవీఎస్ సంస్థ 31,600 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో చాలా వరకు టీవీఎస్ ఐక్యూబ్ ఈ-స్కూటర్లే ఉన్నాయి. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఇప్పుడు ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ ఈవీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది? దీని రేంజ్ ఎంత? ధర ఎంత? ఫీచర్లు ఏంటి? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్- ముఖ్యాంశాలు..
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం భారీగా పెరుగుతోంది. ఈ రేసులో టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి వచ్చిన ‘ఐక్యూబ్’ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆధునిక పట్టణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఈ- స్కూటర్.. అటు ప్రాక్టికాలిటీని, ఇటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని సమపాళ్లలో అందిస్తోంది. సాంప్రదాయ స్కూటర్లకు బలమైన ప్రత్యామ్నాయంగా, పర్యావరణ హితమైన వాహనంగా ఇది గుర్తింపు పొందడం వల్లే దీని సేల్స్ ఎక్కువగా ఉన్నాయి.
సిటీ రైడింగ్‌కు అనుకూలం: సమతుల్యమైన డిజైన్ వల్ల ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించవచ్చు.
విభిన్న వేరియంట్లు: కస్టమర్ల బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలతో లభిస్తోంది.
స్మార్ట్ టెక్నాలజీ: టీవీఎస్ SmartXonnect ఫీచర్ ద్వారా భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరిచారు.
తక్కువ ధర : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చే రేంజ్, ఫీచర్స్‌తో పోల్చితే ధర తక్కువే అని అభిప్రాయాలు ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్- బ్యాటరీ, రేంజ్..
ఈ ఐక్యూబ్ ఈవీ బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇలా ఉన్నాయి..
| వేరియంట్ (కేడబ్ల్యూహెచ్) | బ్యాటరీ కెపాసిటీ (కేడబ్ల్యూహెచ్) | ఐడీసీ రేంజ్ (కి.మీ) |
|---|---|---|
| బేస్ | 2.2 | 94 |
| స్టాండర్డ్ | 3.1 | 123 |
| 3.5 | 3.5 | 145 |
| 5.3 | 5.3 | 212 |
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్- ఛార్జింగ్ వివరాలు..
మే 2022లో సరికొత్త హంగులతో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ లైనప్, క్రమంగా మరిన్ని అప్‌డేట్లను పొందుతూ వచ్చింది. చివరిగా జులై 2025లో కొత్తగా 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్‌ను కూడా సంస్థ ప్రవేశపెట్టింది.
ఛార్జింగ్ సమయం (0-80% వరకు):
2.2 కేడబ్ల్యూహెచ్: 2 గంటల 45 నిమిషాలు
3.1 కేడబ్ల్యూహెచ్: 4 గంటల 03 నిమిషాలు
3.5 కేడబ్ల్యూహెచ్ (ఎస్/ఎస్టీ వేరియంట్లు): 3 గంటలు
5.1 కేడబ్ల్యూహెచ్ (ఎస్టీ వేరియంట్): 4 గంటల 18 నిమిషాలు
ఈ బ్యాటరీలన్నీ ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంటాయి. అంటే నీరు, ధూళి వల్ల వీటికి ఎలాంటి నష్టం వాటిల్లదు.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్- అదిరిపోయే ఫీచర్లు, టెక్నాలజీ..
ఐక్యూబ్ స్కూటర్ రైడర్ సౌలభ్యం కోసం బోలెడన్ని ఫీచర్లను అందిస్తోంది:
డిస్‌ప్లే: డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. టాప్-ఎండ్ వేరియంట్ (ఎస్టీ)లో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది.
కనెక్టివిటీ: స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, జియో-ఫెన్సింగ్, రిమోట్ బ్యాటరీ స్టేటస్, కాల్/మెసేజ్ అలర్ట్‌లను పొందవచ్చు.
భద్రత: ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ (టీపీఎంఎస్), రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.
స్టోరేజ్: సీటు కింద 30 నుంచి 32 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్- డైమెన్షన్స్, కలర్స్..
ఈ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 165 ఎంఎం, సీటు హైట్ 770 ఎంఎంగా ఉంది. వేరియంట్‌ను బట్టి బరువు 110-128 కిలోల వరకు ఉంటుంది. ఇది పర్ల్ వైట్, వాల్‌నట్ బ్రౌన్, టైటానియం గ్రే, మింట్ బ్లూ వంటి అనేక ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్- ధర..
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 94,434 నుంచి రూ. 1,58,834 వరకు ఉంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్: తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే ఐక్యూబ్ మెరుగైనదా?
ఇది మీ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో వేగంగా దూసుకుపోతుంది. కానీ రేంజ్ విషయంలో టీవీఎస్ ఐక్యూబ్ టాప్ వేరియంట్ 212 కి.మీ వరకు వెళుతుంది (ఓలా 176 కి.మీ మాత్రమే). ఐక్యూబ్‌లో జోయ్‌స్టిక్ నావిగేషన్ ఉంటే, ఓలాలో పెద్ద టచ్‌స్క్రీన్ ఉంటుంది. సర్వీస్ పరంగా రెండు కంపెనీలపై మిశ్రమ స్పందనలు ఉన్నాయి.
2. ఐక్యూబ్ బ్యాటరీ జీవితకాలం ఎంత?
దీని లిథియం-అయాన్ బ్యాటరీ సుమారు 800 సైకిళ్ల (సుమారు 75,000 కి.మీ) వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత బ్యాటరీ సామర్థ్యం 10-20% తగ్గే అవకాశం ఉంది. కంపెనీ దీనిపై 3 ఏళ్లు లేదా 50,000 కి.మీ వారంటీని అందిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


